E-Paper
Advertisement

విజయ్ కోసం త్రిష మతం మారిందా?

విజయ్ కోసం త్రిష మతం మారిందా?
Advertisement

Trisha:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్.. తన సినిమాలతో తెలుగు, తమిళ్, హిందీ ప్రేక్షకులను అలరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా నిలిచారు విజయ్ దళపతి. కెరియర్ పరంగా దూసుకుపోతున్న ఈయన వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలలో తనను ఆదరించిన ప్రజలకు అండగా నిలవడానికి టీవీకే అనే పార్టీని స్థాపించి, ఈసారి ఎన్నికలలో బరిలోకి దిగారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి.. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.

విజయ్ కోసం త్రిష మతం మారిందా?

అలా ఒకవైపు కెరియర్ పరంగా బిజీగా మారుతుంటే మరొకవైపు ప్రముఖ హీరోయిన్ త్రిష తో రిలేషన్ లో ఉన్నారని.. అందుకే తన భర్త నుంచి విడాకులు కావాలి అంటూ విజయ్ భార్య సంగీత కొన్ని నెలల క్రితమే కోర్టులో కేసు వేసింది. ఇటీవల వాయిదా కూడా నడిచింది. కానీ రాజకీయ ప్రచారం కారణంగా ఆయన ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారు. అయితే మే నెలలో స్వయంగా విజయ్ హాజరుకావాలని కోరుతూ ఆదేశాలు జారీ చేసింది కోర్ట్. కనీసం ఇప్పటికైనా విజయ్ – త్రిష మధ్య ఉన్న సంబంధం గురించి వార్తలు ఆగుతాయని అందరూ అనుకున్నా.. ఆ వార్తలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే సంగీత కోర్టులో విడాకుల కేసు వేసిన తర్వాత కూడా.. వీరిద్దరు చట్టపట్టలేసుకొని తిరుగుతూ అనేకసార్లు మీడియా కంట పడ్డారు. ఇప్పుడు తాజాగా తమిళనాట వార్త సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా హీరో విజయ్ కోసం హీరోయిన్ త్రిష మతం మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

అసలు విషయం ఏమిటంటే?

అయితే ఈ గుసగుసలు వినిపించడానికి కారణం ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి వచ్చిన త్రిష.. తాను ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తన వేలిని చూపించింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అందులో త్రిష కారు డాష్ బోర్డుపై క్రైస్తవ మత గుర్తు స్పష్టంగా కనిపిస్తోంది. పుట్టుకతో హిందూ బ్రాహ్మణురాలు అయిన త్రిష వాహనంలో ఇలా క్రైస్తవ మత గుర్తు కనిపించడం చూసి అందరూ విజయ కోసం ఆమె మతం మార్చుకుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటు విజయ్ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాడు. కాబట్టే అతని కోసం ఈమె మతం మారిందా లేక వీరిద్దరూ ఇప్పటికే రహస్యంగా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారా అని అనుమానాలు కూడా నెటిజన్స్ నుంచి వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా త్రిష కారులో బయటపడ్డ ఈ గుర్తు అనుమానాలను మరింత రేకెత్తిస్తోంది.

Advertisement

ALSO READ:సినీ లవర్స్ కి షాక్.. మే 1 నుంచి థియేటర్లు బంద్!

సంగీతతో విడాకులు కన్ఫర్మ్ అయినట్టేనా?

ఇకపోతే గత కొన్ని నెలలుగా విజయ్, అతని భార్య సంగీతల మధ్య బంధానికి బీటలు వారి ఇప్పటికే విడాకులు వ్యవహారం కోర్టులో కొనసాగుతోంది. పైగా విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడని.. 35 కోట్ల భరణం ఇచ్చి ఆమెను దూరం చేసుకోబోతున్నారట. అలాగే కూతురు, కొడుకు బాధ్యతలను తాను తీసుకోబోతున్నట్లు విజయ్ చెప్పినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×