BigTV English

Roja hot comments: యాక్టివ్ అయిన రోజా.. తప్పు చేయలేదు.. రేపైనా..

Roja hot comments: యాక్టివ్ అయిన రోజా.. తప్పు చేయలేదు.. రేపైనా..

Roja hot comments: వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా యాక్టివ్ అవుతుందా? తమిళనాడు నేతలు ఈమెని వద్దనుకున్నారా? ఏపీలో మళ్లీ యాక్టివ్ కావాలని భావిస్తున్నారా? చాన్నాళ్లు తర్వాత ప్రజల్లోకి రావడం వెనుక ఏం జరిగింది? ఆమె మాట తీరు అదే విధంగా ఉందా? అవుననే సమాధాలు వస్తున్నాయి.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా నేతల తీరు మారలేదు. అధినేత నుంచి ఎమ్మెల్యేల వరకు అదే మాట. ఈ జాబితాలోకి మాజీ మంత్రి రోజా కూడా చేరిపోయారు. ఎన్నికలు సునామీలా జరిగాయన్న రోజా, ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదన్నారు. వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడం వెనుక కారణాలు తెలీదన్నారు. అలాంటి తప్పులు వైసీపీ చేయలేదన్నారు. ఏం జరిగిందనేది ఇప్పుడు కాకపోయినా.. రేపైనా బయటకు వస్తుందన్నారు.

పుత్తూరులో బలిజ భవన్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు వైసీపీ ఎందుకు ఓడిపోయిందో నేతలు కూర్చుని విశ్లేషించుకుంటే, తప్పు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది. కానీ రోజా మాత్రం.. మిగతా నేతల మాదిరిగానే ఏదో జరిగిపోయిందంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


ALSO READ:  పగ పట్టి హింసించి జైల్లో.. ముంబై నటి జెత్వానీ చేసిన తప్పేంటి?

వైసీపీ ఎందుకు ఓడిపోయిందో నేతలు కూర్చుని విశ్లేషించుకుంటే, తప్పు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది.  రోజా మాత్రం.. మిగతా నేతల మాదిరిగానే ఏదో జరిగిపోయిందంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో ప్రజల వాయిస్ వినిపించేందుకు అధినేత సైతం సిద్ధంగా లేరు.

ఎంతసేపు తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ డిమాండ్ చేయడం తప్పితే మరొకటి కనిపించలేదు. నార్మల్‌గా అయితే కూటమి.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని తొలుత భావించింది. కాకపోతే 2014-19 సమయంలో ప్రపంచబ్యాంకుకు ఆ పార్టీ అనేక రకాలుగా లేఖలు రాసింది. చివరకు నిధులు ఇవ్వకుండా నిలువరించింది.

దీన్ని గమనించిన కూటమి నేతలు భావించారు. ప్రజలు వారిని దూరంగా పెట్టారని చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఎందుకు వ్యతిరేకించారో అర్థం చేసుకోలేదు. కనీసం తప్పులు సరి చేసుకుని ప్రజల తరపున పోరాడితే ప్రజలు ఫ్యాన్ పార్టీని ఆదరించవచ్చు. కానీ ఆ ఆలోచన లేదని అంటున్నారు.

అన్నట్లు ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు మాజీ మంత్రి రోజా. చివరకు తన సోషల్‌మీడియాలో వైసీపీ అనే పదాన్ని తొలగించారు. దీంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తారని అంతా అనుకున్నారు. కేవలం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అని మాత్రమే పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల వైపు ఆమె చూస్తున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. కాకపోతే అక్కడి రాజకీయ పార్టీలు ఈమెని దూరంగా పెట్టారంటూ చెన్నైలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. పరిస్థితి గమనించిన రోజా.. అందుకోసమే మళ్లీ ఏపీలో యాక్టివ్ అయ్యారని అంటున్నవాళ్లూ లేకపోలేదు. అందుకోసమే కమ్యూనిటీ భవనాల ప్రారంభానికి హాజరై వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. మరి రోజా మదిలో ఏముందో?

Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×