BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (10/10/2025) ఆ రాశి రాజకీయ నాయకులకు అరుదైన ఆహ్వానాలు – ప్రముఖులతో పరిచయాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (10/10/2025) ఆ రాశి రాజకీయ నాయకులకు అరుదైన ఆహ్వానాలు – ప్రముఖులతో పరిచయాలు

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 10వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారుల మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం  చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

వృషభ రాశి:

దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.


మిథున రాశి:  

వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది.

కర్కాటక రాశి:

మొండి బాకీలు తీర్చగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు  నిదానంగా సాగుతాయి.

సింహరాశి:

ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన  వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్యారాశి :

ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.

వృశ్చికరాశి:

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన  సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది.

ధనస్సు రాశి:

కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం ఋణాలు వసూలవుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి.

మకరరాశి:

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కీలక సమాచారం  అందుతుంది. నూతన వాహనం కొనుగోలు  చేస్తారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభరాశి:

ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మరి సహాయ పడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనరాశి:

సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా సమస్యలు  తెలివిగా అధిగమిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో. చేతికి అందుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Zodiac Signs: దీపావళి నుంచి వీరికి అదృష్టం.. మట్టి ముట్టుకున్నా బంగారమే !

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (09/10/2025) ఆ రాశి వారికి ఆర్థిక నష్టం – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (08/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు ప్రమోషన్లు  

Moola Nakshatra: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (07/10/2025) ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు – వారు అకస్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (06/10/2025) ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (05/10/2025) ఆ రాశి వారికి స్థిరాస్థి వ్యవహారంలో లాభాలు – ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి

Big Stories

×