BigTV English
Advertisement

Mathu Vadalara 2 Teaser : ‘మత్తు వదలరా 2’ టీజర్.. వెల్‌కమ్‌ టు హీ టీమ్, ‘హేమా’ను వదల్లేదుగా!

Mathu Vadalara 2 Teaser : ‘మత్తు వదలరా 2’ టీజర్.. వెల్‌కమ్‌ టు హీ టీమ్, ‘హేమా’ను వదల్లేదుగా!

Mathu Vadalara 2 Teaser : శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త సినిమా ‘మత్తు వదలర 2’. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందుతోంది. ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గతంలో రిలీజ్ అయి మంచి హిట్‌ను అందుకుంది. ఒక చిన్న సినిమాగా విడుదలైన ‘మత్తువదలర’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయింది. ఇందులో నటించిన శ్రీ సింహకు కూడా మంచి పేరు వచ్చింది.


అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘మత్తు వదలర 2’ త్వరలో రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 13న గ్రాండ్‌ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన తర్వాత నవ్వకుండా ఉండటం కష్టమే అని చెప్పాలి. హీరో శ్రీ సింహా, నటుడు సత్య మధ్య కామెడీ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. అంతేకాకుండా ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయానడంలో ఎలాంటి సందేహం లేదు.

ఫస్ట్ పార్ట్‌లో అన్ని ఎలిమెంట్స్ కలిపి చూపించిన మేకర్స్.. సెకండ్ పార్ట్‌ను మరింతగా రూపొందించారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ ఇలా ప్రతి ఒక్క విభాగాన్ని టచ్ చేస్తూ కట్ చేసిన టీజర్ అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేసింది. టీజర్ ప్రకారం.. మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది.. కానీ సెకండ్ పార్ట్‌ మాత్రం హెవీ ఎక్స్‌పెర్టేషన్‌తో వచ్చింది అని స్టార్ట్ చేస్తూ టీజర్ మొదలైంది. ఆ తర్వాత వెల్‌కమ్‌ టు హీ టీమ్ అంటూ చెప్పిన తర్వాత శ్రీ సింహా, సత్యల ఎంట్రీ అదిరిపోయింది.


Also Read:  మత్తు వదలరా 2కు పోటీగా వస్తున్న కళింగ..

అలాగే ఆ తర్వాత సునీల్, ఫరియా అబ్దుల్లా యాక్షన్ సీక్వెన్స్ అద్బుతంగా ఉన్నాయి. నిజంగా ‘జాతి రత్నాలు’ మూవీలో ఒక ఇన్నోసెంట్ లాయర్‌గా ఉన్న ఫరియా ఈ సినిమాలో మాత్రం ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపించి అదరగొట్టేసింది. అయితే ఇక్కడ శ్రీ సింహా డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎక్కువగా ఉద్యోగాలు చేసే యూత్‌కి ఈ డైలాగ్ సెట్ అవుతుంది. డెలివరీ బాయ్‌గా చేసినా.. ‘‘స్పెషల్ ఏజెంట్‌గా చేసినా డబ్బులు మాత్రం సరిపడటం లేదు’’ అని చెప్పే డైలాగ్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది.

ఇలా శ్రీ సింహా, ఫరియా, సునీల్, వెన్నెల కిషోర్, తదితర నటుల పెర్ఫార్మెన్స్‌ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో నటుడు సత్య డైలాగ్ మాత్రం అందరినీ ఆకట్టుంది. ఇటీవల నటి హేమ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె పేరుతో ఓ డైలాగ్‌ను ఇందులో పెట్టినట్లు తెలుస్తుంది. నటుడు సత్య ఓ వ్యక్తిని డ్రగ్స్ కేసులో పట్టుకుని.. ‘‘డ్రగ్స్ కావాలా పెద్ద పెద్ద హేమ హేమీలే దొరికిపోయార్రా’’ అంటూ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ అండ్ ఛేజింగ్ సీన్లు సినీ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇలా ప్రతి ఒక్క సన్నివేశాన్ని టీజర్‌లో చూపించి అదరగొట్టేశారు మేకర్స్. చూడాలి మరి సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×