BigTV English

2024 Indian Cricket : 2023 క్రికెట్ ఫ్యాన్స్ కు ఓ పీడకలే.. ఈ ఏడాది సంగతేంటి..?

2024 Indian Cricket : 2023 క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఓ పీడకల అనే చెప్పాలి. సొంత గడ్డపై వరల్డ్‌కప్‌ను రోహిత్‌ సేన ముద్దాడటం పక్కా అనుకున్న సమయంలో అనూహ్య ఓటమి పెట్టిన బాధ అంతా ఇంతా కాదు. కానీ డోంట్ వర్రీ అంటోంది 2024. ఈ ఏడాది మరో ప్రపంచ కప్ సమరంతో పాటు.. ఐపీఎల్ ఫ్యాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. అంతేకాదు 2024లో అనేక గేమ్స్‌కు ఇప్పటికే డేట్స్‌ కన్‌ఫామ్‌ అయిపోయాయి.

2024 Indian Cricket : 2023 క్రికెట్ ఫ్యాన్స్ కు ఓ పీడకలే.. ఈ ఏడాది సంగతేంటి..?

2024 Indian Cricket : 2023 క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఓ పీడకల అనే చెప్పాలి. సొంత గడ్డపై వరల్డ్‌కప్‌ను రోహిత్‌ సేన ముద్దాడటం పక్కా అనుకున్న సమయంలో అనూహ్య ఓటమి పెట్టిన బాధ అంతా ఇంతా కాదు. కానీ డోంట్ వర్రీ అంటోంది 2024. ఈ ఏడాది మరో ప్రపంచ కప్ సమరంతో పాటు.. ఐపీఎల్ ఫ్యాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. అంతేకాదు 2024లో అనేక గేమ్స్‌కు ఇప్పటికే డేట్స్‌ కన్‌ఫామ్‌ అయిపోయాయి.


కొత్త ఏడాది ఎంట్రీలోనే ఐపీఎల్‌ సందడి మొదలైంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్‌ క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సూమారు రెండు నెలలపాటు జరిగే ఈ టోర్ని మే నెల చివరి నాటికి పూర్తి కానుంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల సమరం తర్వాత ఐపీఎల్‌ షెడ్యూల్‌పై క్లారిటీ రానుంది. ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియతో పాటు మినీ వేలం కూడా పూర్తైంది.

2023 భారత క్రికెట్ జట్టుకు మరీ అంత బ్యాడ్ అని చెప్పలేం. అయితే ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ రెండుసార్లు ఐసీసీ ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే 2024 టీమిండియాకు మరో చాన్స్ ఇస్తోంది. జూన్ 4 నుంచి జూన్ 30 వరకు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ టోర్నీలో అయినా విక్టరీ సాధించి కప్‌ను ముద్దాడే అవకాశం ఉంది టీమ్ ఇండియాకు. వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి.


సెప్టెంబర్‌లో ఉమెన్స్ క్రికెట్ టీమ్ కూడా వరల్డ్ కప్ ఆడనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన లోగోలను విడుదల చేసింది ఐసీసీ. బంగ్లాదేశ్‌ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. వీటితో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో టెస్ట్, వన్డే, టీ20 సీరిస్‌లు ఆడనుంది ఉమెన్స్ క్రికెట్ టీమ్.

ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరిగే ఒలింపిక్స్‌కు ఈ సారి ప్యారిస్‌ వేదిక కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. జులై 26న ప్రారంభం కానున్న ఈ మెగా వెంట్‌ కోసం అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ఈఫిల్‌ టవర్‌ వద్ద కౌంట్‌డౌన్‌ క్లాక్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్‌ రింగ్స్‌ను సిటీ హాల్‌ ముందు ఉంచారు. ఒలింపిక్స్‌కు మూడుసార్లు ఆతిథ్యమిచ్చిన రెండో నగరంగా పారిస్‌ ఓ అరుదైన రికార్డును అందుకోనుంది. 1900లో తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చింది. మొదటిసారి మహిళా అథ్లెట్లు పోటీపడ్డ ఒలింపిక్స్‌ కూడా ఇదే కావడం విశేషం. ఆ తర్వాత 1924లో రెండో సారి ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు సరిగ్గా వందేళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి ఇక్కడ ఒలింపిక్స్‌ నిర్వహించనున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×