రైడింగ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాపిడో.. తన సర్వీసులను మరింత విస్తరిస్తోంది. ట్రావెల్ సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం ద్వారా దాని ప్లాట్ ఫామ్ లో ట్రావెల్ బుకింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై రాపిడో యాప్ లోనే Goibibo ద్వారా విమానాలు, హోటళ్లను, redBus ద్వారా ఇంటర్ సిటీ బస్సులు, ConfirmTkt ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అన్ని సౌకర్యాలు నేరుగా Rapido అప్లికేషన్ లోనే అందుబాటులోనే ఉంచుతున్నట్లు వెల్లడించింది.
400 కంటే ఎక్కువ నగరాల్లో రైడ్ షేరింగ్ ప్లాట్ ఫామ్ గా పనిచేస్తున్న బెంగళూరు బేస్ డ్ రాపిడో కంపెనీ, తన యాప్ హోమ్ స్క్రీన్ కు స్పెషల్ ట్రావెల్ విభాగాన్ని జోడించింది. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా వినియోగదారులు స్థానిక రవాణా ఎంపికలతో పాటు సుదూర ప్రయాణాలకు బుకింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. MakeMyTrip ట్రావెల్ బ్రాండ్‌లు అయిన Goibibo, redBus, ixigo గ్రూప్ లో భాగమైన ConfirmTkt ఉన్నాయి. ఆయాన కంపెనీల ప్రకారం, రాపిడోతో ఈ సహకారం టైర్ 2, టైర్ 3 నగరాల్లో డిజిటల్ ట్రావెల్ బుకింగ్స్ ను విస్తరించడమే లక్ష్యంగా రాపిడో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుంది.
ప్రారంభ ఆఫర్లలో భాగంగా Goibibo ద్వారా విమానాలపై రూ. 4,000 వరకు, హోటళ్లపై 55% వరకు తగ్గింపు అందిస్తున్నట్లు రాపిడో ప్రకటించింది. redBus ద్వారా రూ. 300 వరకు బస్సు బుకింగ్ లపై 20% తగ్గింపు అందిస్తుంది. ConfirmTkt ద్వారా రైలు బుకింగ్ లపై సర్వీస్ ఛార్జీలు రద్దు చేసింది. బుకింగ్ ప్రక్రియ రాపిడో ఇంటర్ ఫేస్ లో యాడ్ చేసిన భాగస్వామి ప్లాట్ ఫారమ్ ల ద్వారా నిర్వహించబడుతుంది.
Read Also: బస్సులో మంటలు చెలరేగితే.. కంగారు పడకుండా ఇలా చేస్తే సేఫ్ గా బయటపడొచ్చు!
రాపిడో 50 మిలియన్ల నెలవారీ యాక్టివ్ వినియోగదారులను కలిగి ఉంది. కంపెనీ తన కార్యకలాపాలను 1,000 కంటే ఎక్కువ నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. తాజా నిర్ణయం ద్వారా రోజువారీ ప్రయాణాల నుంచి సుదూర ప్రయాణాల వరకు సరసమైన ధరలో సర్వీసులు అందించాలని భావిస్తున్నట్లు రాపిడో ప్రకటించింది. చిన్న మార్కెట్లలోని ప్రయాణికులను చేరుకోవడానికి ఈ భాగస్వామ్యం సహాయపడుతుందని మేక్ మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు, CEO రాజేష్ మాగోవ్ అన్నారు. కన్ఫర్మ్ టికెటి, ఇక్సిగో ట్రైన్స్ సిఇఒ దినేష్ కుమార్ కోథా.. ఈ అనుసంధానం రైలు బుకింగ్ సేవలను రాపిడో వినియోగదారుల స్థావరానికి తీసుకువస్తుందన్నారు. తాజా నిర్ణయం ద్వారా రాపిడో సర్వీసులు రైడ్ షేరింగ్ కు మించి ట్రావెల్ బుకింగ్ రంగంలోకి విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ఇలాంటి ఇంటిగ్రేటెడ్ సేవలను అందించే ఇతర మొబిలిటీ ప్లాట్ ఫామ్ లతో రాపిడో గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది.
Read Also: వావ్.. 7 వేల కిలోమీటర్ల బుల్లెట్ రైలు కారిడార్, అదిరిపోయే న్యూస్ చెప్పిన అశ్విని వైష్ణవ్!