Men Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల్లో పుట్టిన పురుషులు ఉత్తమ భర్తలు అవుతారట. వారిని పెళ్ళి చేసుకున్న అమ్మాయిల జీవితాలు హ్యాపీగా ఉంటాయట. ఇంతకీ ఆ రాశులేవో ఆ భర్తల లక్షణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ధైర్య వంతులైన భర్తలు: ఈ కేటగిరీలోకి మూడు రాశుల జాతకులు వస్తారు. వారిలో మేషం, సింహం, ధనస్సు రాశులకు చెందిన వారు ఉంటారు.
మేష రాశి: వీరు సహజంగా కంట్రోల్ లో ఉండదలచిన వ్యక్తులు, కుటుంబాన్ని రక్షించడానికి ఏమైనా చేయగల ధైర్యంతో ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆగ్రహాన్ని చక్కదిద్దుకోలేరు.
సింహ రాశి: ఈ రాశి భర్తలు గర్వంగా గొప్పగా జీవించాలనుకుంటారు. భార్యకు రాజ మహిషిలా గౌరవం ఇస్తారు. కానీ తన కంటే ఆధిపత్యం చూపితే అసహనం చెందుతారు.
ధనస్సు రాశి: వీరు విశాల దృక్కోణం కలవారు. జీవితాన్ని ఆనందంగా చూసే ధోరణి ఉంటుంది. కానీ అంతే వేగంగా నిర్ణయాలు తీసుకుని అశాంతికి దారి తీయవచ్చు.
సంయమనంతో వ్యవహరించే భర్తలు: ఈ కేటగిరీలోకి వృషభ, కన్య, మకర రాశి జాతకులు వస్తారు. ఇప్పుడు వారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
వృషభ రాశి: వీరికి జీవితం మీద ప్రేమ, సంపద మీద పట్టుదల ఉంటుంది. భార్యకు భద్రత, ఆర్థిక స్తిరత్వం అందించడానికి కృషి చేస్తారు. అయితే మార్పుల్ని చాలా నెమ్మదిగా అంగీకరిస్తారు.
కన్యా రాశి: నిర్ధిష్టత, పరిశుద్దత వీరి లక్షణాలు, భార్యతో నిత్యం జాగ్రత్తగా ప్రేమతో మెలుగుతారు. కానీ ఎక్కువగా విశ్లేషిస్తూ.. ఉండటం కొన్ని సార్లు చికాకు కలిగించవచ్చు.
మకర రాశి: వీరు బాధ్యత గలవారు. జీవిత భాగస్వామిగా భార్యను గౌరవిస్తారు. కానీ ప్రేమను వ్యక్త పరచడంలో కొంత మొహమాటంగా ఉంటారు.
భావోద్వేగ భర్తలు: ఈ కేటగిరీలోకి కర్కాటకం, వృశ్చికం, మీన రాశి జాతకలు వస్తారు. ఇప్పుడు వీరి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
కర్కాటక రాశి: కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమను బలంగా అనభవించగలరు. కానీ ఆస్థిర భావాలు, అనుమానాలు కొన్నిసార్లు సమస్యలకు దారి తీయోచ్చు.
వృశ్చిక రాశి: లోతైన ప్రేమను చూపగలవారు. వారి అంగీకరించిన ప్రేమకు జీవితం అర్పిస్తారు. కానీ అధిక ఆకర్షణ, అహం, ఆదిపత్య ధోరణి జాగ్రత్తగా చూసుకోవాలి.
మీన రాశి: కలల ప్రపంచంలో తేలిపోతుంటారు. భార్యకు గుండెపోటు రానివ్వకుండా ప్రేమ చూపిస్తారు. కానీ నిజ జీవిత బాధ్యతల నుంచి తప్పించుకునే స్వభావం చూసే అవకాశం ఉటుంది.
చురుకైన భర్తలు: ఈ కేటగిరీలోకి మిగిన మూడు రాశులైన మిథునం, తుల, కుంభం జాతకులు వస్తారు. ఇప్పుడు వారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
మిథున రాశి: చురుకైన మాటలు, నవ్వులు, పరిచయాల్లో ఆసక్తి ఎక్కువ, భార్యకు మిత్రుడిలా ఉండగలరు. కానీ చిత్త వృత్తి అస్థిరత పెరిగితే అనాసక్తంగా మారే ప్రమాదం ఉంది.
తుల రాశి: సమతుల్యం, న్యాయం వీరి జీవన శైలి, భార్యకు ప్రేమతో పాటు అందాన్ని హార్మోనీని అందిస్తారు. కానీ నిర్ణయాల్లో మొహమాటంగా ఉండొచ్చు.
కుంభ రాశి: విలక్షణమైన ఆలోచనలు సమాజంపై దృష్టి, భార్యను మంచి మిత్రురాలిగా చూస్తారు. కానీ ఎమోషనల్ కనెక్ట్ లో కొంత లోటు ఉండే అవకాశం ఉంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: న్యూమరాలజీ ప్రకారం ఆ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఉత్తమ భార్యలు అవుతారట