E-Paper
Advertisement

YSRCP On TDP Drugs Mafia: తుస్సు మన్న వైసీపీ బిగ్ రివీల్, దీనికే అంత బిల్డప్పా?

YSRCP On TDP Drugs Mafia: తుస్సు మన్న వైసీపీ బిగ్ రివీల్, దీనికే అంత బిల్డప్పా?
Advertisement

YSRCP On TDP Drugs Mafia: పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు‌‌గా కనిపిస్తోంది వైసీపీ చేష్టలు. టీడీపీ బిగ్ బ్రేకింగ్ అంటూ ప్రకటించిన కొద్దిసేపటికే, ఆ థీమ్‌ని కాపీ కొట్టేసింది వైసీపీ. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ విషయాన్ని రివీల్ చేసింది వైసీపీ. తీరా వైసీపీ పెట్టిన బిగ్ రివీల్ చూసిన తర్వాత తుస్సు మంది.. కార్యకర్తలను ఉసూరు మనిపించింది.

అధికారంలో ఉన్నవారి దగ్గర ఎంతో కొంత సమాచారం ఉంటుంది. టీడీపీ దగ్గరున్న సమాచారం మేరకు..  బుధవారం రాత్రి ఎనిమిదన్నర గంటలకు వైఎస్ షర్మిల.. జగన్‌కు రాసిన లేఖను బయటపెట్టింది. ఒక విధంగా అదొక సంచలనం. అంతర్గతంగా ఏం జరిగింది? వైఎస్ఆర్ ఆస్తుల పంపకాల విషయంలో జరుగుతోందన్నది ఆ లేఖ ద్వారానే బయట ప్రపంచానికి తెలిసింది.

Advertisement

వైసీపీ బిగ్ రివీల్ విషయానికొద్దాం. అంతా గాసిప్స్ మాదిరిగా వెల్లడించింది. తాము ఇచ్చిన సమాచారం వంద శాతం కరెక్ట్ అని చెప్పలేకపోయింది. చాలా వరకు వాటిని బ్లర్ చేసింది. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియా నడిపే వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా అంటూ ప్రశ్నించింది.

కొన్నాళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతున్నారని, దాని వెనుక ఎల్లో న్యూస్ ఛానెల్ అధినేత అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. క్లారిటీ లేకుండా బిగ్ రివీల్ అంటూ చెప్పుకోవడం దేనికంటూ అప్పుడే సోషల్ మీడియాలో వైసీపీపై కౌంటర్లు పడిపోతున్నాయి.

Advertisement

ALSO READ: విజయనగరంలో జగన్, డయేరియా బాధితులకు పరామర్శ

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో పరువు నష్ట దావా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ.. డ్రగ్స్‌కు సంబంధించిన ఆయా వ్యక్తుల పేర్లు బయట పెట్టలేదని కొందరు అంటున్నారు. వైసీపీ హయాంలో విశాఖ పోర్టులో కంటెయినర్ల వ్యవహారం బయటపడింది. దాని సమాచారం ఏందన్నది కొందరి ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. బిగ్ రివీల్ ఏమోగానీ.. వైసీపీ దీంతో మరింత చులకనైపోయిందనే టాక్ జోరుగా సాగుతోంది.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×