OTT Movie : ఓటీటీలోకి రక రకాల సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తుంటాయి. అయితే వీటిలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అందులోనూ టైమ్ ట్రావెల్ జానర్ కథలు, ఆడియన్స్ ని మరో లోకంలోకి తీసుకెళ్తుంటాయి. ఈ కథలో అన్నా, చెల్లెళ్ళు దొంగతనం చేసి. ఒక టైమ్ లూప్ లో చిక్కుకుంటారు. ఆ తరువాత కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి వీళ్ళు ఈ లూప్ నుంచి బయట పడే సీన్స్ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘థింగ్స్ విల్ బీ డిఫరెంట్’ (Things will be different) 2024లో వచ్చిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా. మైకల్ ఫెల్కర్ దీనికి దర్శకత్వం వహించారు. ఆడమ్ డేవిడ్, రైలీ డ్యాండీ, రోబర్ట్ ఇందులో నటించారు. ఈ సినిమా 2024 మార్చి 11న రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2024 అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది.
జోసెఫ్, అతని సోదరి సిడ్నీ ఒక బ్యాంక్‌లో దొంగతనం చేస్తారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్లు ఒక ఫార్మ్ హౌస్‌కు పారిపోతారు. ఈ ఇల్లు సాధారణమైనది కాదు. టైమ్ ట్రావెల్ శక్తి ఈ ఇంట్లో ఉంటుంది. వాళ్లు ఇంట్లోకి వెళ్లగానే, ఒక విచిత్రమైన వ్యక్తి వస్తాడు. వాళ్లను టైమ్ లూప్‌లో చిక్కుకునేలా చేస్తాడు. ఈ లూప్‌లో వాళ్లు ఒక సంవత్సరం గతంలోకి వెళ్లిపోతారు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేరు. కథ టైమ్ ట్రావెల్, టెన్షన్‌తో మొదలవుతుంది. జోసెఫ్, సిడ్నీ టైమ్ లూప్ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు, కానీ ఒక అపరచిత వ్యక్తి వాళ్లను చంపాలని చూస్తాడు.
Read Also : డివోర్స్‌డ్ సేల్స్ మ్యాన్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్… జైల్లో భార్య ప్రియుడితో… క్లైమాక్స్ హైలెట్