BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (24/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (24/09/2025)               

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 24వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ  విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి. దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.   

వృషభ రాశి:

వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున  విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఇతరులతో ఊహించని వివాదాలు  కలుగుతాయి.  కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.  సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.  దైవ చింతన పెరుగుతుంది.


మిథున రాశి:  

రుణదాతల నుండి ఒత్తిడి  పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలొ మిశ్రమ ఫలితాలుంటాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృ వర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.  

కర్కాటక రాశి:

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్త్రాభరణాలు  కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి.

సింహరాశి:

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలలో స్వంత ఆలోచనలు కలసి రావు. ప్రారంభించిన పనులు నిలిచిపోతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట  దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. దైవ చింతన కలుగుతుంది.  

కన్యారాశి :

ఉద్యోగస్తులు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటా బయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో  నష్టాలు అధిగమించి లాభాల పొందుతారు. స్థిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో  తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దేశ  సంచారం చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.   

వృశ్చికరాశి:

సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత  లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనాదాయ మార్గలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. దీర్ఘాకాలిక రుణాలు తీర్చగలుగుతారు.

ధనస్సు రాశి:

కొన్ని  వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చుట్టుపక్కల వారితో స్ధిరాస్తి  వివాదాల కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.  ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.   

మకరరాశి:

సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన ఆరోగ్యం విషయంలో శుభ  వార్తలు అందుతాయి.

కుంభరాశి:

ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.  వృత్తి  ఉద్యోగాలలో  నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది.    

మీనరాశి:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల  సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (23/09/2025)               

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలం (సెప్టెంబర్‌ 22 – సెప్టెంబర్‌ 28)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (22/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (21/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (20/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (19/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (18/09/2025)

Big Stories

×