Gundeninda GudiGantalu Today episode October 16th: నిన్నటి ఎపిసోడ్ లో..మనోజ్ తన వర్కర్ ఖాళీగా కూర్చోవడం చూసి అందరిపై సీరియస్ అవుతాడు.. అక్కడ కస్టమర్లందరూ ఉంటే మీరేంటి ఇక్కడ ఖాళీగా కూర్చుని ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు అని అరుస్తాడు. వాళ్ళు కేవలం చూడడానికే వచ్చారు సార్ అందుకే మేము ఇక్కడ కూర్చున్నాం వాళ్ళు కొనాలి అనుకుంటే పిలుస్తారు కదా అని వాళ్లంటారు. అయినా మీ షర్టు ఏంటి ఇలా మురికి పట్టి ఉంది అని అడుగుతాడు. మీరు కూలీలను కూడా తీసేసారు మేమే కూలీలుగా అన్ని బండ్లో పెట్టాల్సి వస్తుంది. అందుకే మురికి పడుతున్నాయి అని వాళ్లంటారు. రోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవాలంటే డబ్బులు కావాలి కదా సార్ అని అడుగుతారు. మాణిక్యం బయట కనిపించడంతో మీనా అతని ఫాలో అవుతూ వస్తుంది. అతను రోహిణి వాళ్ళ షాప్ లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. మీనా నన్ను చూసింది అని చెప్పగానే రోహిణి విద్య షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా మాణిక్యం ని చూశాను అని బాలుతో అంటుంది. పాలు నా ఫ్రెండ్ ని దారుణంగా అవమానిస్తాడా వాడికి ఆ షాప్ పెట్టడానికి నేనే కారణం అయినా కూడా వాడు కృతజ్ఞతలు లేకుండా నన్నే అంటాడని బాధపడుతూ ఉంటాడు. మీనా మాత్రం మౌనంగా ఏది పట్టించుకున్నట్టు ఉండడంతో ఏమైంది మీనా నేను ఇంతగా గొంతు చించుకొని అరుస్తున్న సరే నువ్వేమీ పట్టించుకోకుండా మౌనంగా ఉన్నావేంటి అని అడుగుతాడు. నేను మాణిక్యం నీ చూసాను అని మీనా అంటుంది.
అయినా బాలు మాట్లాడుకోవడం విన్న రోహిణి ఎలాగైనా సరే ఇలా అనుమానాన్ని పోగొట్టాలి అని మాణిక్యం దుబాయ్ నుంచి ఫోన్ చేసినట్లు అంతా సెట్ అప్ చేసి ఫోన్ చేస్తుంది. మాణిక్యం మాట్లాడుతూ ఉండగా ప్రభావతి ఫోన్ ని తీసుకొని మీరు ఎప్పుడు వస్తారు? మీ బావ గారు ఎప్పుడు బయటకు వస్తారు అని అడుగుతుంది. నేను మా బావ తో మాట్లాడాను మా అమ్మాయికి ఇంకొక ఐదు లక్షలు పంపిస్తానని చెప్పాడు. త్వరలోనే అయిదు లక్షలు మా అమ్మాయి అకౌంట్లో వేస్తారు అని అనగానే ప్రభావతి కాళ్లు గాల్లో ఉంటాయి..
సత్యం ప్రభావతి ఇక్కడే ఉండు పైకి ఎల్లకు అని అంటాడు. బాలు ఆ ఫోన్ తీసుకొని మేక మామ మీరు ఎక్కడున్నారో చెప్పండి అని అడుగుతాడు. దుబాయిలోనే అని అంటాడు. మనకు బెంగళూరు కలకత్తా అలా రాష్ట్రాలు ఉన్నట్టు అక్కడ కూడా ప్రాంతాలు ఉంటాయి కదా.. అదేదో చెప్తే మా డబ్బుడమ్మ కనుక్కొని చెప్తుంది అని అంటాడు. శృతి కూడా అవును అక్కడ కూడా ఉంటాయి అని అంటుంది. మాణిక్యం ఇక్కడ అన్ని ఉర్దూలో ఉంటాయి. నాకు ఏ ఏరియానో తెలీదు నాకు కేవలం దుబాయ్ అని మాత్రమే తెలుసు అని అంటాడు.
బాలు మాత్రం నీ బండారం ఎలాగైనా సరే ఇవాళ బయట పెడతాను అని పదేపదే అడుగుతాడు. నీకేం ఎక్కడ దొరికిపోతానని ఇక్కడ సరిగ్గా సిగ్నల్ లేవు మళ్ళీ వచ్చేవారం ఫోన్ చేస్తాను అని రోహిణి తో చెప్పి పెట్టేస్తాడు. ప్రభావతి మనోజ్ ని ఏమీ లేనోడు అని ఎన్నిసార్లు అవమానించారు. ఇప్పుడు వాడు అదృష్టం పెరిగింది వారి జాతకం మారిపోయింది అని ప్రభావతి అంటుంది. మీ పుట్టింటి నుంచి ఏ రోజైనా ఒక పది రూపాయలైనా తెచ్చావా అని మీనా అని ప్రభావతి దారుణంగా అవమానిస్తుంది.
ఒకరి సొమ్ము ఆశపడకుండా మా కాళ్ళ మీద మేము నిలబడి డబ్బులు సంపాదించుకుంటున్నాము మాకు ఎవరి డబ్బులు అవసరం లేదు అని బాలు అంటాడు.. సత్యం కూడా సరిగ్గా చెప్పావురా అని అంటాడు. ఇక తర్వాత మీనా నేను మీలాగే తొందరపడి అనుమానించాను ఆయన దుబాయ్ లో ఉన్నాడట అని అంటుంది. ఈరోజుల్లో చనిపోయిన వాళ్ళు పెళ్లికి వచ్చినట్లు వీడియోలు చాలానే క్రియేట్ చేస్తున్నారు ఇది ఒక లెక్క అని బాలు రోహిణి పై అనుమానం ఉన్నట్లు చెప్తాడు. ఇక శృతి భార్య పై ప్రేమ ఉంటే ఇలా ఎత్తుకొని తిరగాలి అని అంటుంది. ప్రభావతి సత్యం వచ్చేలోగా ముగ్గురు తమ భార్యలను ఎత్తుకొని హాల్లో నడుస్తూ ఉంటారు. అది చూసిన ప్రభావతి సత్యంని అడుగుతుంది.
Also Read : టాలీవుడ్ ఇండస్ట్రీలో టెన్షన్.. నాని హీరోయిన్ మిస్సింగ్..
నిన్నెత్తుకుంటే నేను హాస్పిటల్లో ఉంటాను అని సత్యం అంటాడు. అయినా మీ భార్యని ఎత్తుకోవడమేంటి దించండి ఏమి మీనా నువ్వు రోజురోజుకు చిన్నపిల్లలనుకుంటున్నావా? అని మీనా అని అంటుంది. నీ కళ్ళకి మిగతా ఇద్దరు కనిపించలేదు నేను ఒక్కదాని మాత్రమే మీకు కనిపిస్తున్నానన్నమాట.. నన్నే అంటారే అని మీనా ప్రభావతిని అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో రోహిణి మనోజ్తో ఎలాగైనా సరే పిల్లల్ని కనాలని అనుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.