BigTV English

Whatsapp Chat Lock : మీ ఫోన్‌లో వాట్సాప్ ప్రైవేట్ మెసేజ్‌లు ఎవరూ చదవకూడదంటే.. సెట్టింగ్స్ లో ఇవి మార్చండి

Whatsapp Chat Lock : మీ ఫోన్‌లో వాట్సాప్ ప్రైవేట్ మెసేజ్‌లు ఎవరూ చదవకూడదంటే.. సెట్టింగ్స్ లో ఇవి మార్చండి

Whatsapp Chat Lock Voice Message Transcription | ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. అయితే, కొన్నిసార్లు ప్రజలకు దీని గురించి గోప్యతా సమస్యలు ఉంటాయి. మీ ఫోన్ ఎవరైనా ఇతరులు ఉపయోగిస్తున్నప్పుడు, మీ ప్రైవేట్ సందేశాలు ఎవరు చూస్తారో అనే ఆందోళన ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, వాట్సాప్‌లో “లాక్ చాట్” ఫీచర్ ఉంది. దీని ద్వారా మీరు మీ చాట్‌లను సురక్షితంగా దాచవచ్చు.


లాక్ చాట్ ఫీచర్ ఎలా ఉపయోగించాలి:

  • ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ తెరవండి.
  • మీరు దాచాలనుకున్న చాట్‌ను ఎంచుకోండి.
  • స్క్రీన్ కుడివైపున టాప్ కార్నర్ వద్ద ఉన్న మూడు చుక్కల చిహ్నాన్ని నొక్కండి.
  • “లాక్ చాట్” ఎంపికను ఎంచుకోండి.
  • “ఈ చాట్‌ను లాక్ చేసి దాచి ఉంచండి” అనే పాప్-అప్ కనిపిస్తుంది. దానిని ఎంపిక చేసుకోండి.
  • “కొనసాగించు” అనే ఆప్షన్‌పై నొక్కి, చాట్‌ను లాక్ చేయండి.

లాక్ చేసిన తర్వాత, ఈ చాట్ మీ ఫోన్‌లోని బయోమెట్రిక్ లాక్ (ఫేస్ అన్‌లాక్ లేదా ఫింగర్‌ప్రింట్) ద్వారా మాత్రమే తెరవగలరు. లాక్ చేసిన చాట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్‌లు కూడా దాచబడతాయి, కేవలం “1 కొత్త సందేశం” అని మాత్రమే చూపిస్తుంది.


చాట్‌ను అన్‌లాక్ చేయడం:

  • లాక్ చేసిన చాట్‌కి వెళ్లండి.
  • ప్రొఫైల్‌కి వెళ్లి, “అన్‌లాక్ చాట్” ఎంపికను ఎంచుకోండి.

ఈ ఫీచర్ ద్వారా మీ ప్రైవేట్ సందేశాలు సురక్షితంగా ఉంటాయి. దీంతో  ఇతరులు చూడలేరు.

Also Read: కూల్ ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్లు ఈ నెలలోనే లాంచ్.. ఫోన్ కొనేవారు తప్పక తెలుసుకోవాలి

ప్రైవేసీ కోసం వాయిస్ మేసేజ్‌లను చదివే ఫీచర్ కూడా

వాట్సాప్‌ను యూజర్లు ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లను పంపడానికి ఉపయోగించుకోవచ్చు. వాయిస్ మెసేజ్‌ల ద్వారా సమాచారాన్ని పంపడం చాలా సులభం, కానీ అది బయటకు వినిపించడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు సమస్య లేదు, కానీ సినిమా థియేటర్‌లో, స్నేహితులతో ఉన్నప్పుడు, ఆఫీస్‌లో లేదా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మెటా యజమాన్యం.. వాట్సాప్‌‌లో “వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్” ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌గా మార్చి చదవడానికి అనుమతిస్తుంది.

2024 నవంబర్‌లో వాట్సాప్.. ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ యూజర్‌లకు అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ యూజర్‌లకు కూడా లభిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్‌లను ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, పోర్చుగీస్, ఇతర భాషలలో టెక్స్ట్‌గా మార్చవచ్చు. హిందీ, తెలుగు లాంటి భారతీయ భాషలకు ప్రస్తుతం ఇది సపోర్ట్ చేయడం లేదు. కానీ భవిష్యత్తులో ఇతర భాషలతో పాటు భారతీయ భాషలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ ఎలా ఉపయోగించాలి:

  • వాట్సాప్ సెట్టింగ్‌ల మెనూ‌లోకి వెళ్లండి.
  • “చాట్స్” ఎంపికను ఎంచుకోండి.
  • “వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్” విభాగానికి వెళ్లండి.
  • ఈ ఫీచర్‌ను ఆన్ చేసి, మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
  • వాయిస్ మెసేజ్‌ను నొక్కి పట్టుకుని, “ట్రాన్స్క్రిప్ట్” ఎంపికను ఎంచుకోండి.

ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌గా చదవడం సులభం అవుతుంది. ఈ విధంగా  ప్రైవేట్‌గా సమాచారాన్ని పొందవచ్చు.

Tags

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×