Kohli – Axar: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా… నిన్న గ్రూప్ స్టేజిలో చివరి మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా 44 పరుగులతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. స్పిన్నర్లతో న్యూజిలాండ్ దెబ్బకొట్టిన టీమిండియా… చివరి మ్యాచ్ లో విజయం సాధించి.. పాయింట్లు పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఇక మొదటి సెమీ ఫైనల్ ఆస్ట్రేలియా తో టీమ్ ఇండియా తల పడబోతుంది. అయితే నిన్న దుబాయ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( New Zealand vs Team India) మధ్య మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే అక్షర్ పటేల్ ( Axar Patel ) మధ్య జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అక్షర పటేల్ కాళ్లు మొక్కడానికి విరాట్ కోహ్లీ ప్రయత్నించాడు. దాంతో వెంటనే విరాట్ కోహ్లీని ( Virat Kohli ) ఆపే ప్రయత్నం చేశాడు అక్షర పటేల్.
Also Read: Travis Head: సెమీస్ పోరు..ఇండియాను వణికిస్తున్న కుంభకర్ణుడు..గెలవడం కష్టమేనా?
అయితే దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. నిన్నటి న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( New Zealand vs Team India) మధ్య మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ( Kane Williamson)… చాలా ప్రమాదకరంగా బ్యాటింగ్ చేశాడు. 120 బంతుల్లో 81 పరుగులు చేసి రఫ్పాడించాడు కేన్ మామ. అయితే అతన్ని అవుట్ చేసేందుకు టీమిండియా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆలోపే టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రంగంలోకి దిగి… కేన్ మామ వికెట్ తీశాడు. కేన్ మామకు బంతి దొరకకుండా వేయడంతో.. స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ… ఫుల్ ఖుషి గా మారిపోయాడు. కేన్ మామ వికెట్ తీసిన అక్షర్ పటేల్ కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించాడు. ఇక ఈ సంఘటన చూసిన టీమిండియా క్రికెటర్లు కూడా… అక్కడే ఉండి ఈ పడి పడి నవ్వారు. అనుష్క శర్మ కూడా క్రేజీ రియాక్షన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే… 120 బంతుల్లో 81 పరుగులు చేసి రఫ్పాడిండిచిన కేన్ విలియమ్సన్ వికెట్ తీయకుంటేనే.. నిన్నటి మ్యాచ్ లో టీమిండియా పై న్యూజిలాండ్ గెలిచేది.
Also Read: Champions Trophy semis: టీమిండియాకు కొత్త టెన్షన్..ఆస్ట్రేలియాతోనే ఫైట్…సెమీస్ వేదికలు, టైమింగ్స్ ఇవే ?
ఇది ఇలా ఉండగా… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో భాగంగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పైన 44 పరుగులు తీడత గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి.. 249 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని.. చెందించే క్రమంలో.. 205 పరుగులకే కుప్ప కూలింది న్యూజిలాండ్. 45.3 ఓవర్లలో… ఆల్ అవుట్ అయిన న్యూజిలాండ్.. ఓడిపోయింది. ఇక మార్చి 4వ తేదీన టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీస్ జరుగనుంది. రెండో సెమీస్ సౌతాఫ్రికా వర్సెస్ కివీస్ జట్ల మధ్య ఉంటుంది.
When Kohli Recognise Axar Patel Is More Supreme Then Bappu 😭🤣#INDvsNZ pic.twitter.com/uFZdGlQBtx
— Prof cheems ॐ (@Prof_Cheems) March 3, 2025