BigTV English

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలం (సెప్టెంబర్‌ 22 – సెప్టెంబర్‌ 28)

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలం (సెప్టెంబర్‌ 22 – సెప్టెంబర్‌ 28)

Weekly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (సెప్టెంబర్‌ 22 – సెప్టెంబర్‌ 28) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్య క్షేత్రములు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్నంగా అవకాశములు అందుతాయి.  

వృషభ రాశి: 

ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమ క్రమంగా మెరుగుపడుతుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. అందుతాయి విలువైన వస్తులాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి . అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి.


మిథున రాశి: 

నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు . వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి ఉద్యోగాలలో విధులు ఉత్సాహంగా నిర్వర్తిస్తారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. తెలివిగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. దాయాదులతో వివాదాలు పరిష్కారమౌతాయి. విద్యార్థులు అంచనాలు అందుకుంటారు.  వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  

కర్కాటక రాశి:

స్థిరాస్తులు కొనుగోలులో ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.  

సింహారాశి:

విద్యార్థులు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి . పాత∙సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం  కొన్ని రంగాల వారికి చిక్కులు తప్పవు వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహన యోగం ఉన్నది.  

కన్యా రాశి:

గృహ నిర్మాణ యత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి ,విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులా రాశి:

గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మిత్రులు సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు.  

వృశ్చిక రాశి: 

భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ప్రయణాలలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది . సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగాలలో సమస్యలు అడిగమిస్తారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.  

ధనస్సు రాశి:

స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో ఎంతటి వారినైనా మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.  

మకర రాశి:

 విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ వాహన కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. అన్ని రంగాల వారికి నూతన అవకాశములు దక్కుతాయి.  

కుంభ రాశి: 

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఇంటా బయట బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి తొలగుతుంది అన్ని వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది.  

మీన రాశి:

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులు కష్టం ఫలిస్తుంది. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి.  

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (22/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (21/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (20/09/2025)               

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (19/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు. (18/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. (17/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (16/09/2025)

Big Stories

×