Big Stories

Pune Accident Latest Updates: ఒక యాక్సిడెంట్.. రెండు ప్రాణాలు.. అనేక ప్రశ్నలు

- Advertisement -

బడాబాబుల బిడ్డలు.. తల్లిదండ్రుల సంపాదించిన కోట్ల రూపాయలతో ఏమైనా చేయవచ్చనుకుంటారు. దైవాంశ సంభూతలమనుకుంటారు.. కారణ జన్ముల్లా ఫీలయ్యి.. ఇలా ప్రాణాలు తీస్తుంటారు. యస్.. పూణేలో జరిగింది ఇదే.. ఓ పాష్‌ లోకాలిటి నుంచి బయలు దేరిన ఓ పోర్షే కారు.. ఓ బార్ ముందు ఆగింది. ఆ కారును గాల్లో నడుపుకుంటూ వచ్చిన ఇద్దరు మైనర్లు అందులో నుంచి దిగారు. బార్‌లోకి వెళ్లారు.. ఫ్రెండ్స్‌తో కలిసి పీకలదాక తాగారు. అసలే హైఎండ్ కారు.. లోపల అప్పటికే నెత్తికెక్కిన ఆల్కహాల్.. ఇంకా ఆగుతారా.. రోడ్డు తప్ప.. రోడ్డుపై ఉన్న వాళ్లు కనిపించలేదు. రేస్ స్టార్ట్ చేశారు.. అడ్డొచ్చిన వాళ్లను గుద్దేశారు. అది కూడా ఏ రేంజ్‌లో అంటే.. ఆ యాక్సిడేంట్ జరిగే సమయానికి కారు స్పీడ్ 150 ప్లస్ ఉంది. ఈ దారుణానికి బలైంది.. అశ్వినీ అండ్ అనీష్‌.. వారిద్దరు స్పాట్‌లోనే చనిపోయారు.. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఎలా ఉందో.

- Advertisement -

ఈ దారుణమంతా ఒకవైపు అయితే.. ఈ దారుణం తర్వాత జరిగిన పరిణామాలు మరోవైపు.. స్థానికులు ఆ ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించారు. పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు. పోర్షే కారును చూడగానే రిచ్ కిడ్స్‌ అని అర్థమైనట్టు ఉంది. చాలా స్మూత్‌గా డీల్ చేశారు. మైనర్లు కదా.. వెంటనే జువైనల్‌ కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టు ఇచ్చిన తీర్పే ఇప్పుడు నేషనల్‌ వైడ్‌గా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ప్రమాదం జరిగిన 14 గంటల్లో వారికి బెయిల్ వచ్చేసింది. బెయిల్‌కి పెట్టిన కండిషన్స్ అయితే మరో హైలేట్.. 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పని చేయాలి. తను చేసిన ప్రమాదంపై ఒక వ్యాసం.. అదే ఒక ESSAY రాయాలి. మద్యపానం అలవాటు నుంచి బయటపడేలా కౌన్సెలింగ్ తీసుకోవాలి. భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలి.

Also Read: ఎన్నికల వేళ బ్రిజ్‌ భూషణ్‌‌కు భారీ షాక్ !

అక్కడ జరిగిన దారుణమేంటి? కోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైనే డిస్కషన్ జరుగుతోంది. వీరి నిర్లక్ష్యం.. బరితెగింపు.. ఇద్దరి ప్రాణాలను తీసింది. కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు మాత్రం చాలా కామెడీగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఇద్దరి ప్రాణాలు తీసిన వారికి వేయాల్సిన శిక్ష ఇదా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. విన్నారుగా పుణే సీపీ ఏం చెబుతున్నారో.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇద్దరి ప్రాణాలు తీసిన యువకుడిని.. మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరారు. బట్ కోర్టు పట్టించుకోలేదు. బెయిల్ ఇవ్వకుండా.. 14 రోజుల పాటు రిమాండ్‌ను విధించాలని రిక్వెస్ట్ చేశారు. బట్ కోర్టు పట్టించుకోలేదు. బెయిల్‌ ఇవ్వకుండ ఉండేందుకు బలమైన కారణాలు లేవని చెప్పింది. బెయిల్ ఇచ్చింది.. వారిని వదిలేసింది.

అయితే ఇలా ఎందుకు జరిగింది? ఇంత త్వరగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి ఆన్సర్‌గా అనేక ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ దారుణానికి కారణమైన మైనర్ తండ్రి పేరు బయటికి వచ్చింది. విశాల్ అగర్వాల్.. ఆ మైనర్ తండ్రి పేరు ఇది. పేరు మోసిన బిల్డర్.. ఎవరి పార్టీ అధికారంలో ఉన్నా.. వారితో గుడ్ రిలేషన్స్‌ మెయింటేన్‌ చేస్తుంటాడు. ఇప్పుడీ రిలేషన్స్‌తోనే కొడుకును విడిపించుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. విపక్షాలు కూడా ఈ యాక్సిడెంట్‌ను రాజకీయం చేశాయి. నిందితులకు పోలీస్ స్టేషన్‌లో పిజ్జాలు ఇచ్చారంటూ వివాదంలో పెట్రోల్ పోసేందుకు చూస్తున్నారు. విషయం పెద్దగా అవ్వడంతో పోలీస్‌ బాస్‌లు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. విశాల్ అగర్వాల్‌పై కేసు నమోదైంది. జువైనల్ జస్టిస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మైనర్లకు ఆల్కహాల్ సర్వ్ చేసిన రెండు బార్లలోని ఓనర్లు, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. వీరందరిని అరెస్ట్ చేశారు.

ఈ పరిణామాలన్ని బాధితుల తరపు వారిలో కడుపు మండేలా చేశాయి. రెండు ప్రాణాలను తీసిన వారితో గంటల వ్యవధిలో బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే బెయిల్ రద్దు చేసి నిందితుడికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. అసలు జువైనల్ చట్టాలను మార్చాల్సిన టైమ్ వచ్చిందన్న డిమాండ్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. లేదంటే చేయాల్సిన దారుణాలు, ఘోరాలు చేస్తూ.. ఇలా చట్టాలను అడ్డంగా పెట్టుకొని తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో చూద్దాం..రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మైనర్లంతా బార్‌కు వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల వరకు వారంతా అదే బార్‌లో ఉన్నారు. ఆ తర్వాత మరో బార్‌కు వెళ్లారు.. అక్కడ ఒంటిగంట వరకు ఉన్నారు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక రోడ్లపై పడ్డారు. యాక్సిడెంట్ జరిగిన టైమ్ వచ్చేసి తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలు. ఇక్కడ అనేక తప్పులు జరిగాయి.. ఇందులో ఏ ఒక్క చోట ఎవరైనా ఆపినా ఈ దారుణం జరగకుండా ఆగేది.

Also Read: ఏపీలో మాదిరిగా ఆ రాష్ట్రంలో కూడా చెలరేగిన హింసాత్మక ఘటనలు.. జెర్రైతే సినీ నటుడికి..

ఒక్కసారి ఇలా జరిగి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించండి.. ఇంట్లో నుంచి కారు బయటికి తీసే సమయంలో ఇంట్లో వాళ్లు వద్దని ఉంటే.. వాళ్లు వేరే విధంగా బార్‌కు వచ్చేవారు. పోనీ బార్‌కు వచ్చిన తర్వాతైన అక్కడి సిబ్బంది వారికి ఎంట్రీకి పర్మిషన్‌ ఇవ్వకపోతే.. వారు తాగకుండా బయటికి వచ్చేవారు.. క్షేమంగా ఇంటికి వెళ్లేవారు.. కానీ అలా జరగలేదు. పోనీ రోడ్లపై ఎక్కడైనా డ్రంక్‌ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించే పోలీసులు ఉన్నా కూడా.. అరెస్ట్‌లు చేయకపోయినా.. కనీసం వారిని వేరే వెహికల్స్‌లో ఇంటికి పంపేవారు.

ఇందులో ఏ ఒక్కటీ జరగలేదు.. అందుకే రెండు ప్రాణాలు పోయాయి. పుణే యాక్సిడెంట్ ఘటన అనేక ప్రశ్నలనైతే తెరపైకి తీసుకొచ్చింది. పిల్లలపై తల్లిదండ్రులకు ఉండాల్సిన శ్రద్ధని.. పోలీస్, ఇతర ప్రభుత్వాధికారుల్లో ఉన్న అవినీతిని అధికారుల విధుల్లో రాజకీయ నేతల జోక్యాన్ని.. బార్‌ అండ్ రెస్టారెంట్ల ధన దాహాన్ని.. పోలీసుల నిర్లక్ష్యాన్ని.. చట్టాల్లో ఉన్న లోపాలని.. మరి ఈ ఘటన తర్వాత అయినా అన్ని వ్యవస్థలు అలర్ట్ అవుతాయని.. సరైన చర్యలు తీసుకుంటాయని ఆశిద్ధాం.
పోయిన ప్రాణాలనైతే తీసుకురాలేం.. కానీ మార్పును తీసుకురావచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News