E-Paper
Advertisement

కొత్త డిజైన్.. సరికొత్త టెక్నాలజీ.. ఏథర్ సూపర్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్!

కొత్త డిజైన్.. సరికొత్త టెక్నాలజీ.. ఏథర్ సూపర్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్!
Advertisement

Ather New Electric Scooter Launch: భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో టాప్ బ్రాండ్ ఏథర్ ఎనర్జీ మరో కొత్త స్కూటర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ స్కూటర్‌ను ఆగస్టు 29న జరిగే ఏథర్ కమ్యూనిటీ డే 2026 కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. గత ఏడాది పరిచయం చేసిన కొత్త EL ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా రూపొందిన తొలి ప్రొడక్షన్ స్కూటర్ ఇదే కావడం విశేషం.  ప్రతి ఏడాది నిర్వహించే కమ్యూనిటీ డే ఈవెంట్‌ను ఈసారి బెంగళూరులో ఆగస్టు 29న నిర్వహించనున్నారు. ఈ వేదికపైనే కంపెనీ కొత్త స్కూటర్‌తో పాటు పలు సాంకేతిక ఆవిష్కరణలను కూడా పరిచయం చేయనుంది.

EL ప్లాట్‌ ఫారమ్ గురించి..

ఏథర్ ఇప్పటి వరకు 450 సిరీస్ స్కూటర్లతో మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు వాటికి భిన్నంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త EL ప్లాట్‌ ఫారమ్ ను అభివృద్ధి చేసింది. ఈ ప్లాట్‌ ఫారమ్‌ పై ఆధారపడి రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ కొత్త నిర్మాణం తయారీ ఖర్చును తగ్గించడంతో పాటు, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

కొత్త స్కూటర్‌ లో ప్రత్యేకతలు ఏంటి?   

Advertisement

ఇటీవల రోడ్లపై పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఈ స్కూటర్ కనిపించింది. గత ఏడాది ప్రదర్శించిన EL01 కాన్సెప్ట్ మోడల్‌ ను పోలి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. స్పై షాట్స్ ప్రకారం ఇందులో హ్యాండిల్‌ బార్‌ పై హెడ్‌ లైట్, ముందు భాగంలో వెడల్పాటి LED డే టైమ్ రన్నింగ్ లైట్స్, కొత్త స్టైలింగ్ కనిపించాయి. అంతేకాదు, కంపెనీ దాఖలు చేసిన డిజైన్ పేటెంట్‌ ను కూడా ఈ స్కూటర్ చాలా వరకు అనుసరించినట్లు కనిపిస్తోంది.

ధర ఎంత ఉండొచ్చు?

కొత్త EL ప్లాట్‌ ఫారమ్‌ మీద వచ్చే తొలి స్కూటర్ ధర రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షల మధ్య ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరతో మాస్ మార్కెట్ సెగ్మెంట్‌ లో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఏథర్ ముందుకు వస్తోంది. ఈ కార్యక్రమంలో కొత్త స్కూటర్‌తో పాటు మరికొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఛార్జింగ్ టెక్నాలజీ, సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్లు, కనెక్టెడ్ ఫీచర్లను కూడా కంపెనీ పరిచయం చేయనుంది.

Advertisement

ఏథర్ కొత్త EL ప్లాట్‌ఫామ్ ఆధారంగా వస్తున్న ఈ స్కూటర్ కంపెనీకి కీలకంగా మారే అవకాశం ఉంది. అందుబాటు ధర, కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీతో ఈ మోడల్ మార్కెట్లోకి వస్తే, మాస్ సెగ్మెంట్‌ లో మంచి పోటీని ఇవ్వగలదని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. ఆగస్టు 29న జరిగే కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఈ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.

Read Also: పెట్రోల్ నుంచి EVకి మారాలనుకుంటున్నారా? అదిరిపోయే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×