E-Paper
Advertisement

E 20 పెట్రోల్ ఇష్యూ.. మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ, కన్జ్యూమర్ కోర్టు సంచలన తీర్పు, అప్పీల్‌కు మారుతి సుజుకీ

E 20 పెట్రోల్ ఇష్యూ..  మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ, కన్జ్యూమర్ కోర్టు సంచలన తీర్పు, అప్పీల్‌కు మారుతి సుజుకీ
Advertisement

Maruti Suzuki: E 20 ఇంధన సమస్యల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానం వరకు చేరింది. లోపాల ఆరోపణలపై గ్రాండ్ విటారా వాహనాన్ని మార్చాలని ఆదేశిస్తూ రాయ్‌పూర్ వినియోగదారుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వును మారుతి సుజుకి కంపెనీ సవాలు చేయనుంది. ఇథనాల్ కాకుండా కలుషితమైన ఇంధనమే కారణమని సదరు న్యాయస్థానం చెబుతోంది.

E 20 పెట్రోల్ వ్యవహారం-దేశంలో E 20 పెట్రోల్ వినియోగానికి సంబంధించి కీలక తీర్పు ఇచ్చింది రాయ్‌పూర్‌ లోని కన్జ్యూమర్ కోర్టు. జనవరి 2023లో తయారైన గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జీటా ప్లస్ వాహనం స్థానంలో అదే వేరియంట్‌కు చెందిన కొత్త E20-అనుకూల వాహనాన్ని ఇవ్వాలని ఆదేశించింది. లేకుంటే 45 రోజుల్లోగా కొనుగోలు చేసిన ధరను వాపసు ఇవ్వాలని కమిషన్ మారుతి సుజుకి, దాని డీలర్‌ను ఆదేశించింది.

Advertisement

కన్జ్యూమర్ కోర్టు సంచలన తీర్పు-సేవలో లోపం, అన్యాయమైన వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని పేర్కొంది. పదే పదే మరమ్మతు ప్రయత్నాలు చేసినప్పటికీ అదే లోపం కొనసాగిందని ప్రస్తావించింది. వినియోగదారుడికి  అనుకూలంగా తీర్పు ఇవ్వటం దేశవ్యాప్తంగా చర్చగా మారింది.  E20 పెట్రోల్ వినియోగం తర్వాత తన వాహనంలో ఇంజిన్ పనితీరు దెబ్బతిందని, ఫలితంగా రకరకాల సమస్యలు తలెత్తాయని కన్జ్యూమర్ కోర్టుకి ఫిర్యాదు చేశాడు.

మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ- పలుమార్లు రిపేర్లు చేయించినా సమస్యలు తగ్గకపోవడంతో భారీ ఖర్చు అవుతుందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి, డీలర్ వాదనలు మరోలా ఉన్నాయి. తమ వాహనం E20 పెట్రోల్‌కు పూర్తిగా అనుకూలంగా ఉందని, ఇంజిన్ సమస్యలకు ఇంధనం కారణం కాదన్నారు. నిర్వహణలో లోపాలు, సాంకేతిక కారణాల వల్ల ఈ తరహా సమస్యలు వచ్చాయని  వివరించారు.

Advertisement

అప్పీల్‌కు మారుతి సుజుకీ రెడీ- కమిషన్ ఆ వాదనను తోసిపుచ్చింది. వినియోగదారుడు పలుమార్లు సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించినప్పటికీ మళ్లీ ఆ సమస్యలు రావడం, లోపాన్ని సరిచేయడంలో తయారీ సంస్థ విఫలమైందని పేర్కొంది కమిషన్. వినియోగదారుల ఫోరం కమిషన్ తన తీర్పులో మరో అంశాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం అనేక పెట్రోల్ పంపుల్లో E 20 పెట్రోల్ అందుబాటులో ఉందని తెలిపింది.

వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ఎంచుకునే అవకాశంపై స్పందించింది. రకరకాల పెట్రోల్ అందుబాటులో లేని ఈ పరిస్థితుల్లో E20 పెట్రోల్ వాడకుండా ఉండాలని వాహనదారులను ఆశించడం కరెక్టు కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వినియోగదారుడి ఫిర్యాదును సమర్థించింది కమిషన్.

ALSO READ: మిడిల్ క్లాస్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. జస్ట్ రూ.50 వేల లోపే కొనేయెచ్చు!

వాహన తయారీ సంస్థతోపాటు డీలర్ వాహన మరమ్మతుల కోసం చేసిన ఖర్చును వినియోగదారుడికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మానసిక వేదనకు పరిహారంగా రూ. 1 లక్ష, పిటిషన్ ఖర్చుల కోసం రూ. 10,000 ఇవ్వాలని అందులో ప్రస్తావించింది.

నిర్ణీత గడువులో మొత్తం చెల్లించకపోతే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని తన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది కమిషన్. రాయ్‌పూర్ కన్జ్యూమర్ కోర్టు తీర్పు నేపథ్యంలో E20 పెట్రోల్ వాడకంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కేంద్రం తీసుకొచ్చిన E20 పెట్రోల్ వాడకంపై చేస్తున్న వాదనలకు కోర్టు తీర్పు పెద్ద సవాల్‌గా మారింది.

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×