Weekly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (సెప్టెంబర్ 14 – సెప్టెంబర్ 20) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏలినాటి శని ప్రభావం వల్ల స్థిరత్వం లేని ఉద్యోగ, వ్యాపారాలు అధిక ధనం ఖర్చు చేయడం. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వారాంతంలో వాహనం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటారు. బుద్ధి బలంతో ఆపదల నుండి బయటపడుతారు. మహాలక్ష్మీదేవిని పూజించండి. ఆర్థిక స్థితి కుదుటపడుతుంది.
గ్రహబలం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో లాభాలు చూస్తారు. రాజకీయ నాయకులతో పెద్ద స్థాయి అధికారులతో పరిచయాలు అదృష్ట ఫలాలను అందిస్తుంది. ఇంటి పెద్దకి ఆరోగ్య సమస్యలతో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. లలితా త్రిపురసుందరిని ధ్యానించండి మేలుజరుగుతుంది.
నమ్మిన వ్యక్తులు మోసం చేయడంతో తట్టుకోలేక పోతారు. అతికష్టం మీద పనులు పూర్తవుతాయి. రాశిలో గురుగ్రహ అనుగ్రహంతో అఖండ సంపదలను పొందుతారు. బిజినెస్ పనుల మీద దృష్టి సారించండి. సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించండి.
జన్మరాశిలో శుక్ర గ్రహ సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడుతారు. అష్టమ రాహు ప్రభావం వైవాహిక జీవితాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉంది. మీకు రావాల్సిన కాంట్రాక్టులు ఇతరులకు మంజూరు అవుతాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. దుర్గాదేవి ఆలయంలో పసుపు కుంకుమ దీపం నూనె దానంగా సమర్పించండి.
స్వస్థాన సూర్యుని వల్ల ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటారు. భార్యా భర్తల మధ్య అపర్థాలు వస్తాయి. నలుగురిలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి. సమాజ సేవకు చేయూతనిస్తారు. అష్టమంలో వక్ర శని సంచారం వల్ల మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురవుతారు మహాలక్ష్మీ అష్టకం నిత్యం 8సార్లు పారాయణం చేయండి.
నలుగురిలో పలుకుబడి కోసం ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ మునుపటికన్నా మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏకాదశంలో శుక్రుడు లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. కుటుంబంలో స్త్రీల మాటకు విలువ ఇవ్వండి సూర్య నమస్కారాలు శుభఫలితాలు ఇస్తాయి.
జన్మరాశిలో కుజుడి సంచారం వల్ల 10వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలలో ఉన్నతస్థితిలోకి వెళతారు. ఆర్థికంగా గొప్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో ప్రేమగా మెలగండి. సంతానం యొక్క ప్రవర్తనపై దృష్టి పెట్టండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి.
అష్టమంలో గురుసంచారం వల్ల పైఅధికారుల ఒత్తిడి పెరుగుతుంది. తోటి ఉద్యోగులు మీపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతారు. దూర ప్రయాణాలు కలిసిరావు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆంజనేయస్వామికి తెల్లజిల్లేడు ఆకులతో, పూవులతో మాల సమర్పించండి.
దూరపు బంధువులను కలుస్తారు. పాత పరిచయాలు మళ్ళీ ముందుకు సాగుతాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడులు కలిసి వస్తాయి. అష్టమ శుక్రుడు ఆకస్మిక ధననష్టం కలిగిస్తాడు. శివాలయంలో నవగ్రహదీపం వెలిగించండి.
మానసికంగా ఒక సమస్య తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆత్మీయులతో కలిసి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పుణ్యక్షేత్ర దర్శనం మీ సమస్య నుండి విముక్తి కలిగిస్తుంది. చెప్పుడు మాటలు వినవద్దు. దుర్గాదేవి ఆలయంలో 108 నిమ్మకాయల దండను సమర్పించండి.
గతంలో మీరు ఊహించిన సంఘటనలు ఎదుర్కొంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ పిత్రార్జితం విక్రయిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో క్రమశిక్షణ అవసరం. జీవిత భాగస్వామి సలహాలు పాటించండి. లాభాలు కలుగుతాయి. బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి దేవతకు నమస్కరించుకోండి.
కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. సమాజంలో గుర్తింపు కోసం తహతహలాడుతారు. మిత్రుల సహకారం మేలు కలిగిస్తుంది. అష్టమంలో కుజ సంచారం కొంత వరకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. మీ ఊరి గ్రామదేవతకు పసుపు కుంకుమ సమర్పించండి. పుట్టలో పాలు పోసి ఆ మట్టిని నుదుట తిలకంగా ధరించండి.