E-Paper
Advertisement

Elections : 2028లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు?

Elections : 2028లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు?
Advertisement

కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంతో తెలంగాణ సార్వత్రిక ఎన్నికల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.మొన్నటివరకు రాష్ట్ర ఎన్నికలు 2029లో జమిలి ఎన్నికలతో పాటే జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ప్రస్తావించారు. రాష్ట్ర అసెంబ్లీ 2028 చివరలో ముగిసినా తనకు ఇంకా ఆరు నెలల సమయం ఉంటుందని సీఎం చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అదంతా సాధ్యం కాదని తెలుస్తున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో డీమిలిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ అమలు బిల్లులను కేంద్ర విత్ డ్రా చేసుకున్నది.దీంతో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో సాధ్యంకాదని తెలుస్తున్నది.జనగణన,డీలిమిటేషన్ పూర్తయ్యాకే జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది.

రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..

ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిల్లులను కేంద్రం వెనక్కితీసుకుంది. తదుపరి ఏం చేయనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మహిళా బిల్లు వీగిపోవడంతో కేంద్రం కేబినెట్ సమావేశం నిర్వహించింది. తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రులతో చర్చించినట్టు తెలిసింది. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని.. ఈ విషయాన్ని పెద్దఎత్తున ప్రచారం చేయాలని.. నిరసనలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి కేడర్‌కు ఆదేశాలు సైతం అందాయి.ఈ క్రమంలోనే రాష్ట్రంలో నిరసనలకు కమలం పార్టీ పిలుపునివ్వగా..పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యి సీనియర్ నేతలను హౌస్ అరెస్టు చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీజేపీ నేతలు వెళ్తున్నారని తెలిసి పోలీసులు వారిని అడ్డుకుని పీఎస్‌కు తరలించినట్టు తెలిసింది.

సీఎం రేవంత్ ఏం చేయనున్నారు?

Advertisement

జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో 2028లోనే తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో రేవంత్ సర్కారుకు ఇంకా రెండున్నరేండ్ల సమయం మాత్రమే ఉన్నది. ఆరునెలలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం దొరుకుతుందని భావించిన రేవంత్‌.. ఇప్పుడు ఏం చేయనున్నారనేదానిపై ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే చాలావరకు స్కీమ్స్, పెండింగ్ పనులు పూర్తికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా తులం బంగారం, మహిళలకు రూ.2500 ఇంకా అమలులోకి రాలేదు. నామినేటెడ్ పోస్టులు పెండింగులోనే ఉన్నాయి. కేబినెట్ విస్తరణ, ప్రాజెక్టుల పూర్తి, అందుకు నిధుల సేకరణ సర్కారుకు భారంగా మారింది.

చంద్రబాబు, లోకేశ్, పెమ్మసాని గుర్తుపెట్టుకో.. ఎవరినీ వదిలిపెట్టను.. అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!

Advertisement

మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రేవంత్ సర్కారును పదే పదే టార్గెట్ చేస్తున్నది. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ , హైడ్రాకూల్చివేతలు, బీసీ రిజర్వేషన్ల అమలు ఎప్పుడు అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రెండున్నరేండ్ల సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందా? అనేది మున్ముందు తెలియాల్సి ఉన్నది. ఎన్నికలు సైతం ముందే రావడంతో ఇప్పటికే ప్రతిపక్షం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఎన్నికలకు ఏడాది ముందు బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు వెళ్తాయని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మరోసారి ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడతారా? అనేది వేచిచూడాల్సిందే.

Related News

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

Big Stories

Advertisement
×