AB Venkateswara Rao: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారా? అంటే అవును అనే సమాధానం వస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్షసాధింపులకు గురై.. అయిదేళ్ల పాటు న్యాయపోరాటం చేసిన మాజీ ఐపీఎస్‌కు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నామినేటెడ్ పోస్టు కట్టబెట్టింది. దానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడి వారాలు గడుస్తున్నా ఏబీ ఆ కూర్చి వైపు చూడటం లేదు. అంటే తనకు కేటాయించిన పదవిపై ఆయన సంతృప్తిగా లేరా? తన రేంజ్‌కి తగ్గ పోస్టు ఇవ్వలేదని ఆయన అలిగి బాధ్యతలు స్వీకరించడం లేదా?
వైసీపీ హయాంలో కక్షసాధింపులకు గురైన ఏబీ వెంకటేశ్వరరావు
వైసీపీ ప్రభుత్వంలో కక్షసాధింపులకు గురై, ఐదేళ్లపాటు న్యాయ పోరాటం చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఒకింత ఉపశమనం లభించింది. గత ప్రభుత్వం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తోసిపుచ్చుతూ.. సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించింది. సస్పెన్షన్ సమయంలో విధులు నిర్వహించినట్లుగా గుర్తించి వేతన, అలవెన్సుల చెల్లింపునకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర కేడర్‌కు చెందిన అధికారి ఏబీవీని 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పోస్టింగ్ నుంచి తప్పించారు.
2020 ఫిబ్రవరి 2న ఏబీని సస్పెండ్ చేసిన జగన్ సర్కారు
ఏబీ వెంకటేశ్వరరావు నిఘా విభాగం అధిపతిగా ఉన్నప్పుడు ఇజ్రాయిల్ నుంచి అధునాతన టెక్నాలజీ కొనుగోలుకు సంబంధించి అవినీతి జరిగిందంటూ 2020 ఫిబ్రవరి 2న జగన్ సర్కారు సస్పెండ్ చేసింది. దాంతో ఏబీవీ న్యాయ పోరాటానికి దిగారు. విదేశాల నుంచి ఎలాంటి టెక్నాలజీ కొనుగోలు చేయలేదని, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ 2022 ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది.
ప్రింటింగ్ ప్రెస్ కమీషనర్‌గా నియమించిన జగన్ ప్రభుత్వం
ఆ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావుని ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా నియమించిన జగన్ ప్రభుత్వం వారం రోజులు తిరక్కుండానే రెండోసారి 2022 జూన్ 28న సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ మరోమారు న్యాయ పోరాటానికి దిగిన ఏబీ వెంకటేశ్వరరావు 2024 మే 8న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌లో విజయం సాధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పదవీ విరమణకు ముందు రోజు జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. బాధ్యతలు తీసుకుని కొన్ని గంటల్లోనే పదవీ విరమణ చేశారు.
వారాలు గడుస్తున్నా బాధ్యతలు చేపట్టని ఏబీ వెంకటేశ్వరరావు
తర్వాత ఏర్పడిని కూటమి ప్రభుత్వానికి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసిన ఏబీవీ.. కోర్టు, క్యాట్ తీర్పుల మేరకు న్యాయం చేయాలని కోరారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై నమోదైన తప్పుడు అభియోగాలను వెనక్కి తీసుకుంది. సస్పెన్షన్ కాలానికి వేతన, అలవెన్సులు చెల్లించేలా చర్యలు తీసుకుంది. తర్వాత ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పూర్తి స్థాయి పెత్తనం చెలాయించిన ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్‌గా కంటే టీడీపీ సానుభూతిపరుడిగానే ఆయనపై వైసీపీ వర్గాలు విస్తృత ప్రచారం చేశాయి. అందుకు తగ్గట్టే.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏబీవీపై కక్షగట్టి చుక్కలు చూపించారన్నది డిపార్ట్‌మెంట్‌లో టాక్.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోస్ట్ ఇచ్చిన కూటమి సర్కారు
ఇక 2024లో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఏబీ వెంకటేశ్వరరావు పీల్చుకున్నారు. డీజీ ర్యాంక్‌లో రిటైర్ అయిన ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది కూటమి సర్కారు. మామూలుగా అయితే.. అలాంటి పదవుల కోసం రాజకీయ నాయకులు, రిటైర్డ్ అధికారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ప్రకటన వచ్చీరాగానే.. జీవోకంటే ముందు వాళ్ళు వెళ్ళి కుర్చీలో వాలిపోతుంటారు. అయితే ఏబీవీ విషయంలో మాత్రం సీన్ రివర్స్‌లో కనిపిస్తుంది.
వారాలు గడుస్తున్నా బాధ్యతలు చేపట్టని ఏబీ వెంకటేశ్వరరావు
గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి వారాలు గడుస్తున్నా ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం ఇంత వరకు అటు వైపు తొంగి చూడలేదు. ఎందుకలా అని ఆరాలు తీస్తున్నవారు ఆయన అసంతృప్తికి గల కారణాలు తెలిసి ఆశ్చర్యపోతున్నారంట. అయితే కూటమి ప్రభుత్వం తనకిచ్చిన నామినేటెడ్ పోస్ట్‌తో ఆయన సంతృప్తిగా లేరంట. నా రేంజ్ ఏంటి? నా ర్యాంక్ ఏంటి? గత అయిదేళ్లు నేను అనుభవించిన కష్టాలు ఏంటి? మీరు నాకు ఇచ్చిన పోస్ట్ ఏంటంటూ? కూటమి ప్రభుత్వంపై ఆయన అగ్గి మీద గుగ్గిలమై మండిపడుతున్నారంట.
ఛార్జ్ తీసుకునే ప్రసక్తేలేదని భీష్మించుకు కూర్చున్న ఏబీ
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టు తన స్థాయికి తగ్గది కాదని, దానికి బదులు కామ్‌గా ఉండటమే బెటర్ అని ఫీలవుు్నారంట. వైసీపీ హయాంలో ఐదేళ్ళు అవమానలు పడ్డాను, జీతం కూడా లేకుండా పని చేశాను.. అలాంటి తనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవా? అని ప్రశ్నిస్తున్నారంట. వేరే పోస్ట్ ఇవ్వాలని.. అంతేగాని అక్కడ ఛార్జ్ తీసుకునే ప్రసక్తేలేదని భీష్మించుకు కూర్చున్నారంట. పోలీస్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
ఏబీకి మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ నాయకులు
హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌కు ఎలాంటి పవర్స్ ఉండవని, ఐజీ, డీజీ, జిల్లాల ఎస్పీలతో అస్సలు యాక్సిస్ ఉండదని, ఎవ్వరూ తన మాట వినరని ఏబీ వెంకటేశ్వరరావు అంటున్నారంట. అటు టీడీపీలోని ఓవర్గం సైతం ఏబీవీకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారంట. తెలుగుదేశం సానుభూతిపరుడు అన్న ముద్రతో ఐదేళ్ళు అష్టకష్టాలు పడిన ఆఫీసర్‌కి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంత పవర్‌లేని పోస్ట్ ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? ముఖ్యమంత్రి చంద్రబాబు తన నిర్ణయం పునరాలోచించుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
సోషల్ మీడియాలో పార్టీ అధినేతను ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్లు
ఇంకొందరైతే.. ఓ అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ .. ఏబీకి అంత అన్యాయం చేస్తారా సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే ప్రసక్తే లేదని ఏబీ వెంకటేశ్వరరావు తేల్చి చెప్తున్నారంట .. తన ప్రాధాన్యతల్ని కూడా ఆయన ప్రభుత్వం ముందు పెడుతున్నారంట. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఒక విచారణ కమిటీ వేసి దానికి తనను ఛైర్మన్‌ని చేయాలన్నది ఆయన మనసులోని మాటగా తెలుస్తోంది. లేదంటే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఓఎస్‌డీ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి.. స్పెషల్ పవర్స్‌తో అది తనకు ఇవ్వాలని అడుగుతున్నారంట.
ఏబీకి మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ నాయకులు
గత ప్రభుత్వ అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేస్తే.. తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, దాని ద్వారా డిపార్ట్‌మెంట్‌లో అందరితో మాట్లాడే అవకాశం ఉంటుందని ఏబీవీ తన సన్నిహితులతో అంటున్నారంట. అటు టీడీపీలోని ఓ వర్గం కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తున్న క్రమంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వం గనుక అలాంటివన్నీ కుదరవు. ఇచ్చిన పోస్ట్‌లో జాయిన్ కావాల్సిందేనని గట్టిగా అంటే ఏబీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంట్రస్టింగ్‌గా తయారైంది.