BigTV English
Advertisement

2024 Geo Politics | 2024లో ప్రపంచ దేశ రాజకీయాలు.. యుద్ధాలు ఆగిపోతాయా?

2024 Geo Politics | 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి. జరుగుతున్న యుద్ధాలు ఏ టర్న్ తీసుకోబోతున్నాయి? వాతావరణ మార్పులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? అగ్రదేశం అన్న ట్యాగ్‌ కోసం పోటీ పడుతున్న అమెరికా, చైనాలు ఏ సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? ఏయే దేశాల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి?

2024 Geo Politics | 2024లో ప్రపంచ దేశ రాజకీయాలు.. యుద్ధాలు ఆగిపోతాయా?

2024 Geo Politics | 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి. జరుగుతున్న యుద్ధాలు ఏ టర్న్ తీసుకోబోతున్నాయి? వాతావరణ మార్పులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? అగ్రదేశం అన్న ట్యాగ్‌ కోసం పోటీ పడుతున్న అమెరికా, చైనాలు ఏ సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? ఏయే దేశాల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయి?


2024లో మన దేశంతో పాటు ఏకంగా 40కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 40 శాతానికిపైగా ప్రజలు ఈ ఏడాది ఓట్లు వేయనున్నారు. ప్రపంచ పెద్దన్నగా చెప్పుకొనే అమెరికా, అప్పట్లో ఓ వెలుగు వెలిగిన రష్యా, ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందుతున్న భారత్‌తో పాటు బ్రిటన్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా, చిన్న దేశాలైన ఇరాన్‌, దక్షిణ సూడాన్‌, తైవాన్‌, భూటాన్‌తో పాటు యూరోపియన్‌ యూనియన్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రపంచ గతినే మార్చేంత శక్తి ఉన్నవనడంలో ఏ డౌట్ లేదు. ఈ దేశాల్లో కొలువుదీరబోయే ప్రభుత్వాధినేతలను బట్టి ఆయా దేశాలతో పాటు ప్రపంచ భవితవ్యం ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా అమెరికా, రష్యా, భారత్‌, బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌లో జరిగే ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపడం ఖాయమనే చెప్పాలి.

ముఖ్యంగా అమెరికా ఎన్నికలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున 77 ఏండ్ల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఆ పార్టీ తరఫున అభ్యర్థిత్వం విషయంలో ట్రంప్‌ కాస్త ముందంజలో ఉన్నట్టు తెలుస్తున్నది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం భారతీయ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి కూడా బరిలో ఉన్నారు. మరి ఈసారి అగ్రరాజ్యం ఎన్నికల్లో గెలుపెవరిది అన్నది తేలిపోనుంది.


చైనాలో అధికారం ఎవరిది అంటే కమ్యూనిస్ట్‌ పార్టీదని ఎవ్వరైనా చెబుతారు. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ 2024లో ఓ అరుదైన ఘనత సాధించబోతుంది. ఈ ఏడాది 75 ఏళ్లుగా ఒకే పార్టీ అధికారంలో నడుస్తున్న దేశంగా చైనా అడుగుపెట్టబోతుంది. 1949 అక్టోబర్ ఒకటినా మావో పాలనా పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి లీడర్లు మారారు కానీ.. చైనాను శాసిస్తోంది.. పాలిస్తోంది మాత్రం ఒక్క కమ్యూనిస్ట్‌ పార్టీనే. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక శక్తిలో రెండో స్థానంలో ఉన్న చైనా.. ప్రస్తుతం అగ్రదేశంగా ఉన్న చైనాతో ఢీ కొడుతోంది. దీనంతటికి కారణం వన్ పార్టీ రూలింగ్ అన్న విశ్వాసం చైనాలో ఉంటే.. ఇది నియంతృత్వమే అన్నది ఇతర దేశాల అభిప్రాయం.

సూపర్‌ పవర్‌ అడుగుకు మరో అడుగు దూరంలో ఉంది డ్రాగన్ కంట్రీ చైనా. అమెరికాను ఢీకొట్టి తన సత్తా చాటాలని ఎప్పటి నుంచో వ్యూహాలను రచిస్తోంది. రష్యాతో దోస్తీ చేస్తూనే.. అనేక ఈయూ, అరబ్‌ దేశాలకు దగ్గరవుతూ వస్తోంది. ఇప్పిటికే చాలా అంశాల్లో అమెరికాను ఢీకొట్టే పరిస్థితికి వచ్చేసింది. బెలూన్లతోనే అమెరికా ఎయిర్‌స్పేస్‌లోకి చొరబడి రక్షణ రహస్యాలను తెలుసుకోవడమే కాదు.. అమెరికా ఇంటెలిజెన్స్‌ డేటాను హ్యాక్‌ చేసి సంపాదించిన టెక్నాలజీతో ఇప్పుడు వారితోనే తలపడేందుకు రెడీ అయిపోయింది.

2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన యుక్రెయిన్-రష్యా యుద్ధం 2024లో ఎలాంటి టర్న్‌ తీసుకోబోతుందనేది ఇప్పుడు భయాందోళనలను సృష్టిస్తోంది. కొత్త సంవత్సరంలోనైనా ఈ యుద్ధానికి ముగింపు పలుకుతుందా? అంటే సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. దాదాపు రెండేళ్లుగా బలమైన రష్యాతో తలపడుతున్న యుక్రెయిన్ వచ్చే ఏడాదిలో కూడా అదే పోరాటపటిమను చూపించగలదా? రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బలమైన రష్యాను సమర్థవంతంగా తట్టుకొని ఉక్రెయిన్‌ ఇన్ని నెలలుగా పోరాటం చేయడం ఆశ్చర్యపరిచేది. అయితే అమెరికాతో పాటు బ్రిటన్, ఈయూ ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తూ వస్తున్నాయి. అయితే 2024లో ఈ సాయం ఇలానే కొనసాగుతుందా? అనేది తేలాల్సి ఉంది. అమెరికాతో పాటు ఈయూలో జరిగే ఎన్నికల ఫలితాలపై రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు ఆధారపడి ఉంది.

ఓ వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగానే ప్రపంచానికి మరో ఉపద్రవాన్ని తీసుకొచ్చింది ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డ హమాస్ మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. దీనికి ప్రతికారంగా గాజాపై విరుచుకపడుతోంది ఇజ్రాయెల్. ఎయిర్‌స్ట్రైక్స్‌తో పాటు గ్రౌండ్ ఆపరేషన్‌ను ప్రారంభించి హమాస్ టన్నెల్ నెట్‌వర్క్‌ను నాశనం చేస్తూ వస్తోంది. ప్రపంచ దేశాలు, యూఎన్‌ సీజ్‌ ఫైర్‌ పాటించాలని చేస్తున్న విజ్ఞప్తిని పట్టించుకోకుండా దూసుకుపోతుంది. మరోవైపు గాజాలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. హమాస్‌ను అంతమొందించాలన్నదే తమ టార్గెట్ అంటున్న ఇజ్రాయెల్ కొత్త ఏడాదిలోనైనా ఈ యుద్ధానికి ముగింపు పలుకుతుందా? తాము అనుకున్న టార్గెట్‌ను రీచ్ అవుతుందా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

కొన్నేళ్లుగా భూమి వేడెక్కుతోంది. ఎండాకాలంలో వానలు కురుస్తున్నాయి. వానాకాలంలో తట్టుకోలేనంత ఎండలు కాస్తున్నాయి. మహాసముద్రాల్లో మంచు కరిగిపోతోంది. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ఇలా వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాలు, సంస్థలు వాతావరణాన్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మరి 2024లో వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు కాస్త ఆందోళన కలిగిస్తోంది. 2024లో ఇలాంటి సమస్యలు మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. పెట్రోలియం, నేచురల్‌‌ గ్యాస్‌‌, బొగ్గు.. ఇలాంటి వాటిని మనం అవసరం ఉన్నదానికంటే ఎక్కువగా వాడుతున్నామని.. ఇప్పటికిప్పుడు మొత్తం ఆపేసినా.. రానున్న విపత్తులను ఆపలేరన్నది వారి మాట. వాతావరణ పరంగా 2024లో కొన్ని కఠిన పరీక్షలు తప్పవని చెబుతున్నారు.

2024 Geopolitics, Geopolitics, high tension, world nations, Russian Ukraine war, Israel Hamas war, Global Warming, china,

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×