E-Paper
Advertisement

Nara Lokesh : చంద్రబాబు కాదు.. నారా లోకేశే వారి టార్గెట్!

Nara Lokesh : చంద్రబాబు కాదు.. నారా లోకేశే వారి టార్గెట్!
Advertisement

ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. మొన్నటివరకు సీఎం చంద్రబాబును విమర్శించిన ప్రతిపక్షాలు ఇప్పుడు మంత్రి నారాలోకేశ్‌ను టార్గెట్‌గా చేసుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టుల వెనుక నారా లోకేశ్ హస్తం ఉందని, ఆయన రెడ్ బుక్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ పార్టీ విమర్శలు చేస్తున్నది. 2023 ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ‌్‌తో కలిసి నారా లోకేశ్ కీలక పాత్ర పోషించిన తెలిసిందే.

బాధ్యతలు చేపట్టగానే కీలక నిర్ణయాలు..

కూటమి ప్రభుత్వంలో ఐటీ, హ్యుమన్ రిసోర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేశ్..‘యువత, ఉపాధి, టెక్నాలజీ’ అనే మూడు అంశాలపై తన మార్క్ పాలన ఉంటుందని ముందే ప్రకటించారు.విద్యాశాఖలో సంస్కరణలు,డిజిటల్ లెర్నింగ్, స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయాలు.. ఐటీలో పెట్టుబడుల ఆకర్షణకు బెంగళూరు, హైదరాబాద్ తరహా ఎకోసిస్టమ్ ఏపీలో నిర్మించాలనే లక్ష్యంతో గ్లోబల్ కంపెనీలతో సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించారు.రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో లోకేశ్ చురుకైన పాత్ర పోషించారు. విశాఖలో మల్టీనేషనల్ కంపెనీలు రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం వెనుక ఐటీ మంత్రి కృషి ఎంతగానో ఉందని ఏకంగా సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. అయితే, అవన్నీ అవాస్తవాలే అని.. వందల కోట్ల విలువైన భూములను కూటమి సర్కార్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నదని, దీనివెనుక భారీ అవినీతి దాగి ఉన్నదని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది.

భవిష్యత్ ముఖ్యమంత్రిగా లోకేశ్..

Advertisement

చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించేది ఎవరనే దానిపై మొన్నటివరకు నీలినీడలు కమ్ముకున్నాయి. ఎందుకుంటే బాబుకు ఏజ్ అవుతోంది. ఇప్పటి పలుమార్లు సీఎంగా చేశారు. ఇంకా ఎన్నేండ్లు పార్టీని తన భుజాల మీద నడిపించగలరనే ప్రశ్న ఉత్పన్నమైంది.అందుకే చంద్రబాబు తర్వాత పార్టీని ఎవరు నడిపిస్తారో ప్రకటించాలని టీడీపీ నేతలు, కేడర్ పలుమార్లు అధిష్టానాన్ని కోరింది.చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు పార్టీ భవిత్యంపై అందరికీ అనుమానాలు రేకెత్తాయి.లోకేశ్ బాధ్యతలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించాలని పెద్దఎత్తున చర్చ జరిగింది.కానీ, లోకేశ్‌కు నాయకత్వ లక్షణాలు లేవని ‘పప్పు’ అంటూ ఆయన్ను వైసీపీ నేతలు విమర్శించారు. కాగా, 2019లో తాను ఓడిపోయిన మంగళగిరి నుంచే తిరిగి పోటీ చేసిన లోకేశ్.. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.ఇటీవల పెట్టుబడుల ఆకర్షణలో ఆయన నాయకత్వ లక్షణాలు చూసి సీనియర్ లీడర్లే ప్రశంసలు కురిపించారు.ఇప్పుడు టీడీపీకి నాయకుడు లేడనే లోటు తీరిందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

వైసీపీ నేతల అరెస్టుతో టార్గెట్..

మంత్రి నారాలోకేశ్ ప్రస్తుతం వైసీపీ నేతల టార్గెట్ అయ్యారు.కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ పేరుతో వైసీపీ మాజీ మంత్రులు, కీలక నేతలను వరుసగా లోకేశ్ అరెస్టు చేయించారని.. వందలాది వైసీపీ కార్యకర్తలను సైతం జైలులో పెట్టించారని విమర్శిస్తోంది. చంద్రబాబు పాలనలో బిజీగా ఉంటే లోకేశ్ సైలెంటుగా తన పని తాను చేసుకుపోతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే మొన్నటివరకు చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు లోకేశ్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నది. తమ భావప్రకటన స్వేచ్ఛను కూటమి సర్కార్, మంత్రి లోకేశ్ హరిస్తున్నారని ఆరోపిస్తున్నది.ఈ టర్మ్ తర్వాత చంద్రబాబు పాలిటిక్స్ నుంచి తప్పుకుంటే లోకేశ్‌ సీఎం క్యాండిడేట్‌‌గా హైలెట్ అవ్వకుండా.. జీరోగా చూపించి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నిస్తున్నదని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.

Advertisement

 

 

 

 

 

 

 

 

Related News

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Big Stories

Advertisement
×