Bollywood Actress: ..సింగిల్ పేరెంట్ గా ఉండడం అంటే అది ఎంత కష్టమైనా పనో అనుభవించే వారికే తెలుస్తుంది. ముఖ్యంగా అమ్మ నాన్న కలిసి పిల్లల్ని పోషించడంలో, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో ఎంతో శ్రమిస్తారు. అలాంటిది పిల్లల బాధ్యతను ఒక్కరే తీసుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. అయితే సింగిల్ పేరెంట్ అయితేనేమి డోంట్ కేర్ అంటూ ఆదర్శంగా నిలిచిన మాతృమూర్తులు ఎంతోమంది ఉన్నారు. ప్రత్యేకించి మే 11న మదర్స్ డే సందర్భంగా.. ఈ రోజు.. భర్తలకు దూరమై ఒంటరిగా పిల్లల్ని పెంచుతున్న బాలీవుడ్ తల్లుల గురించి తెలుసుకుందాం.
కరిష్మా కపూర్:
కరిష్మా కపూర్ (Karishma Kapoor) ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 1990లోనే బాలీవుడ్ నాట అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా చలామణి అయింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే 2003లో వ్యాపారవేత్త అయిన సంజయ్ కపూర్ (Sanjay Kapoor) ను వివాహం చేసుకున్న ఈమె.. వీరికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్ జన్మించారు. 2016లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి పిల్లల బాధ్యతను తీసుకున్న కరిష్మా కపూర్ ఒంటరిగానే పిల్లల్ని పెంచుతోంది.
also read:Sailesh Kolanu: యూట్యూబర్స్ పై డైరెక్టర్ మండిపాటు.. సమాజం చెడిపోతోంది..!
అమృతా సింగ్:
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), అమృత సింగ్ (Amrita Singh) 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి సారా, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత 2004లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అమృత ఒంటరిగానే పిల్లల్ని పెంచుతోంది. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ కరీనాకపూర్ (Kareena Kapoor) ను వివాహం చేసుకోగా.. వీరికి కూడా ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక అమృత సింగ్ విడాకుల తర్వాత ఒంటరిగానే జీవిస్తోంది. ఇక ఈమె కూతురు సారా అలీఖాన్ (Sara Ali Khan) కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
మలైకా అరోరా:
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) 1998లో అర్భాజ్ ఖాన్ (Arbaaz Khan)ను వివాహం చేసుకుంది. 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కుమారుడు అర్హాన్ జన్మించగా.. విడాకుల తర్వాత ఒంటరిగా కుమారుడితో జీవిస్తోంది.
శ్వేతా తివారీ:
1998లో రాజా చౌదరి (Raja Chaudhary) ని వివాహం చేసుకుంది శ్వేతా తివారీ(Shweta Tiwari) . వీరికి ఒక కూతురు పలక్. 2007లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత శ్వేత రెండో వివాహంగా అభినవ్ కోహ్లీను చేసుకుంది. వీరికి ఒక కుమారుడు రేయాన్ష్ ఉన్నారు. ఇక రెండో వివాహం కూడా విఫలం అవడంతో శ్వేతా తన ఇద్దరు పిల్లల్ని ఒంటరిగానే పెంచుతోంది.
పూజా బేడీ:
1990లో ఫర్హాన్ ఫర్నిచర్ వాలా ను పూజా బేడీ వివాహం చేసుకుంది. అయితే 2003లో వీరు విడాకులు తీసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూతురు అలయ ఎఫ్, కొడుకు ఉమర్. విడాకుల తర్వాత పూజా తన ఇద్దరు పిల్లల్ని ఒంటరిగానే పెంచుతుంది.
మహిమా చౌదరి:
2006లో మహిమా చౌదరి, బాబీ ముఖర్జీని వివాహం చేసుకోగా.. కూతురు అరియానా జన్మించింది. వివాహం అయిన ఏడేళ్లకు 2013లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పటినుంచి మహిమా చౌదరి కూతురిని ఒంటరిగానే పెంచుతోంది.
సంజీదా షేక్:
2012లో అమీర్ అలీని వివాహం చేసుకుంది సంజీదా షేక్. 2021 లో విడాకులు తీసుకున్నారు. సరోగసి ద్వారా ఒక కూతురు ఐరా జన్మించగా.. విడాకుల తర్వాత ఒంటరిగానే సంజీదా కూతుర్ని పెంచుతోంది.