Nindu Noorella Saavasam Serial Today Episode: పిండ ప్రధాన దగ్గర కళ్లు తిరిగి పడిపోయిన మిస్సమ్మను అక్కడి నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. డాక్టర్ మిస్సమ్మన చెక్ చేసి అమరేంద్ర మీకు గుడ్ న్యూస్ అని చెప్తుంది. అందరూ గుడ్ న్యూస్ ఏంటా అని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో డాక్టర్ సీఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రామ్మూర్తి సంతోషంతో ఆనంద బాష్పాలు కారుస్తాడు. ఇక అమరేంద్ర తన సంతోషాన్ని బయటకు రానివ్వడు. పిల్లలకు కూడా సంతోషంగా ఫీలవుతారు. అయితే మిస్సమ్మ ప్రెగ్నెంట్ అని తెలియగానే మనోహరి షాక్ అవుతుంది. ఇక తన ప్రయత్నాలన్నీ వృథా అవుతున్నాయని బాధపడుతుంది. డాక్టర్ జాగ్రత్తలు చెప్పాక మెడిసిన్స్ తీసుకుని అందరూ ఇంటికి వస్తారు.
మనోహరి రూంలోకి వెళ్లి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. ఇన్ని రోజులు నుంచి నేను ఏదైతే కాకూడదని భయపడ్డానో అదే జరిగింది. ఆ ఆరు పీడ విరగడి అయిందని అనుకునేలోపే ఇప్పుడు ఈ న్యూస్ వినాల్సి వచ్చిందని బాధపడుతుంది. వెంటనే రణవీర్‌కు ఈ విషయం చెప్పి భాగీ చంపేయాలని ఫోన్ చేస్తుంది. ఫోన్ లిప్ట్ చేసిన రణవీర్ ఆరు దెబ్బల నుంచి ఇంకా కోలుకోలేదని బెడ్ రెస్ట్ లో ఉన్నానని చెప్తాడు. దీంతో మనోహరి కోపంగా రణవీర్‌ను తిట్టి ఇంట్లో జరుగుతున్న విషయాలు చెప్తుంది. ఆ భాగీ నెల తప్పిందని ఇక దానికి 9 నెలలు తిరగే సరికి బిడ్డ కూడా పుడతాడని అయినా మనం ఏమీ చేయలేకపోతున్నామని కోపంగా కాల్ కట్ చేస్తుంది.
మరోవైపు మిస్సమ్మ తన కడుపులో పడ్డ వద్దని అబార్షన్ చేయించుకుంటానని రాథోడ్ తో చెప్తుంది. దీంతో రాథోడ్ కోపంగా మిస్సమ్మను తిడతాడు. ఎందుకు నీ కడుపులో బిడ్డను నువ్వే చంపుకోవాలనుకుంటున్నావు కారణం చెప్పు అంటూ నిలదీస్తాడు. దీంతో మిస్సమ్మ ఏడుస్తూ.. నా వల్ల మా అక్కకు కానీ తన పిల్లలు కానీ బాధపడకూడదు. ఎప్పుడైతే నేను ఆయన భార్యను అయ్యానో అప్పుడే అక్క పిల్లలు నాకు సొంత పిల్లలు అయ్యారు. ఇక అందుకే నాకు బిడ్డ అవసరం లేదు రాథోడ్. అందుకే అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటున్నాను అని మిస్సమ్మ చెప్పగానే రాథోడ్ షాక్ అవుతాడు. నిజంగా నీ త్యాగం గొప్పది మిస్సమ్మ.. కానీ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్తాడు రాథోడ్. అయితే మిస్సమ్మ మాత్రం తాను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్తుంది.
కింద మిస్సమ్మ అబార్షన్ చేయించుకుంటానని రాథోడ్‌తో చెప్పడం పైన యమలోకం నుంచి ఆరు, గుప్త, యముడు చూస్తుంటారు. మిస్సమ్మ నిర్ణయానికి ఆరు షాక్ అవుతుంది. ఏడుస్తూ ఆడదానికి అమ్మతనం అనేది చాలా గొప్పవరం. ఆ అదృష్టాన్ని ఆనందాన్ని పోగొట్టుకోకు భాగీ అంటూ ఏడుస్తుంది. కింద మాత్రం మిస్సమ్మ నేను ఆలెరెడీ నలుగురు పిల్లలకు తల్లిని ఇక నాకు కొత్తగా ఇప్పుడు పిల్లలు వద్దు రాథోడ్ అని చెప్తుంటుంది. మళ్లీ తల్లిని అవ్వాల్సిన అవసరం లేదు. రేపే హాస్పిటల్‌కు వెళ్లి అబార్షన్ చేయించుకుంటాను అని చెప్పగానే.. రాథోడ్ షాక్ అవుతాడు. పై నుంచి చూస్తున్న ఆరు ఏడుస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.