Bengaluru Crime: నాలుగు అబద్దాలు ఆడి పెళ్లి చేయాలంటారు. భార్యకు అనారోగ్య సమస్యల గురించి చెప్పకుండా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అల్లుడికి ఆ విషయం ఆలస్యంగా తెలిసి ఆగ్రహం వ్యక్తంచేశాడు. చివరకు మత్తు మందు ఇచ్చి భార్యని చింపేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంచలనం రేపిన ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది.
భార్యకు మత్తు మందు ఇచ్చి చంపేశాడు
భార్య మరణించిన ఆరు నెలల తర్వాత ఆమె హత్య కేసులో భర్త, తోటి వైద్యుడిని బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లే. మరి భార్యని భర్తని హత్య చేయడానికి దారి తీసిన కారణాలేంటి? పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి?
బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో డాక్టర్లుగా పని చేశారు కృతికారెడ్డి-మహేంద్రరెడ్డి. డెర్మటాలజిస్ట్‌గా డాక్టర్ కృతికారెడ్డి పని చేస్తోంది. డాక్టర్ మహేంద్రరెడ్డి అదే ఆసుపత్రిలో సర్జన్ ఉన్నాడు. ఇద్దరు ఒకే ఆసుపత్రిలో పని చేయడంతో వివాహానికి సిద్దమయ్యారు. గతేడాది మే 26న కృతికా-మహేంద్రరెడ్డిల వివాహం ఘనంగా జరిగింది.
అనారోగ్య సమస్యలు చెప్పలేదని
డాక్టర్ కృతికారెడ్డికి అజీర్ణం, లోషుగర్, గ్యాస్ట్రిక్‌వంటి సమస్యలు ఉన్నాయి. ఆ విషయాన్ని వరుడి కుటుంబసభ్యుల వద్ద దాచి పెట్టారు. పెళ్లి తర్వాత కొద్దిరోజులకే గుర్తించారు డాక్టర్ మహేంద్రరెడ్డి. చివరకు భార్యతో కలిసి అత్తగారింటికి వచ్చాడు. అనారోగ్యంతో ఉన్న మహిళను తనకు ఇచ్చి పెళ్లి చేశారంటూ ఆగ్రహంతో రగిలిపోయాడు. అనుక్షణం ఆ విషయం డాక్టర్ ని వెంటాడేది. చివరకు ఆమెని చంపాలని డిసైడ్ అయ్యాడు.
అప్పుడే తన బుర్రకు పదునుపెట్టాడు. తన చేతికి మట్టి అంటకుండా చేయాలని భావించాడు. బుర్రలో వచ్చిన ఆలోచనను ఇంప్లిమెంట్ చేశాడు. ట్రీట్‌మెంట్ పేరుతో భార్యకు అనస్తీషియా మత్తు మందు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆమెని నిత్యం మత్తులో ఉంచేవాడు. క్రమంలో కృత్తికా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఏప్రిల్ 23న స్పృహ తప్పి పడిపోయింది.
ALSO READ: విశాఖలో దారుణం.. నడిరోడ్డులో దారుణ హత్య
వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించిందని డాక్టర్లు తేల్చారు. అనారోగ్య సమస్యలతో మరణించిందని ఆమె కుటుంబసభ్యులు భావించాడు. తొలుత పోస్ట్‌మార్టం చేయడానికి ఆమె భర్త నిరాకరించాడు. చివరకు కృతికారెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కృతికా శరీరంలో అనస్తీషియా ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది.
ఆ విషయం నిర్ధారణ కావడంతో కృతికారెడ్డి కుటుంబసభ్యులు మారతహళ్లి ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత అసహజ మరణం కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ మొదలుపెట్టిన పోలీసులకు మహేంద్రరెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తున్నప్పుడు రకరకాల ఇంజెక్షన్లు, ఇతర వైద్య వస్తువులు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పరిశోధకులకు అప్పగించారు.
బుధవారం మహేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో అనస్తీషియా ఓవర్ డోస్ ఇచ్చి భార్యని హత్య చేసినట్లు అంగీకరించాడు. అందుకు పైకారణాలు వెల్లడించాడు. భార్యకు అనారోగ్య సమస్యల గురించి చెప్పకుండా పెళ్లి చేయడమే దీనికి కారణంగా నిర్థారణకు వచ్చారు పోలీసులు.