Best Electric Scooters in 2026: పెట్రోల్ ధరలు పెరగడం, మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువ కావడం, ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరగడంతో చాలామంది ఇప్పుడు ఈవీల వైపు చూస్తున్నారు. రేంజ్, టెక్నాలజీ, స్టోరేజ్ లాంటి అంశాలను బేస్ చేసుకుని ఈవీలను కొనాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఫ్యామిలీకి సరిపోయే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
ఇండియాలో ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఫ్యామిలీ రైడింగ్‌కు అనువైన డిజైన్, సౌకర్యవంతమైన సీటింగ్, ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ తో ఆకట్టుకుంటుంది. 2.2 kWh నుంచి 5.3 kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 94 నుంచి 212 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. టెక్నాలజీ ఫీచర్లు కూడా ఆకట్టుకుంటాయి.
కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏథర్ రిజ్టా ఒకటి. పెద్ద సీటు, 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, అదనపు ఫ్రంక్ ఆప్షన్ ఆకట్టుకునేలా ఉన్నాయి. స్కిడ్ కంట్రోల్, స్మార్ట్ డిస్ ప్లే, రైడింగ్ మోడ్స్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. 2.9 kWh, 3.7 kWh బ్యాటరీలతో వచ్చే ఈ స్కూటర్ గరిష్టంగా 160 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.
రెట్రో లుక్ ను ఇష్టపడే వారికి బజాజ్ చేతకు బెస్ట్ ఆప్షన్. మెటల్ బాడీతో బలమైన నిర్మాణం, ప్రీమియం డిజైన్ బాగుంటుంది. LED లైటింగ్, డిజిటల్ డిస్ ప్లే లాంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. 2.5 kWh నుంచి 3.5 kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 153 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.
హీరో మోటోకార్ప్ కు చెందిన విడా VX2 కూడా మంచి ఫ్యామిలీ ఈవీ. దీని ప్రత్యేకత రిమూవబుల్ బ్యాటరీ. ఇంట్లోనే బ్యాటరీని తీసి ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. 2.2 kWh నుంచి 4.4 kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఛార్జ్ తో 187 కిలోమీటర్ల వరకు రేంజ్, గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
రోజూ ఎక్కువ సామాను తీసుకెళ్లే వారికి రివర్ ఇండి అనుకూలంగా ఉంటుంది. దీనిని చాలామంది SUV ఆఫ్ స్కూటర్స్ గా పిలుస్తారు. 14 అంగుళాల పెద్ద చక్రాలు, 43 లీటర్ల బూట్ స్పేస్, విశాలమైన ఫ్లోర్ బోర్డ్, పానియర్ మౌంట్స్ లాంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. 4 kWh బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 163 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
Read Also: ట్రయంఫ్ రాకెట్ 3కి స్టన్నింగ్ కలర్స్.. లుక్ చూస్తే అదిరిపోవాల్సిందే!