Forest Controversy: తమది పనిచేసే ప్రభుత్వం అని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం నిరంతరం చెబుతుంటారు. అయితే వారికి భిన్నంగా అదికార యంత్రాగం వ్యవహారిస్తోంది..డిప్యూటీ సీఎం నియంత్రణలో ఉన్న అటవీ శాఖ తమకు ప్రభుత్వం పనితనంతో పని లేదనే రీతిలో వ్యవహారిస్తూ వివాదాస్పద నిర్ణయాలకు పెద్ద పీటు వేస్తూ నిరంతరం విమర్శల పాలువుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిన్న క్యాపిటేరియా..నేడు నగర వనంలో వాకర్స్ నుంచి పీజు వసూలు చేయాలనే నిర్ణయంతో చివరకు వాకర్స్ అందోళనలకు దిగాల్సి వచ్చింది .. దాంతో అసలు అటవీ శాఖపై ప్రభుత్వానికి పట్టు ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతన్నాయి.
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న అటవీశాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రమే అనేక వివాదాస్పద నిర్ణయాలతో ప్రభుత్వ ఆదర్శాలకు తూట్లు పొడుస్తోంది..అక్కడున్న అధికారులు తాము ప్రజలకు జవాబుదారి కాదనుకుంటున్నారనే చర్చ నడుస్తోంంట. దీంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. రెండు సంవత్సరాలుగా అనేక వివాదాలలో అటవీ అధికారులు కొట్టు మిట్టాడుతున్నారు..
తాజాగా తిరుమల నగర వనంలో వాకర్స్ నుంచి నెలకు ఒక్కరికి వంద రూపాయలు చొప్పున రుసుము చెల్లించాలంటూ నగర వనం గేట్లు మూసి వేయించారు పారెస్ట్ శాఖ అధికారులు. నగర వనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చి వాటిని ఏర్పాటు చేయించింది. వీటిపై రాష్టంలో ఇంతవరకు అడిటింగ్ జరగలేదనేది జగమెరిగిన సత్యం. నగర పాలక సంస్థ పార్కులతో పాటు అనేక చోట్ల ఉదయం 6 నుంచి 9గంటల వరకు వాకర్స్ కు ఉచితంగా ప్రవేశం ఉంటుంది. నిన్నటి వరకు నగర వనంలో సైతం ఇలాగే ఉండేది..అయితే ఉన్నట్లుండి తిరుపతి నగర వనంలోకి అనుమతించకుండా తాళాలు వేసి వంద రూపాయల రుసుము చెల్లించాలంటు హాడావుడి చేస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. స్థానిక జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు సైతం ఈ విషయం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాని పలితం శూన్యం ..కనీసం అయన మాటను అటవీ అధికారులు పరిగణలోకి తీసుకోలేదంట.
రుసుం వసూలు నిర్ణయానికి నిర్ణయానికి వ్యతిరేకంగా వాకర్స్ ఉదయం గంట పాటు అలిపిరి నుంచి కపిల తీర్థం వచ్చే దారిలో రహాదారిని స్తంభింప చేశారు. దీంతో తిరుమలకు వెళ్ళే భక్తులు ,తిరుమలనుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయినప్పటికి అటవీ శాఖ అధికారులు అటు వైపు కూడా రాలేదు. చివరకు పోలీసులు అక్కడికి వచ్చి అక్కడున్న నగర వనం కాంట్రాక్టు సిబ్బందితో మాట్లాడి, రుసుంపై వాకర్స్ కు హామీ ఇచ్చి గేట్లు తెరింపించారు.అందోళన జరుగుతున్న రహదారి పక్కనే డిఎఫ్ ఓ తో పాటు సిసిఎప్ నివాసగృహాలు ఉంటాయి . అయిన వారు స్పందించలేదు. ఆ క్రమంలో ప్రభుత్వాన్ని , సీఎం, డిప్యూటీ సీఎంలను వాకర్స్ తిట్టిపోసారు..అయితే మనకేం అన్నట్లు పారెస్ట్ అధికారులు ఉండిపోయారు..
నిర్లక్ష్యం,లెక్కలేని తనంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటవీ శాఖ వ్యవహారిస్తుందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్ర స్థాయి సిబ్బందిని మార్చక పోవడమే ఇందుకు కారణం అంటున్నారు. తిరుమలలోని పాప వినాశంతో పాటు అలిపిరి నడక దారిలో పారెస్ట్ శాఖకు దుకాణాలు ఉన్నాయి. పాపవివానశం ప్రాంతంలో అయితే అన్యమతస్తులు దుకాణాలు పెట్టుకోని చివరకు అన్యమత ప్రార్థనలు వీడియోలు తీసి సోషియల్ మీడియాలో పోస్టు చేసినా అటవీశాఖ అధికారులు స్పందించలేదు.. చివరకు హిందు సంఘాల అందోళనతో టిటిడి ఉన్నతాధికారులు సీరియస్ కావడంలో వాటిని తీసి వేశారు.
అదే సమయంలో అక్కడున్న దుకాణ దారుడు ఏకంగా పాపా వినాశం లోని అమ్మవారి ఆలయానికి సంబంధించిన బొర్డును తొలగించారు..దీంతో అతని దుకాణం తీసి వేయాలని టీటీడీ నిర్ణయిస్తే అతనికి పారెస్ట్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చిందట. అదే విదంగా ప్రతి దుకాణ దారుడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో పారెస్ట్ సిబ్బంది వసూల్లు చేస్తున్నారని ఏకంగా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టి కొంతమంది దుకాణ దారులు అగ్రహం వ్యక్తం చేసారు..
తిరుపతి నగర వనంలో క్యాపటేరియా నిర్మాణం కొరకు అమూల్యమైన చెట్ల ను నరికి వేశారంటు తిరుపతి వాసులు అందోళన చేసారు. ఈ విషయం మీద రాష్ట స్థాయి అధికారులు వచ్చి విచారణ జరిపారు. అయితే వారు ఏం చర్యలు తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి..కాని పారెస్ట్ శాఖ మాత్రం అందోళన వెనుక ఉన్న టెక్కర్స్ పై వివిధ రకాలుగా కేసులు నమోదు చేసి వేధిస్తోందంట. ఈ విదంగా ప్రజలలో పారెస్ట్ శాఖ ప్రభుత్వ స్థాయిని దిగజార్చే విదంగా వ్యవహారిస్తుందనే అరోపణలు ఉన్నాయి.
మరో వైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పారెస్ట్ అధికారుల తీరుతో గ్రామీణ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఏనుగులు, వన్య ప్రాణులు నిరంతరం పంట పోలాలపై దాడులు చేస్తున్నాయి. రైతులను చంపివేస్తున్నాయి.గత ఏడాది పది మంది కి పైగా మరణించారు.వీరిలో సియం స్వంత పంచాయితీ నారా వారి పల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి కూడా ఉన్నారు. పలమనేరు,చిత్తూరులలో అయితే నగరాలలోకి కూడా ఏనుగులు వస్తున్నాయి. వీటి ని అడువుల్లోకి తరలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికి పలితం శూన్యం. కుంకీ ఏనుగులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో పారెస్ట్ శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వన్యప్రాణులు అనవసరంగా దాడులు చేయవని చెప్తుండటం గమనార్హం.
మొత్తం మీదా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడమే లక్ష్యంగా అటవీశాఖలోని కొంతమంది సిబ్బంది పనిచేస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా డిప్యూటీ సియం ఉమ్మడి చిత్తూరు జిల్లా అటవీ శాఖ పై సమీక్ష చేయాలంటున్నారు జనసైనికులు.
Story by: Apparao, Big Tv