BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (11/10/2025) ఆ రాశి వారికి ఆర్థిక నష్టం – అకస్మిక ప్రయాణాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (11/10/2025) ఆ రాశి వారికి ఆర్థిక నష్టం – అకస్మిక ప్రయాణాలు

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 11వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటా బయట మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి.

వృషభ రాశి:

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు  వేగవంతం చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చగలరు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


మిథున రాశి:  

ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఇంటాబయట నూతన సమస్యలు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కర్కాటక రాశి:

విద్యార్థుల నూతన విద్యావకాశములు లభిస్తాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. స్ధిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సింహరాశి:

ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్యారాశి :

వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.

వృశ్చికరాశి:

సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

ధనస్సు రాశి:

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలో ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మకరరాశి:

వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కుంభరాశి:

వ్యాపారాలలో తీసుకున్న  నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

మీనరాశి:

వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాతమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (10/10/2025) ఆ రాశి రాజకీయ నాయకులకు అరుదైన ఆహ్వానాలు – ప్రముఖులతో పరిచయాలు

Zodiac Signs: దీపావళి నుంచి వీరికి అదృష్టం.. మట్టి ముట్టుకున్నా బంగారమే !

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (09/10/2025) ఆ రాశి వారికి ఆర్థిక నష్టం – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (08/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు ప్రమోషన్లు  

Moola Nakshatra: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (07/10/2025) ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు – వారు అకస్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (06/10/2025) ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు

Big Stories

×