BigTV English

Teja Sajja: సూపర్ యోధగా మారిన హనుమాన్..

Teja Sajja: సూపర్ యోధగా మారిన హనుమాన్..

Teja Sajja: నేనున్నా నాయనమ్మ అంటూ బాలనటుడిగా ఉన్నప్పుడే ఇండస్ట్రీని షేక్ చేసిన నటుడు తేజ సజ్జా. స్టార్ హీరోలందరి సినిమాల్లో బాలనటుడిగా నటించి మెప్పించిన తేజ.. ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత మంచి మంచి కథలను ఎంచుకొని సోలో హీరోగా కొనసాగుతున్న వేళ.. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. స్వయానా మెగాస్టార్ చిరంజీవినే తేజ నటనకు ఫిదా అయ్యినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఆ గుర్తింపును తన ఎదుగుదలకు వాడుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. పెద్ద పెద్ద బ్యానర్స్ లో తేజకు అవకాశాలు వస్తున్నాయి.


హనుమాన్ తరువాత ఈ కుర్ర హీరో మంచి ఛాన్స్ పట్టేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన తదుపరి సినిమాను తేజతో చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ఈగల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ యోధ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో మంచు మనోజ్ విలన్ గా నటిస్తుండగా.. దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం.

ఎప్పటి నుంచో ఈ సినిమా టైటిల్ మిరాయ్ అని ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా సరసన రితిక నాయక్ నటించనుంది. ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ను ఏప్రిల్ 18 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. హనుమాన్ తరువాత తేజ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో తేజ సజ్జా.. అదే సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.


Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×