BigTV English

Jagannath a Devotee of Modi Row: చిక్కుల్లో బీజేపీ.. పూరీ జగన్నాథుడు కూడా మోదీ భక్తుడు అంటూ..

Jagannath a Devotee of Modi Row: చిక్కుల్లో బీజేపీ.. పూరీ జగన్నాథుడు కూడా మోదీ భక్తుడు అంటూ..

Jagannath a devotee of Modi Row Said By BJP Leader Sambit Patra: అసలే ఎన్నికల వేడి, ఏ పార్టీ నేత నోరు జారినా దాని డ్యామేజ్ ఊహించలేము. అందుకే నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని అంటుంటారు. అంతేకాదు పార్టీలోని ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే మాట్లాడుతారు. స్వామి భక్తి మరీ ఎక్కువైతే వాటి వల్లే జరిగే అనర్ధాలను ఊహించలేము.


దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఐదు దశలు ముగిశాయి. కేవలం రెండు దశలు మాత్రమే మిగిలివున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే ఒడిషాలోనూ శాసనసభకు లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిషాలోని బీజేపీ సీనియర్ నేత సంబిత్‌పాత్ర. ప్రత్యర్థులపై దాడి చేయడంలో ఆయన ముందుంటారు. అంతేకాదు ఆయన ఇరుకున సందర్భాలు లేకపోలేదు.

ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలోభాగంగా సోమవారం పూరి జగన్నాథుడ్ని దర్శించుకున్నారు. పూరి జగన్నాథుడి రథయాత్ర కంటే మోదీ సభకు జనం అధికంగా తరలివచ్చారన్నది కమలనాథుల మాట. ఇంతవరకు బాగానే ఉంది. తాజాగా పూరీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు బీజేపీ నేత సంబిత్‌పాత్ర. మోదీపై తనకున్న భక్తుని చాటుకుని అడ్డంగా దొరికిపోయారు. అంతేకాదు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.


Also Read: తమిళనాడులో దారుణం.. ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడిని వేటకొడవళ్లతో నరికి..

సోమవారం మోదీని చూసేందుకు లక్షలాది మంది భక్తులు పూరీకి వచ్చారన్నారు సంబిత్‌పాత్ర. అంతేకాదు జగన్నాథుడు కూడా మోదీ భక్తుడేనని కొనియాడారు. మనమంతా మోదీ భక్తులమేనని మనసులోని మాట బయటపెట్టారు. ఈ వ్యవహారంపై సీఎం నవీన్ పట్నాయిక్ సీరియస్ అయ్యారు. ఒడిషా ఆత్మాభిమానానికి మహాప్రభు పూరీ జగన్నాథుడని, కానీ ఓ వ్యక్తి మాత్రం ఆయన్ని భక్తుడిగా వ్యాఖ్యానించడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read:  రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు, బీజేపీ ఉన్నంత కాలం..

మహాప్రభును రాజకీయాల్లోకి లాగవద్దని బీజేపీ నేతలకు హితవు పలికారు సీఎం నవీన్ పట్నాయక్. ఒడిషా ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని, ప్రజల మనసులో గుర్తు ఉండిపోతుందన్నారు. తన తప్పు తెలుసుకున్న సంబిత్‌పాత్ర క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పొరపాటున నోరు జారారని, దయచేసి చిన్ని విషయాన్ని పెద్దది చేయవద్దని సీఎంకు రిక్వెస్ట్ చేశారు. ప్రత్యర్థులను ఇరుకుపెట్టబోయి అడ్డంగా సంబిత్ ఇరుక్కుపోయారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×