Teen Father arrested in Pune Porsche Car Accident Case: మహారాష్ట్రలోని పుణెలో మైనర్ బాలుడు.. పోర్షే కారును నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యాడు. ఈ కేసులో బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరచగా.. 15 గంటల్లోనే బెయిల్ ఇచ్చింది కోర్టు. బాధిత కుటుంబాలు నిందితుడిని శిక్షించాలని నిరసన చేయడంతో.. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నమోదైన కేసులో బాలుడి తండ్రి, బిల్డర్ అయిన విశాల్ అగర్వాల్ ను ఔరంగాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం తెల్లవారుజామున కొరెగావ్ పార్క్ లో 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారును అతివేగంగా నడిపి ఒక బైక్ ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ప్రమాదం తర్వాతవిశాల్ అగర్వాల్ పరారయ్యాడు. ప్రమాదం చేసిన బాలుడిని అరెస్ట్ చేయగా.. కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. కానీ.. రోడ్డుప్రమాదాలపై ఒక వ్యాసం రాయాలని పనిష్మెంట్ ఇచ్చింది. రోడ్డుప్రమాదాల ప్రభావాలు, వాటి పరిష్కారాలపై 300 పదాలపై వ్యాపాన్ని రాయడంతో పాటు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని, సైకాలజిస్ట్ ను సంప్రదించాలని షరతులు విధించింది.
మైనర్ కు కారు ఇవ్వడం సరికాదని, బెయిల్ ను రద్దు చేసి నిందితుడిని శిక్షించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. వారికి అండగా.. అనేక మంది మద్దతు ఇవ్వడంతో పోలీసులు విశాల్ అగర్వాల్ ను మంగళవారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో అరెస్ట్ చేశారు.
Also Read: భార్యపై అనుమానం.. ప్రైవేట్ పార్టులో బ్లేడుతో కోసి.. మేకులు గుచ్చి.. పైశాచికత్వం!
ప్రమాద సమయంలో మైనర్ కారును 200 కిలోమీటర్ల వేగంతో నడిపినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిర్థారించారు. ఇటీవలే క్లాస్ 12 ఫలితాలు రాగా.. తన స్నేహితులతో కలిసి ఓ పబ్ లో పార్టీ చేసుకున్నాడని, ఆ మత్తులోనే ప్రమాదం జరిగిందని పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ వెల్లడించారు. మహారాష్ట్రలో 25 ఏళ్లు నిండకుండా మద్యం తాగడం నిషేధం. చట్టవ్యతిరేకంగా మైనర్లకు మద్యం అమ్మిన బార్ యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.