Girls Numerology: ఆ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ఒక వరమట. వారికి ఉన్న స్పెషాలీటీస్‌తో భర్తలను చాలా ప్రేమగా చూసుకుంటారట. అదీకాక ఈ తేదీల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే భర్తలు బిందాస్‌గా బతకొచ్చట. ఇంతకీ ఆ తేదీలేవో ఆ అమ్మాయిల గుణగణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీలలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అంటే పెట్టి పుట్టాలట. ఆ నెంబర్స్ అమ్మాయిలు భార్యలుగా వస్తే వాళ్లు ఉత్తమ భార్యల అవార్డులో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంటారట. భర్తను గౌరవించడంలోనూ.. అత్తింటి వారిని గౌరవించడంలోనూ ఆ అమ్మాయిలకు ఎవరూ సాటి రారట. మరి అలాంటి అమ్మాయిలు ఎవరో ఏ తేదీలలో పుడతారో లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకటవ నెంబర్ జాతకులు: ఏ నెలలోనైనా 1,10,19,28 తేదీల్లో పుట్టిన అమ్మాయిలందరూ ఒకటో నెంబర్ జాతుకులు అవుతారట. వీరి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుందట. వారు బలమైన ఆత్మవిశ్వాసంతో, జీవితంలో లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ధైర్యంగా నిబద్దతతో ముందుకు సాగుతారు.
రెండవ నెంబర్ జాతకులు: ఏ నెలలోనైనా 2,11,20,29 తేదీల్లో పుట్టిన వారందరూ రెండవ నెంబర్ జాతకుల కిందకు వస్తారట. ఈ నెంబర్ అమ్మాయిలకు ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయట. వీరు తమ భర్తకు మానసికంగా.. నైతికంగా మద్దతు ఇవ్వడంలో ముందుంటారట. నమ్మకంగా, అత్తింటి వారిని ఆదరించడంలో వీరికి వీరే సాటి అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.
మూడవ నెంబర్ జాతకులు: ఏ నెలలోనైనా 3,12,21,30 తేదీల్లో పుట్టిన జాతకులు మూడవ నెంబర్ వ్యక్తులుగా పరిణిగస్తారట. వీరికి ఆనందంగా ఉండే స్వభావం పుట్టుకతో వస్తుందట. వీరు చురుకుగా కొత్త ఆలోచనలతో ప్రేరణ కలిగించే వ్యక్తిత్వం కలవారు అయి ఉంటారు. భర్తకు ఎప్పటికప్పుడు ప్రేరణ ఇవ్వడంలో వీరు ముందుంటారు.
నాలుగవ నెంబర్ జాతకులు: ఏ నెలలోనైనా 4, 13,22,31 తేదీల్లో పుట్టిన వారు నమ్మకమైన ఆత్మీయమైన వ్యక్తులు, కుటుంబంపై కర్తవ్య నిబద్దత కలిగి ఉంటారు. వారి ప్రామాణికత భర్తకు భరోసానిస్తుంది.
ఐదవ నెంబర్ జాతకులు: ఏ నెలలో అయినా 5,14,23 తేదీల్లో జన్మించిన వారిని ఐదవ నెంబర్ జాతకులు అంటారు. వీరు సాహసంతో కూడిన జీవనశైలి కలవారు. మారుతున్న పరిస్థితులకు త్వరగా తగినట్లు తమను మార్చుకునే శక్తి వీరిలో ఉంటుంది.
ఆరవ నెంబర్ జాతకులు: ఏ నెలలోనైనా 6,15,24 తేదీల్లో పుట్టిన వారు తమ కుటుంబాన్ని ముందుండి చూసుకునే గుణం కలిగిన వారు. ప్రేమతో కాపురాన్ని శ్రద్దగా నడిపించే వ్యక్తిత్వం వీరిది.
ఏడవ నెంబర్ జాతకులు: ఏ నెలలోనైనా 7,16,25 తేదీల్లో పుట్టిన వారిది తెలివిగా ఆలోచించే తత్వం. వీరు లోతైన విషయాలను అర్థం చేసుకునే బుద్ది మంతులు.
ఎనిమిదవ నెంబర్ జాతకులు: ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు బలమైన సంకల్ప శక్తి కలిగి ఉండే వారు. భర్తకు రక్షణాత్మకంగా ఉండే స్వభావం కలవారు. బాధ్యత గల జీవిత భాగస్వాములు
తొమ్మిదో నెంబర్ జాతకులు: ఏ నెలలోనైనా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు కరుణ, సానుభూతి నిండిన మనసు కలిగిన వారు. ప్రతి ఒక్కరినీ అర్థం చేసుకునే శక్తి వీరిలో ఉంటుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు బాగా ఇష్ట పడతారట