E-Paper
Advertisement

కార్ మోడిఫికేషన్స్ చేస్తున్నారా? లుక్ మారితే బుక్కైపోవడం పక్కా!

కార్ మోడిఫికేషన్స్ చేస్తున్నారా? లుక్ మారితే బుక్కైపోవడం పక్కా!
Advertisement

Car Modding Rules: కారును కస్టమైజ్ చేయించుకునేందుకు చాలా మంది ఇష్టపడుతారు. స్టైల్‌ గా కనిపించడానికి, డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మెరుగుపరచడానికి చాలామంది మార్పులు చేస్తుంటారు. అయితే, ప్రతి మార్పు చట్టబద్ధం కాకపోవచ్చు. కొన్ని మార్పులు రోడ్ సేఫ్టీకి ప్రమాదం కలిగించడంతో పాటు జరిమానాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే, మోడిఫికేషన్ లో ఏవి చేయకూడదో? ఏవి చేసుకోవచ్చో? ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ లైట్లు విషయంలో జాగ్రత్త

చాలా ఎక్కువ ఫోకస్ ఉన్న హెడ్‌లైట్లు వాడటం మంచిది కాదు. ఇవి డ్రైవర్ కు దారి బాగా కనిపించడానికి సహాయపడినా, ఎదురుగా వచ్చే డ్రైవర్లకు ఇబ్బంది కలిగిస్తాయి. దానికి బదులుగా స్టాండర్డ్ LED లైట్లు వాడటం మంచిది.

⦿ సైలెన్సర్

Advertisement

చాలా శబ్దం చేసే మోడిఫైడ్ ఎగ్జాస్ట్‌లు ఉండకూడదు. చూడ్డానికి ఆకట్టుకున్నాఎక్కువ శబ్దం చట్టవిరుద్ధం. దాని స్థానంలో సైలెంట్, పెర్ఫార్మెన్స్ ఉన్న ఎగ్జాస్ట్ సిస్టమ్ వాడాలి.

⦿ నంబర్ ప్లేట్

నంబర్ ప్లేట్‌ సరిగా కనిపించకపోవడం, స్పష్టంగా కనిపించకుండా చేసే ఫ్రేమ్‌ లు వాడటం తప్పు. దానికి బదులుగా సింపుల్,  క్లియర్ ఫ్రేమ్‌ లు వాడటం మంచిది.

⦿ డార్క్ విండోలు

Advertisement

చాలా డార్క్ విండో టింటింగ్. ఇది కారులో ప్రైవసీ ఇస్తుంది. కానీ, ఎక్కువ డార్క్ అయితే చట్టానికి విరుద్ధం. లిమిట్‌ లో ఉన్న టింట్ మాత్రమే వాడాలి.

⦿ రెడ్, బ్లూ లైట్లు

ఎరుపు, నీలం రంగు లైట్లు వాడటం పూర్తిగా నిషేధం. ఇవి పోలీస్, ఎమర్జెన్సీ వాహనాలలా కనిపించేలా చేస్తాయి. దానికి బదులుగా సాధారణ కలర్ అంబియంట్ లైట్లు వాడొచ్చు.

⦿ నియాన్ లైట్లు

కారు కింది భాగంలో నియాన్ లైట్లు అమర్చడం కొన్ని ప్రాంతాల్లో అనుమతించరు. వాటికి బదులుగా ఇంటీరియర్ అంబియంట్ లైటింగ్ వాడటం మంచిది.

⦿ సౌండ్ సిస్టమ్

చాలా పెద్ద బాస్ ఉన్న సౌండ్ సిస్టమ్ వాడకూడదు. ఇది చుట్టూ ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. దానికి బదులుగా బ్యాలెన్స్ చేసిన ఆడియో సిస్టమ్ ఉపయోగించాలి.

⦿ కారు ఎత్తుగా మార్చడం

చాలా ఎత్తుగా మార్చిన ట్రక్కులు చట్టవిరుద్ధం. ఇవి విజిబిలిటీ సమస్యలు కలిగిస్తాయి. ఫ్యాక్టరీ లెవెల్‌ లో ఉన్న సస్పెన్షన్ మార్పులు మాత్రమే అనుమతిస్తారు.

⦿ మెటల్ స్టడెడ్ టైర్లు

మెటల్ స్టడెడ్ టైర్లు వాడటం కొన్ని ప్రాంతాల్లో నిషేధం. దానికి బదులుగా ఆల్ వెదర్, గ్రిప్ టైర్లు వాడటం మంచిది.

⦿ లేజర్ జామ్మర్లు

లేజర్ జామ్మర్లు వాడటం చట్టవిరుద్ధం. ఇవి పోలీస్ రాడార్‌ ను తప్పుదోవ పట్టిస్తాయి. దానికి బదులుగా స్పీడ్ లిమిట్ పాటించడం బెస్ట్.

సో, కార్ మోడిఫికేషన్స్ చేస్తూ స్టైల్‌ ను మెయింటైన్ చేయడం మంచిదే. కానీ, భద్రత, చట్టాలను గౌరవించడం చాలా ముఖ్యం. సరైన మార్పులు చేస్తే మీ కారు అందంగా కనిపించడమే కాకుండా సురక్షితంగా ఉంటుంది.

Read Also: టాటా To కియా.. 2026లో లాంచ్ కానున్న 7 సీట్ల SUVలు ఇవే!

Related News

రూ.9 లక్షల నుంచే లగ్జరీ ఫీచర్.. వెంటిలేటెడ్ సీట్లతో వచ్చే చీప్ అండ్ బెస్ట్ కార్లు ఇవే!

సర్వీస్ ఖర్చు తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. టాప్ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే!

జూలైలో హోండా బిగ్ బెనిఫిట్స్.. ఎలివేట్‌పై భారీ తగ్గింపు.. అమేజ్‌ పైనా సూపర్ ఆఫర్లు!

కొత్త టయోటా ఫార్చ్యూనర్ వస్తోంది.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

జూలైలో కొత్త కార్ల జాతర.. ఏకంగా 8 క్రేజీ మోడల్స్ లాంచ్!

టాటా EVలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.35 లక్షల డిస్కౌంట్!

తక్కువ ఖర్చు.. ఎక్కువ మైలేజ్.. రూ.10 లక్షల్లోపు బెస్ట్ CNG ఆటోమేటిక్ కార్లు ఇవే!

తక్కువ ధరలో బెస్ట్ ఫ్యామిలీ కార్లు.. ఈ 3 సెడాన్లను అస్సలు మిస్ కావొద్దు!

Big Stories

Advertisement
×