India vs Pakistan War Update: కునుకుతున్న నక్క మీద తాటిపండు పడుతున్నట్టుంది పాక్ పరిస్థితి. కుట్రలను తిప్పికొడుతూ పాక్‌ను భారత్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరోవైపు బెలూచిస్తాన్ రంగంలోకి దిగింది. భారత్, పాక్ ఉద్రిక్తతలను తమకు అనుకూలంగా మార్చుకుంటుంది బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ ఆర్మీపై BLA విరుచుకుపడింది. అంతేకాదు.. క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకుంది. పాక్ సైన్యాన్ని తరిమికొట్టి, క్వెట్టాను స్వాధీనం చేసుకున్నామని BLA ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆరు ప్రాంతాల్లో ఒకేసారి పేలుళ్లు జరిపిన BLA
క్వెట్టా నగరం జంగ్లే బాగ్‌లోని కాంబ్రానీ రోడ్డు దగ్గరున్న పాకిస్థాన్ దళాల కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్‌ను బలూచి యోధులు లక్ష్యంగా చేసుకున్నారు. సమీపంలోని ఆరు ప్రాంతాల్లో ఒకేసారి పేలుళ్లు జరిపింది BLA. లాంచర్‌ను ఉపయోగించి గ్రెనేడ్‌లను కూడా ప్రయోగించారు. పాక్‌లోని చమురు క్షేత్రాలపై బలూచీల దాడులు చేసింది. దీంతో పాక్ సైనికులు భారీగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ దాడుల తర్వాత పాకిస్థాన్ సైన్యం క్వెట్టా వదిలి పారిపోయింది.
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
భారత్, పాక్ ఉద్రిక్తతను బలూచిస్థాన్ అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ టైంలో స్వాతంత్య్ర పోరాటాన్ని ఉదృతం చేస్తే పాక్ సైన్యం తోక ముడుస్తుందని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ అంచనా. పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజలు పాక్ జెండా స్థానంలో బలూచిస్థాన్ జెండాలను ఎగురవేస్తున్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ కు మరో పెద్ద సమస్య
సొంత జాతీయ గీతాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు బెలూచ్ దళాలు. బెలుచిస్తాన్‌ను ప్రత్యేకదేశంగా ప్రపంచదేశాల నుంచి గుర్తింపునకు ప్రయత్నాలు కూడా మొదలెట్టినట్టు తెలుస్తోంది. ప్రపంచదేశాల్లో దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేసి అక్కడ సిబ్బంది నియమించాలని భావిస్తున్నారు. మొత్తానికి భారత్ లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ కు మరో పెద్ద సమస్య వచ్చి పడింది.
దాడులకు పాక్ పాలకులు సైతం ఉక్కిరిబిక్కిరి
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. టెర్రరిస్టులకు రక్షణ కల్పిస్తూ.. భారత్‌లో అశాంతిని రాజేస్తున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్తోంది భారత్. త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇవ్వడంతో.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బలగాలు కదనరంగంలోకి దూకాయి. సమన్వయంతో చేస్తున్న దాడులకు పాక్ పాలకులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏకంగా పాక్ ప్రధానమంత్రి నివాసం సమీపంలోనే ఎటాక్ జరగడంతో.. అతను సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు.
పాక్ దాడి చేసిన తర్వాతనే.. రైట్ టు రెస్పాన్స్
భారత్ వైపు చూడాలంటేనే.. భారత్ పేరు పలకాలంటేనే భయపడిపోయేలా పాకిస్తాన్‌పై ఎదురుదాడి చేసింది మనదేశం. అలాగని మనం గీసుకున్న లక్ష్మణ రేఖను దాటలేదు. తనకు తాను భారత్ ఏ దేశంపైనా దాడి చేయదు. ఇది మన విధానం. ఇప్పుడు కూడా అంతే. పాక్ దాడి చేసిన తర్వాతనే.. రైట్ టు రెస్పాన్స్ విధానంలో కౌంటర్ ఎటాక్‌కు దిగింది. ఆ ఎదురుదాడి ఎలా ఉంటుందో పాకిస్తాన్ పాలకులు, సైన్యం కనీసం ఊహించి ఉండరు.
ఇది యుద్ధం కాని యుద్ధం. వన్‌సైడ్ జరుగుతున్న వార్.
ఇది యుద్ధం కాని యుద్ధం. వన్‌సైడ్ జరుగుతున్న వార్. పాకిస్తాన్ ఎప్పట్లాగే దొంగదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించింది. ఆల్ ఆఫ్ సడెన్.. జమ్మూపై డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. పాపి ఎత్తుగడలను ఓ కంట కనిపెట్టిన భారత్ బలగాలు.. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. పాక్ ప్రయోగించిన ఏ ఒక్క ఆయుధం.. టార్గెట్‌ను చేరుకోకుండా గాల్లోనే నిర్వీర్యం చేసేశాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది పాకిస్తాన్. ఒకవైపు పాకిస్తాన్ ఎటాక్స్‌ను కాచుకుంటూనే.. మరోవైపు కౌంటర్ ఎటాక్స్ మొదలుపెట్టింది భారత్. ఈసారి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాక్ వినాశనానికి ఆ రకంగా నాంది పడినట్టయింది.
పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు దూసుకెళ్లిన భారత్ బలగాలు
నిన్న ఉదయమే లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలింది. భారత్ దాడిలో ధ్వంసమైంది. పాకిస్తాన్‌లోని, పాక్ ఆక్రమిత జమ్ముకాశ్మీర్‌లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయడానికి భారత్‌కు 25 నిమిషాలు పట్టింది. కానీ, లాహోర్ ఎయిర్ డిఫెన్స్‌ను ధ్వంసం చేయడానికి కేవలం రెండున్నర నిమిషాలే పట్టిందని చెప్తున్నారు. జమ్ముపై దొంగదాడికి ప్రయత్నించిన పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు దూసుకెళ్లిన భారత్ బలగాల ధాటికి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ పనికిరాకుండా పోయింది. బాంబుల వర్షానికి పాపి సైన్యం చెల్లాచెదురైంది.
దేవుడా కాపాడు.. భారత్ దాడులు చూసి వణుకుతున్న పాక్
దేవుడా కాపాడు.. భారత్ దాడుల నుంచి ఈరోజు గడిస్తే చాలు.. ఇదీ పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఎంపీల కన్నీటి గోడు. ఏకంగా ప్రధానమంత్రి సేఫ్ ప్లేస్‌లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్మీ కీలక అధికారులు ఎప్పుడో బంకర్లలోకి పారిపోయారు.