Big TV Kissik Talks: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గుర్తింపు సాధించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ గుర్తింపు వెనకాల వాళ్ళు పడ్డ కష్టం అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అటువంటి కష్టాలని, అలానే వాలు ఫేస్ చేసిన ఇష్యూస్ ని బయటకు తీసే షోస్ లో బిగ్ టీవీ కిస్సిక్ టాక్ sho ఒకటి. బిగ్ టివి ప్లస్ లో వచ్చే ఈ షో ఎంతోమంది గెస్ట్ లను పరిచయం చేసింది.
బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షో జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు సాధించుకున్న సౌమ్యా రావు హాజరైంది. సౌమ్యరావు యాంకరింగ్ చాలామందికి నవ్వు పుట్టిస్తుంది. అలానే సౌమ్యరావు కూడా ఇన్స్టెంట్గా జోకులు వేస్తుంది. ఆమె నవ్వు వెనక కనిపించిన ఎన్నో బాధలు ఉన్నాయి అని రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం జబర్దస్త్ సౌమ్యరావుతో జరిగిన ఇంటర్వ్యూ ప్రోమో బయటకు వచ్చింది.
బస్టాండ్ లో పడుకున్నాం
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకొని గుర్తింపు సాధించాలి అంటే, ఫ్యామిలీ సపోర్ట్ ఎంతగానో అవసరం ఉంటుంది. అలా ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేడు ఒక స్థాయిలో ఉన్నారు. సౌమ్యరావు విషయానికి వస్తే తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. సౌమ్య ను వాళ్ల నాన్నగారి గురించి అడిగినప్పుడు ఏమీ మాట్లాడలేదు. అయితే ఒక రోజు
రాత్రి రెండు గంటలకు నేను, మా అమ్మ, మా బ్రదర్ బస్టాండ్ లో పడుకున్నాం. తిరుపతి వెళ్ళిన తర్వాత కూడా నేను దేవుడి దర్శనం చేయలేదు. నాకు ఎప్పుడు అన్నం పెడతారు అని ఎదురు చూశాను. మా తండ్రి చేసిన తప్పు వలన మేము చాలా ఫేస్ చేశాం. అంటూ చెప్పింది. ఇంతకు పూర్తిగా ఏమైంది అనే కథ కంప్లీట్ ఇంటర్వ్యూలో తెలియనుంది.
గ్రేట్ జర్నీ
ఇదేమైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానాన్ని సాధించుకోవడానికి చాలామంది అబ్బాయిలు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటిది ఒక అమ్మాయి తన ఎన్నో కష్టాలు చూసి నేడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్థానం సంపాదించుకుంది అంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక గ్రేట్ జర్నీ అని చెప్పాలి.
Also Read: Coolie Vs War2 : రేపటి మొదటి ఆట టాక్ తో అసలు కథ స్టార్ట్ అవ్వబోతుంది