E-Paper
Advertisement

45°C వేడిలో ఈవీ కార్లు నడుపుతున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

45°C వేడిలో ఈవీ కార్లు నడుపుతున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Advertisement

EVs in Indian Summers: దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. అయితే, ఈవీలు  కొనాలనుకునే చాలా మందిలో ఇప్పటికీ కొన్ని అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ కార్లు సురక్షితంగా పనిచేస్తాయా? అనే ప్రశ్న తరచూ వినిపిస్తోంది. ఇటీవల కొన్ని EVలకు సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు కూడా వినియోగదారుల్లో ఆందోళన పెంచాయి.

వేడిలో ఈవీ ప్రయాణాలు సేఫేనా?

వాస్తవానికి లేటెస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపొందించబడుతున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్,  అంతకంటే ఎక్కువ వేడిలో కూడా EVలు సాధారణంగా సేఫ్ గానే పని చేస్తాయి. అయితే, వాహనం పనితీరు, రేంజ్, బ్యాటరీ సామర్థ్యంపై మాత్రం కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రతి ఎలక్ట్రిక్ వాహనానికి  నిర్దిష్ట ఉష్ణోగ్రత పరిధి ఉంటుంది. ఆ పరిధిలోనే బ్యాటరీ, ఇతర భాగాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. కొన్ని టాటా EV మోడళ్లు మైనస్ 22 డిగ్రీల నుంచి ప్లస్ 55 డిగ్రీల సెల్సియస్ వరకు పనిచేసేలా రూపొందించబడ్డాయి. అంటే, భారత సాధారణ వేసవి పరిస్థితుల్లోనూ వాటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చు.

ఎక్కువ వేడిలో తగ్గనున్న రేంజ్!  

Advertisement

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు EV రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. బ్యాటరీ వేడెక్కకుండా ఉంచేందుకు వాహనం అదనపు పవర్ ను ఉపయోగించాల్సి వస్తుంది. దీంతో, ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత ప్రయాణ దూరం తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని వాహనాల్లో రేంజ్ అనేది 15 నుంచి 25 శాతం వరకు తగ్గినట్లు నిపుణులు గుర్తించారు. ఇంకా వేడి ఎక్కువ అయితే, కొన్ని ఫీచర్లు తాత్కాలికంగా పని చేయకపోవచ్చు. రియర్ వ్యూ కెమెరా, డిస్‌ ప్లే, సెన్సార్ల పనితీరుపై ప్రభావం  పడే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత ఫీచర్లు మళ్లీ సరిగా పనిచేస్తాయి.

బ్యాటరీ రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

EVలలో అత్యంత ముఖ్యమైన భాగం బ్యాటరీ. లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్లలో ప్రత్యేకమైన థర్మల్ మేనేజ్‌ మెంట్ సిస్టమ్‌ ను అమర్చుతున్నారు. ఈ వ్యవస్థ బ్యాటరీ ఉష్ణోగ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ సురక్షితంగా ఉంచుతుంది. అవసరమైతే ఆటోమేటిక్‌గా కూలింగ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తుంది. ప్రస్తుతం ఎక్కువ శాతం కొత్త EVలు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఇందులో ప్రత్యేక ద్రవం ద్వారా బ్యాటరీ వేడిని తగ్గిస్తారు. ఈ విధానం బ్యాటరీ పనితీరును మెరుగుపరచడంతో పాటు భద్రతను కూడా పెంచుతుంది. కొన్ని బడ్జెట్ EVలు, పాత మోడళ్లలో ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని కార్లలో ఎయిర్ కండిషనర్ కూడా బ్యాటరీని చల్లగా ఉంచడంలో సాయపడుతుంది.

కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి!

Advertisement

అత్యధిక వేడి పరిస్థితుల్లో EVలో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నేరుగా ఎండలో ఎక్కువసేపు పార్క్ చేయకుండా చూడాలి. సాధ్యమైనంత వరకు షేడెడ్ ప్రాంతాల్లో వాహనాన్నినిలపాలి బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు వాడకుండా మధ్య మధ్యలో ఛార్జింగ్ చేయడం మంచిది.  అధిక వేడి కారణంగా రేంజ్, పనితీరులో కొంత మార్పు ఉన్నా, ఎలాంటి పెద్ద ముప్పు ఉండదంటున్నారు నిపుణులు.

Read Also: ఏథర్ To ఓలా.. స్మార్ట్ ఫీచర్లతో అదిరిపోయే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×