Big Stories

Palasa Constituency: సీదిరికి సినిగిపోద్దా? సిత్తరాల సిరపడా!?

Who will win Palasa Constituency – Seediri Appalaraju Vs Gouthu Sireesha: శ్రీకాకుళం జిల్లా లో ఉన్న నియోజకవర్గాల్లో పలాసపైనే అందరి దృష్టి ఉంది. గత ఐదేళ్లుగా ఈ నియోజకవర్గంలో రాజకీయం గరం గరంగానే ఉంది. నిత్యం విమర్శలు ప్రతి విమర్శలతో అక్కడ పొలిటికల్ డైలాగ్ వార్ నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చింది. ఓ వైపు మంత్రి సీదిరి అప్పలరాజు మరో వైపు టీడీపీ అభ్యర్ధిని గౌతు శిరీషాకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో ఈ సారి ఎన్నికలలో గత సారి కంటే పోలింగ్ శాతం పెరగడంతో పలాస ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది ఆసక్తి రేపుతుంది.

- Advertisement -

పలాస నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది సర్ధార్ గౌతు లచ్చన్న  ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో సోంపేట..శ్రీకాకుళం సిటీ నియోజకర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శివాజీ ఆయన సైతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా సోంపేట నియోజకవర్గం నుంచి 4 సార్లు.. పలాస నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఒక సారి టీడీపీ నుంచి పోటీచేసి గెలుపొంది మంత్రిగా పనిచేశారు.

- Advertisement -

గతంలో ఎప్పుడూ పలాస నియోజకవర్గంలో రాజకీయ విమర్శలు ఒక స్థాయి దాటలేదు. 2019 తరువాత పలాసలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. విమర్శలు .. ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. 2019 ఎన్నికలో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విమర్శల దాడి పెరిగింది. సిద్ధాంత పరమైన విమర్శల కంటే..వ్యక్తిగత విమర్శలకు వైసీపీ నాయకులు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. అదే ఒరవడిని పలాస నియోజకవర్గ వైసీపీ నాయకుడు సీదిరి అప్పలరాజు వంటపట్టించుకున్నారనే విమర్శ కూడా ఉంది. 2019 ఎన్నికలో మొదటిసారిగా సీదిరి అప్పలరాజు పలాస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.

Also Read: రజినీకి రంగుపడుద్దా?

టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీషపై సుమారు 15 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచే పలాస లో రాజకీయ వేడి మొదలైంది. మొదటిసారి గెలిచిన సీదిరి అప్పలరాజుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి సైతం కట్టబెట్టారు. అసలు గెలిచిన నాటి నుంచే అప్పలరాజు పలాస లో ప్రతీకార రాజకీయాలు మొదలు పెట్టరాన్న విమర్శలున్నాయి. పలాస నగరం నడిబొడ్డున ఉన్న స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగించడానికి ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది.

ప్రభుత్వ స్థలం అక్రమించి గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేశారన్న నేపంతో అధికారుల సాయంతో అప్పలరాజు గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగించేగించేందుకు ప్రయత్నించారు.అయితే గౌతు లచ్చన విగ్రహం ఉన్న స్థలం యాజమాని అది తన సొంత స్థలం అని తన వద్ద ఉన్న పత్రాలు చూపించడంతో మునిసిపాలిటీ అధికారులు వెనుదిరిగారు. కేవలం గౌతు శిరీషా పై అక్కసు తోనే సీదిరి అప్పలరాజు సమరయోధుడ్ని అవమానించడానికి తెగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

మరో వైపు పలాస శ్రీనగర్ కాలనీలోని కోడేలు చెరువు ప్రాంతాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేశారనే నెపంతో శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలని మునిసిపాలిటీ అధికారులు తొలగించడానికి ప్రయత్నించంతో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. నిర్మాణాల కూల్చివేతని నిరసిస్తూ.. లోకేష్ పలాస వస్తుండగా ఆయన్ని అరెస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ఆ క్రమంలో మంత్రి అప్పలరాజు గౌతు శిరీషని, టీడీపీ కేడర్ని ఇబ్బంది పెట్టడానికి కంకణం కట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. తాజా ఎన్నికల్లో ఆ ప్రభావం అప్పలరాజుకు వ్యతిరేకంగా రిఫ్లెక్ట్ అయిందన్న వాదన వినిపిస్తుంది.

ఇదంతా ఒక ఎత్తయితే.. మంత్రి సిదిరి అప్లలరాజు పలాస లో అనేక ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మంత్రి అయిన తరువాత భూముల ఆక్రమణలతో పాటు సూది కొండ, నెమలి కొండలను కూడా నిబంధనలకి విరుద్ధంగా తవ్వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. మంత్రి అప్పలరాజుపై గౌతు శిరీష నిత్యం విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు చేసిన అభివృద్ధి ఏమిలేదని టార్గెట్ చేస్తూ వచ్చారు. మంత్రి భూ ఆక్రమణలు గ్రావెల్ కోసం కొండల అక్రమ తవ్వకాలపై శిరీషా ఆందోళనలు నిర్వహించారు. నామినేషన్ టైంలోనూ ప్రశాంత పలాస కోసం క‌ృషి చేస్తానని ప్రకటించారు

ఆ క్రమంలో పలాస నియోజకవర్గం లో అటు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఇటుగౌతు శిరీషా ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. గౌతు శిరీషా తనపై చేస్తున్న ఆరోపణలు.. విమర్శలు తట్టుకోలేక మంత్రి అప్పలరాజు ఆమెని వ్యక్తిగతంగా ఇబ్బoది పెట్టేందుకు.. పలాసలో గౌతు శిరీషా కొత్తగా సొంత ఇంటి నిర్మాణానికి ప్రయత్నిస్తే దానికి కూడా మంత్రి అప్పల రాజు అనేక అడ్డంకులు సృష్టించారు. ఏదేమైనా ప్రశాంతంగా ఉండే పలాసలో ఈ సారి ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది.

సిదిరి అప్పల రాజు రాజకీయాలకు రాకముందు కార్డియాలజీ డాక్టర్‌గా మంచి పేరు ఉండేది. ఆర్థికంగా ఇబ్బందిపడే రోగుల ఫీజు మందుల విషయం లో సహాయం చేసేవారనే గుర్తింపు ఉండేది. అలాంటి డాక్టర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తనలోని మరోకోణం చూపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలకు తోడు తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన దువ్వాడ శ్రీకాంత్, హేమబాబుచౌదరి లను పక్కన పెట్టడం కూడా ఈ సారి ఎన్నికలో అప్పల రాజుకి నెగిటివ్ అవుతుందని రాజకీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అప్పలరాజుకి టికెట్ దక్కేలా చేయడంలో దువ్వాడ శ్రీకాంత్, వివేకానంద విద్యాసంస్థ అధినేత మెట్ట కుమారస్వామి కీరోల్ పోషించారు .. అయితే అప్పల రాజు మంత్రి అయిన తరువాత దువ్వాడ శ్రీకాంత్‌ని పక్కనపెట్టేశారు. స్థానికంగా బలమైన అనుచరవర్గం ఉన్న దువ్వాడ శ్రీకాంత్ పలాసకు చంద్రబాబు వచ్చినప్పుడు అనుచరవర్గంతో పసుపు కండువా కప్పుకున్నారు.

Also Read: బాలయ్య హ్యాట్రిక్ కొడితే! ఎట్టా ఉంటాదో తెలుసా?

దువ్వాడ శ్రీకాంత్ ఎఫెక్ట్‌తో అప్పలరాజుకి పలాసలో పెద్ద దెబ్బే పడుందంటున్నారు .. ఎన్నికల ముందు వరకు అప్పలరాజు విజయావకాశాలపై పాజిటివ్ టాక్ వినిపించింది.. అయితే దువ్వాడ శ్రీకాంత్, హేమబాబుచౌదరిలు టీడీపీలో జాయిన్ అయి గౌతు శిరీషకు మద్దతు ప్రచారం చేయడంతో.. ఇప్పుడు సొంత పార్టీ వారే మంత్రి గెలుపుపై పెదవి విరుస్తున్నారు.. గత ఎన్నికల్లో అప్పలరాజు సుమారు 16 వేల మెజార్టీతో గెలిచారు .. 72.9 శాతం పోలింగ్ జరిగిన2019 ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఓట్ల చీలిక అప్పలరాజుకుకి ప్లస్ అయింది. అయితే ఈ సారి కూటమి అభ్యర్థిగా గౌతు శిరీష తిరిగి పోటీ చేయడం కలిసి వస్తుందంటున్నారు

ఈసారి అక్కడ 76.42 శాతం పోలింగ్ నమోదు అయింది. సుమారు 3.07 శాతం అధికంగా ఓటర్లు తమ ఓటును వినియోగించు కున్నారు. అదంతా ప్రభుత్వ వ్యతిరేకతేనని దానికి తోడు మంత్రి అప్పలరాజు వైఖరితో నియోజకవర్గ వాసులు విసిగిపోయి ఉన్నారని ఈ సారి తమ విజయం ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అదీకాక ఈ సారి మంత్రి సిదిరి అప్పలరాజుకి అత్యంత సన్నిహితంగా ఉన్న వారే ఆయన్ని డబ్బుల పంపకంలో బోల్తా కొట్టించారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి సీదిరి అప్పలరాజు కి అత్యంత నమ్మకంగా ఉన్న నలుగురి ప్రధాన వ్యక్తులే ఆ డబ్బులు పంచకుండా నొక్కేశారని వైసీపీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఈ సారి పలాస ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News