PAK VS SA: సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్నటి వరకు మొదటి టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగగా, పాకిస్తాన్ ఏకంగా 93 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా లాహోర్ స్టేడియంలో కలకలం చోటుచేసుకుంది. ఓ ఆగంతకుడు ఏకంగా పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి చొరబడ్డాడు. వందలాది మంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ డ్రెస్సింగ్ రూమ్ గోడ ఎక్కి మరీ లోపటికి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్నటి వరకు జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా ఓ అరుదైన సంఘటన జరిగింది. గడాఫీ స్టేడియం లో ఉన్న పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి ఓ కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. గోడ దూకి మరి పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. ఇక అతన్ని చూసిన పాకిస్తాన్ స్టాఫ్, ఉలిక్కిపడింది. అసలు ఎవడు వాడు? అలా ఎందుకు దూకి వచ్చాడు ? అని కాసేపు టెన్షన్ పడ్డారు పాకిస్తాన్ క్రికెటర్లు. అయితే అతడు బాబర్ అజం కోసం వచ్చినట్లు తెలుస్తోంది. అతను బాబర్ కు పెద్ద ఫ్యాన్ అట. బాబర్ ఆటోగ్రాఫ్ కోసం దొంగతనంగా గోడ ఎక్కి లోపటికి వెళ్లాడు సదరు అభిమాని.
ఇది తెలియక పాకిస్తాన్ క్రికెటర్లు అలాగే సిబ్బంది కాసేపు టెన్షన్ పడ్డారు. ఉగ్రవాదులు ఎవరైనా వచ్చి ఉంటారని ఆందోళన చెందారు. వెంటనే దీనిపై సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ సెక్యూరిటీ, ఆ కుర్రాన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్స్, పాకిస్తాన్ పరువు తీస్తున్నారు. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి కుర్రాడు కూడా సులభంగా వెళ్లేలా వాళ్ళ సెక్యూరిటీ తగలడింది.. అలాంటి దేశంలో క్రికెట్ ఆడితే దక్షిణాఫ్రికాకు ప్రమాదమే అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
లాహోర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో ఏకంగా 93 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 378 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 167 పరుగులు చేసింది. అటు దక్షిణాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ 269 పరుగులు కాగా రెండో ఇన్నింగ్స్ లో 183 పరుగులకు కుప్పకూలింది. దీంతో పాకిస్థాన్ విజయం సాధించింది.
Also Read: IND VS AUS: గంభీర్ కు చెప్పకుండానే ఆస్ట్రేలియాకు బయలుదేరిన రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే
This is called real love ♥️♥️pic.twitter.com/KG9xiPQfDZ
— Hassan Abbasian (@HassanAbbasian) October 15, 2025