BigTV English

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (అక్టోబర్‌ 12 – అక్టోబర్‌ 18) ఆ రాశి వారు స్థిరాస్తులు కొంటారు – ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (అక్టోబర్‌ 12 – అక్టోబర్‌ 18) ఆ రాశి వారు స్థిరాస్తులు కొంటారు – ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం

Weekly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (అక్టోబర్‌ 12 – అక్టోబర్‌ 18) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:

నూతన ఉద్యోగయత్నాలు కొంత అనుకూలిస్తాయి. అదే పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగమే అధికారులు అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందారు.  వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. సంతాన వివాహ విషయమై ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృషభ రాశి: 

భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి.  


 మిథున రాశి: 

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. దూరపు బంధువులు ఆగమన ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రుడు తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. విద్యార్థుల కష్టం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల అందుకుంటారు. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వారం చివరిలో ప్రయాణ సూచనలు ఉన్నవి. వివాదాలు తప్పవు.  

కర్కాటక రాశి:

ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు రాజీ చేసుకుంటారు. సంతాన శుభకార్యాలపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగం అవకాశములు అందుతాయి.  

సింహారాశి:

అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది. ఆత్మీయులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరులతో ఉన్నటువంటి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతాన వివాహయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు కొంత శ్రమ మీద మంచి ఫలితం కనిపిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి.  

కన్యా రాశి: 

చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంత వరకు బయటపడ గలుగుతారు. బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులు పరీక్ష ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.  

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. భూ సంబంధిత వ్యవహారాలలో దాయదులతో ఒప్పందాలు కుదురుతాయి. గృహ నిర్మాణయత్నాలు సానుకూలంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి రుణ బాధల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.  

వృశ్చిక రాశి: 

ముఖ్యమైన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కొన్ని వివాదాలు సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలో ఒప్పందాలు కలసి వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. సంతాన వివాహ యత్నాలు కలసివస్తాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు మిత్రుల సహాయ పోంది ఊరట పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  

ధనస్సు రాశి:

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటా బయట మీ విలువ మరింత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువుల నుండి అందిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్లటం మంచిది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.  

మకర రాశి:

ఇంటా బయటా పరిస్థితి మరింత అనుకూలిస్తాయి. ఆత్మీయ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వ్యవహారాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి లాభాలు అందుకుంటారు. బంధువులు, మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సమసిపోతాయి. సోదరులతో స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాల ను శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నుండి ఉపశమనం పొందుతారు.  

కుంభ రాశి: 

చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. రెండు రకములైన ఆలోచన వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువర్గం తో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతారు. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటి నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.  

మీన రాశి:

ఆత్మీయులతో ఆర్థికపరమైన చర్చలు అనుకూలిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఇంట్లో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం ఫలిస్తుంది. విద్యార్థులకు పరీక్షఫలితాలు ఆశజానాకంగా ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుకుంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (12/10/2025) ఆ రాశి వారికి  అకస్మిక ధనలాభం – రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (11/10/2025) ఆ రాశి వారికి ఆర్థిక నష్టం – అకస్మిక ప్రయాణాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (10/10/2025) ఆ రాశి రాజకీయ నాయకులకు అరుదైన ఆహ్వానాలు – ప్రముఖులతో పరిచయాలు

Zodiac Signs: దీపావళి నుంచి వీరికి అదృష్టం.. మట్టి ముట్టుకున్నా బంగారమే !

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (09/10/2025) ఆ రాశి వారికి ఆర్థిక నష్టం – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (08/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు ప్రమోషన్లు  

Moola Nakshatra: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

Big Stories

×