BigTV English

CID Takes TDP Attack Case: సిఐడీ చేతికి టీడీపీ ఆఫీసుపై దాడుల కేసులు.. విచారణ వేగవంతం

CID Takes TDP Attack Case: సిఐడీ చేతికి టీడీపీ ఆఫీసుపై దాడుల కేసులు.. విచారణ వేగవంతం

CID Takes TDP Attack Case| వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన కేసులపై కూటమి సర్కారు సీరియస్‌గా దృష్టి సారిస్తుంది .. వైసీపీ హయాంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరుగుతోంది … తాజాగా వీటిని సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ ఫైళ్లను మంగళగిరి డీఎస్పీ సీఐడీకి అందజేయనున్నారు… పోలీసుల విచారణకు కీలక నిందితులు సహకరించడం లేదని, అందుకు విచారణ ఆలస్యమవుతుందన్న కారణంతోనే కేసులు సీఐబీకి బదిలీ అయినట్లు తెలుస్తుంది.


తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది… ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి మంగళగిరి, తాడేపల్లి పీఎస్‌ల పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. సివిల్ పోలీసుల ద్వారా విచారణ ఆలస్యం అవుతుందనే భావనతో విచారణను వేగవంతం చేసేందుకు సీఐడీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందంటున్నారు.

Also Read: టీడీపీలో చేరిన మోపిదేవి.. వాన్‌పిక్ కేసుల భయంలో జగన్!


టీడీపీ కేంద్రకార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. మరికొందరు నేతలను కూడా విచారణ చేయనున్నారు… అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు విచారణకు పలుమార్లు పిలిచారు. ఆయన సహకరించలేదు. దీంతో ఈ కేసులను సివిల్ పోలీసుల కంటే సీఐడీకి అప్పగిస్తే త్వరగా విచారణ జరుగుతుందని భావించి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్‌ సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని అప్పట్లో వీరంతా ఇష్టానుసారంగా రెచ్చిపోయారు … టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటమే కాకుండా ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందస్తు బెయిల్ కోసం వీరంతా హైకోర్టును ఆశ్రయించారు.

సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణకు సహకరించాలని జోగి రమేశ్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని సుప్రీం స్పష్టం చేసింది. అలాగే పాస్‌పోర్టు సరెండర్ చేయాలని, దర్యాప్తునకు సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది … దర్యాప్తునకు సహకరించపోతే రక్షణ ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయినా పోలీసుల విచారణకు జోగి రమేశ్ సహకరించలేదు… మరిప్పుడు సీఐడీ దగ్గర వారి పప్పులు ఎలా ఉడుకుతాయో చూడాలి.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×