E-Paper
Advertisement

Bigg Boss 8 Day 43 Promo 1: గౌతమ్ ఇక మారవా.. యాంగ్రీ మెన్ గా మారిన కూల్ పర్సన్..!

Bigg Boss 8 Day 43 Promo 1: గౌతమ్ ఇక మారవా.. యాంగ్రీ మెన్ గా మారిన కూల్ పర్సన్..!
Advertisement

Bigg Boss 8 Day 43 Promo 1..43వ రోజుకు సంబంధించిన తాజా ప్రోమో ను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఎప్పుడూ కామెడీ చేస్తూ కూల్ గా కనిపించే ముక్కు అవినాష్ ఫైర్ అవడం మనం చూడవచ్చు. ఈ ప్రోమో చూసిన తర్వాత నెటిజెన్స్ గౌతమ్ కృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..ఇక మారవా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

ఏడవ వారం నామినేషన్ రచ్చ మొదలు..

Advertisement

ప్రోమో విషయానికి వస్తే.. ఆరువారాలలో భాగంగా 7 మంది ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇక నిన్న ఆరవ వారం కిరాక్ సీత ఎలిమినేట్ అయ్యింది. ఇక అప్పుడే ఏడవ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలాగే నామినేషన్ రచ్చ మొదలైందని చెప్పవచ్చు. ఇక ప్రోమో విషయానికి వస్తే.. ప్రశాంతంగా సాగే ప్రయాణంలో.. ఇంటి సభ్యులందరిలో నుంచి ఎవరు నామినేట్ అవుతారనేది ఇద్దరు కిల్లర్ గర్ల్స్ అయిన హరితేజ , ప్రేరణ మీద ఆధారపడి ఉంటుంది అంటూ తెలిపారు బిగ్ బాస్. ప్రతిసారి గుర్రం సౌండ్ వినిపించినప్పుడు ఇద్దరు కిల్లర్ గర్ల్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి హ్యాట్ ని తీసుకోవాలి. ఇక అలా గుర్రం సౌండ్ వినగానే హ్యాట్ కోసం పోటీపడగా కిల్లర్ గర్ల్ ప్రేరణ హ్యాట్ అందుకుంటుంది.

మోకాళ్ళ మీద పడి వేడుకున్న ముక్కు అవినాష్..

Advertisement

ఇక నామినేషన్ లో భాగంగా రోహిణి గౌతమ్ ను నామినేట్ చేసింది. ఫన్ టాస్క్ చక్కగా ఫ్లోలో వెళ్తుంది అనుకున్నప్పుడు.. తన ఎమోషన్ హర్ట్ అయ్యింది. మైక్ మీద చూపించడం ఒక పాయింట్ అది నాకు నచ్చలేదు. అంటూ చెప్పగా.. దానికి గౌతమ్ మాట్లాడుతూ కామెడీ అయినా ఏదైనా నా విషయంలో పుల్లింగ్ కిందికి వస్తుంది నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది అంటూ గౌతమ్ తెలిపారు. పుల్లింగ్ అనడం అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్ దాని గురించి ఆవిడ ఆల్రెడీ చెప్పింది అంటూ నిఖిల్ మధ్యలో కలుగజేసుకోగా.. ఆగ్రహం వ్యక్తం చేసిన గౌతమ్ పుల్లింగ్ అంటే ఒక మనిషిని పదే పదే టార్గెట్ చేస్తూ వెనక్కి లాగడం. అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో అశ్వద్ధామ 2.0 అంటూ కామెడీ చేసిన ముక్కు అవినాష్ ఒక్కసారిగా ఫైర్ అవుతూ.. నాకు నిజంగా తెలియదు.. తెలియదు.. తెలియదు..తెలియదు..తెలియదు.. తెలియదు.. అంటూ అరుస్తూ కామెంట్ చేశాడు. మధ్యలో రోహిణి కలగజేసుకొని.. ఎవరికి తెలుసు నువ్వు హర్ట్ అవుతావు అని అది కామెడీగానే తీసుకున్నాం అంటూ తెలిపింది. తెలియదు కావాలని చేయలేదు అంటూ మోకాలు మీద పడి మరీ వేడుకున్నారు ముక్కు అవినాష్. ఈ సన్నివేశం కాస్త ముక్కు అవినాష్ పై అందరిలో జాలి కలిగించేలా చేసింది. ముఖ్యంగా గౌతమ్ కృష్ణ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడని, నాగార్జున హెచ్చరించినా కూడా మారడం లేదు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

 

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×