Big Stories

Janasena Rebels: పొత్తు చిత్తు.. సేనానిపై తిరుగుబాటు..

Janasena Rebels Protest: జనసేనాని సొంత సైన్యం తిరుగుబావుటా జెండా ఎగురవేసింది. కార్యకర్తలే నా బలం, వారే నా నమ్మకం అంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు వారి నుంచే నిరసన సెగ తగులుతోంది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్హు కోసం జగన్ పాలనకు ఫుల్‌స్టాప్ పెట్టడానికిపొత్తు అవసరం అని పవన్ చెప్తున్నా.. తమకు సీటే ముఖ్యమని కొంతమంది నేతలు రోడెక్కుతున్నారు. పొత్తుల ఎఫెక్ట్‌తో తమకు సీటు దక్కకపోవడంతో సీటు తెచ్చుకున్న వారిని ఓడిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. గాడి తప్పిన సైన్యం బెదిరింపులకు జనసేనాని తలొంచుతారా ? తిరుగుబాటు సైన్యాన్ని బుజ్జగిస్తారా ? ఎదురుతిరిగిన జనసైనికులతో కూటమికి నష్టం జరుగుతుందా?

- Advertisement -

ఏపీలో పొత్తు పెట్టిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. పొత్తులో సీట్లు రాని నేతలు కొంతమంది అసమ్మతి నేతలు నేరుగా అధికార పార్టీ కండువా కప్పుకుంటే మరికొంతమంది నేతలు స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తూ.. కూటమి నాయకులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. అయిదేళ్ల పాటు పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎదురుచూస్తుంటే పొత్తు లో తమ సీట్లు గల్లంతు అవడంతో ఏం చేయాలో అర్ధం కాక తిరుగుబాటుకు దిగుతున్నారు. మూడు పార్టీల్లోఈ పరిస్థితి కనిపిస్తుంది.

- Advertisement -

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభకు హాజరయిన జనసేనాని పవన్ కళ్యాణ్ , టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి నిరసనలతో స్వాగతం పలికారు జనసేన పార్టీ అసమ్మతి నేతలు. తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్ర సందర్భంగా.. అక్కడి జనసేన పార్టీ ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావుకి లాంటి నీతి నిజాయతీ గల నాయకులు అసెంబ్లీలో ఉండాలంటూ తణుకు జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్.

జనసేన నుంచి ప్రకటించిన మొట్టమొదటి సీటు తణుకుదే అంటూ విడివాడకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన టికెట్ ఆశావహులందరూ అభినందనలు తెలిపారు. ఇక అప్పటినుండి తణుకు నియోజకవర్గం లో విడివాడ రామచంద్ర రావు జనసేన అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. అయితే తర్వాత బీజేపీ పొత్తుకు సై అనడంతో ఈక్వేషన్లు మారిపోయాయి. తణుకు సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లడంతో జనసేనస్ నేత విడివాడ తిరుగుబాటు జెండా ఎగర వేశారు. తణుకు జనసైనికులు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముందు నిరసన తెలిపినా తెలిపిన ప్రయోజనం లేకకుండా పోయింది. దాంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే ఆలోచన చేస్తోంది విడివాడ వర్గం.

తణుకు ప్రజాగళం బహిరంగ సభా వేదిక వద్దే ఒక్కసారిగా విడివాడ అనుచరులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ మాట తప్పారని , గెలిచే సీటు ని త్యాగం చేశారని. అసలు దాన్ని త్యాగం అంటారా అంటూ ప్రశ్నించారు. ఒక దశలో అటు టీడీపీ ఇటు జనసేన అసమ్మతి నాయకులు దాడులు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. పోలీసులు రంగప్రవేశం చేసి అసమ్మతి నేతలను పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సర్దుమణిగింది. అయితే జనసేన అసమ్మతి నేతలు పవన్ కళ్యాణ్ సభను అడ్డుకొనే ప్రయత్నం చేయడంపై తణుకు జనసైనికులు ఫైర్ అవుతున్నారు. విడివాడ స్వయంగా కూటమి అభ్యర్ధి రాధాకృష్ణను ఓడిస్తా అని బహిరంగంగా ప్రకటించడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విడివాడ కు సీటు రానందుకు తమకు బాధగానే ఉన్నా.. కూటమి అగ్ర నాయకుల్ని తప్పు పట్టడం, కూటమి నేతల నిర్ణయానికి వ్యతిరేకం గా పని చేయడం సరికాదంటూ ఆయనకు దూరం జరుగుతున్నారు జనసైనికులు. పవన్ కళ్యాణ్ సైతం తన సొంత అన్న నాగబాబుకి సైతం పొత్తుల లెక్కలతో సీటు ఇప్పించుకోలేకపోయానని.. పొత్తు ధర్మం పాటించాలని ప్రాధేయపడ్డా విడివాడ వర్గం శాంతించడం లేదు. పొత్తు ధర్మాన్ని పాటించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు చంద్రబాబు విజ్ఞప్తి చేసిన సీటు రాని బాధ అసమ్మతి నేతల ను నిద్రపోనివ్వడం లేదు.

Also Read: YS Family War in Kadapa: కుటుంబం.. అన్నగారి కుటుంబం!

తణుకు నియోజకవర్గం లో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాధా కృష్ణ స్వల్ప ఓట్ల తేడా తో మంత్రి కారుమూరి పై ఓడిపోయారు. ఇప్పుడు పొత్తు లో మూడు పార్టీ ల బలంతో రాధాకృష్ణ విజయం నల్లేరు మీద నడకే అని కూటమి నాయకులు భావిస్తున్నారు. మరో పక్క టిడిపి లో సీటు రాని నాయకులకు చంద్రబాబు వ్యక్తిగతం గా పిలిపించి కౌన్సెలింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కనీసం తమ పార్టీలోని అసంతృప్తి నేతలతో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడమే వారిని ఎక్కువ బాధిస్తుందట.

సీటు ఎందుకు ఇవ్వలేకపోయానన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ అసమ్మతి నేతలకు వివరించి చెప్తే అన్ని సర్దుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికార పార్టీనిఓడించాలంటే ప్రతి ఓటు అవసరమే కాబట్టి అసమ్మతి నేతలను బుజ్జగించాలని జనసైనికులు తమ సేనానిని సూచిస్తున్నారు. మొదట్లో తమ స్థానిక నేత వడివాడకు అన్యాయం జరిగింది అంటూ పవన్‌కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఆగ్రహంతో రోడెక్కిన జనసైనికులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆశయం కోసం తిరిగి కూటమి అభ్యర్ధికి తణుకులో మద్దతు ప్రకటిస్తున్నారు. తమ సేనాని మాటే తమకు శిరోధార్యమంటూ తేల్చి చెప్తున్నారు. మరి వారు చేస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకుని విడివాడ వంటి నేతలను పవన్ లైన్లో పెడతారో? లేదో చూడాలి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News