E-Paper
Advertisement

న్యూ లుక్‌.. సూపర్ మైలేజ్.. మళ్లీ రోడ్కెక్కబోతున్న టాటా సుమో?

న్యూ లుక్‌.. సూపర్ మైలేజ్.. మళ్లీ రోడ్కెక్కబోతున్న టాటా సుమో?
Advertisement

Tata Sumo May Return in a Bold New Avatar: ఒకప్పుడు ఇండియన్ రోడ్స్ పై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెహికల్ టాటా సుమో. ఈ పాపులర్ మోడల్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఎన్నో కుటుంబాలకు, వ్యాపార అవసరాలకు ఉపయోగపడిన ఈ SUV గురించి నెట్టింట కొత్త  కొత్త చర్చ మొదలైంది. టాటా మోటార్స్ త్వరలో సుమోను కొత్త డిజైన్‌తో తిరిగి మార్కెట్లోకి తీసుకురాబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కొత్త లుక్ లో టాటా సుమో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, కొత్త టాటా సుమోను పూర్తిగా మోడ్రన్ లుక్‌ తో తీసుకురావాలని కంపెనీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాత మోడల్‌ లో కనిపించిన బాక్సీ డిజైన్‌ కు బదులుగా మరింత స్టైలిష్ SUV రూపంలో ఈ వాహనం ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు,  గ్రామీణ ప్రాంత వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించే అవకాశముందని చెబుతున్నారు.

లీటర్ కు 20 కిలో మీటర్ల మైలేజ్

Advertisement

కొత్త సుమోలో పవర్ ఫుల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే ఇంజిన్ ప్రస్తుతం టాటా హారియర్ SUVలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్‌ తో వెహికల్ మంచి పనితీరును కనబరచడంతో పాటు, సుదూర ప్రయాణాల్లోనూ సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించే అవకాశం ఉంది. మైలేజ్ విషయానికి వస్తే, లీటరుకు సుమారు 20 కిలోమీటర్ల వరకు ఇవ్వొచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ మైలేజ్ పైనా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.

అత్యాధునిక ఫీచర్లతో..

ఫీచర్ల విషయంలో కూడా కొత్త టాటా సుమో అప్ డేటెడ్ గా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, రియర్ పార్కింగ్ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రియర్ ఏసీ వెంట్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ లాంటి సౌకర్యాలు ఉంటాయని భావిస్తున్నారు. భద్రత కోసం ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లు కూడా ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.

ధర ఎంత ఉంటుందంటే?

Advertisement

సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం కొత్త టాటా సుమో ధర రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కంపెనీ అధికారికంగా ప్రకటించిన తర్వాతే అసలు ధర, ఫీచర్లు, విడుదల తేదీ లాంటి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.  ప్రస్తుతం టాటా సుమో రీఎంట్రీ గురించి వస్తున్న వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాతో పాటు కొన్ని ఆటో వెబ్‌ సైట్లలో కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్ అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.

Read Also: అమ్మకాల్లో దూసుకెళ్తున్న ఏథర్ రిజ్టా, ఏకంగా ఎన్ని లక్షల యూనిట్లు సేల్ అయ్యాయంటే?

Related News

హోండా ఎయిర్‌ బ్లేడ్ డిజైన్‌ కు పేటెంట్.. ఏరాక్స్ 155కి షాక్ తప్పదా?

45°C వేడిలో ఈవీ కార్లు నడుపుతున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

MG విండ్సర్ EV, ZS EVపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఫ్రీ DC ఛార్జింగ్ కూడా!

టికెట్ కన్ఫార్మ్ అవుతుందా? లేదా?.. కొత్త AI టెక్నాలజీ ఇట్టే చెప్పేస్తుంది!

ఏథర్ To ఓలా.. స్మార్ట్ ఫీచర్లతో అదిరిపోయే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

అమ్మకాల్లో దూసుకెళ్తున్న ఏథర్ రిజ్టా, ఏకంగా ఎన్ని లక్షల యూనిట్లు సేల్ అయ్యాయంటే?

కార్ మోడిఫికేషన్స్ చేస్తున్నారా? లుక్ మారితే బుక్కైపోవడం పక్కా!

Big Stories

Advertisement
×