BAN Vs SL : ఆసియా కప్ 2025 గ్రూపు – బీ లో అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో అసలంక సారథ్యంలోని శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేసింది. ఓపెనర్లు తన్ జీద్ హసన్, పర్వేజ్ హుస్ డకౌట్ కావడంతో ఆ జట్టు ఖాతా కూడా తెరవకముందే 2 టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది. బంగ్లా జట్టు 11 పరుగులు చేయగానే తౌహీద్ హృదయ్(08)పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. దీంతో బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది.
Also Read : Shoaib Akhtar: ఇది మహా యుద్ధం..స్టేడియం హౌస్‌ఫుల్ పక్కా..వాళ్లంతా వెధవలే !
ఇక కెప్టెన్ లిట్టన్ దాస్ 26 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే మెహదీ హసన్ (9), తో లిట్టన్ దాస్ కూడా వెంట వెంటనే ఔట్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 53 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. 100 పరుగులు కూడా చేస్తుందా..? లేదా అని అంతా భావించారు. కానీ షమీమ్ 34 బంతుల్లో 42 నాటౌట్, జాకీర్ అలీ 34 బంతుల్లో 41 నాటౌట్ రాణించారు. దీంతో 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది బంగ్లాదేశ్ జట్టు. ఇక అనంతరం 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో కుశాల్ మెండీస్(3) కాస్త నిరాశ పరచగా.. నిసాంక 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
మరోవైపు వన్ డౌన్ బ్యాటర్ కమిల్ మిషార 32 బంతుల్లో 46 నాటౌట్ గా నిలిచాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఓపెనర్ నిసాంక తో కలిసి రెండో వికెట్ కి 95 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. బంగ్లాదేశ్ బౌలర్ మెహదీ హాసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో లిట్టన్ దాస్ 28, జాకర్ అలీ 41, షమీమ్ హాసన్ 42 పరుగులు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయ్యారు. తౌహిద్ హృదయ్ 8 పరుగులు చేసి రనౌట్ కాగా.. మహీద్ హాసన్ 09 పరుగులు చేసి ఔట్ అయ్యారు. శ్రీలంక బ్యాటర్ నిస్సాంక 50, కమిల్ మిషారా 46, కుశాల్ మెండిస్ 03, కుశాల్ పెరీరా 09, దసున్ శనక 1, చరిత్ అసలంక 10 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తఫీజర్ రెహ్మాన్ 1, తజీమ్ హాసన్ షకీబ్ 1, మహెదీ హాసన్ 2 వికెట్లు తీశాడు. ఇక ఇస్లాం, రిషద్ హోసన్, షమీమ్ హాసన్ బౌలింగ్ చేసినప్పటికీ శ్రీలంక బ్యాటర్లను ఔట్ చేయలేకపోయారు. మరోవైపు స్వల్ప లక్ష్యం కావడంతో శ్రీలంక జట్టు అలవొకగా ఛేదించింది. దీంతో శ్రీలంక ఆసియా కప్ 2025లో శుభారంభం చేసింది. ప్రస్తుతం గ్రూప్ బీ లో అప్గానిస్తాన్ జట్టు టాప్ ప్లేస్ లో కొనసాగడం విశేషం. గ్రూపు ఏ లో టీమిండియా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.