Big Stories

MLC Kavitha’s Remand Report: తప్పుడు సమాధానాలతో కేసును తప్పుదోవ పట్టిస్తున్న కవిత.. సీబీఐ రిమాండ్ రిపోర్ట్

MLC Kavitha Remand Reports: ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను విచారించిన సీబీఐ కీలక విషయాలను వెల్లడించింది. సీబీఐ అధికారులు 11 పేజీలతో కవిత రిమాండ్ అప్లికేషన్ దాఖలు చేసి.. ఆమె కస్టడీని మరింత పొడిగించాలని కోరారు. కేసును తప్పుదోవ పట్టించేలా కవిత.. విచారణకు సహకరించడంలేదని అందులో పేర్కొన్నారు.

- Advertisement -

ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు మూడు రోజులు పాటు కస్టడీకి తీసుకుని పలు విషయాలపై ప్రశ్నలు సంధించారు. తాము అడిగిన ప్రశ్నలకు కవిత సరిగ్గా సమాధానం చెప్పకుండా.. కేసును తప్పుదోవ పట్టించేలా విచారణకు సహకరించడం లేదని సీబీఐ అధికారులు రిమాండ్ అప్లికేషన్ లో పేర్కొన్నారు.

- Advertisement -

శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంలో ఆమెను ప్రశ్నించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. శరత్ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, విజయ్ నాయర్ లో కవిత జరిపిన సమావేశాలపై పలు ప్రశ్నలు అడిగినట్లు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో వెల్లడించారు.

తాము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా కవిత సరైన సమాధనం ఇవ్వకుండా.. తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారని తెలిపారు. ఆమె భయటకు వస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసి.. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని సీబీఐ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Also Read: Kavitha judicial custody: కవిత కస్టడీ పొడిగింపు, అది బీజేపీ కస్టడీ అంటూ..!

లిక్కర్ కేసులో ఆమె పాత్రను మరింత లోతుగా తెలుసుకోవడానికి.. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని సీబీఐ కోర్టులో సమర్పించిన రిమాండ్ అప్లికేషన్ లో కోరింది. కాగా, ప్రత్యేక కోర్టు సీబీఐ అభ్యర్థన మేరకు.. కవితకు 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News