BigTV English

Viral Video: వేగంగా వెళ్తోన్న రైలుకు వేలాడుతూ ఓవర్ యాక్షన్.. తలుపు మూసుకోవడంతో..

Viral Video: వేగంగా వెళ్తోన్న రైలుకు వేలాడుతూ ఓవర్ యాక్షన్.. తలుపు మూసుకోవడంతో..

Shocking Video: రైలు ప్రయాణం చేసే సమయంలో ప్యాసింజర్లు జాగ్రత్తగా ఉండాలని రైల్వే సంస్థలు ఎప్పటికప్పు చెప్తూనే ఉంటాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రాణాలకే ప్రమాదం అంటూ అవగాహన కల్పిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్ లపై ఫోటోలు దిగడంతో పాటు ప్రయాణిస్తున్న రైల్లో స్టంట్లు చేయకూడదని రైల్వే అధికారలు హెచ్చరికలు చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రయాణీకులు పద్దతి మార్చుకోవడం లేదు. అతి చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువతి రైలుకు వేలాడుతూ ప్రమాదకర రీతిలో ప్రయాణం చేసింది. తృటిలో చావు నుంచి బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

మునేవ్వర్ ఇసిక్ నిజాం అనే లేడీ ట్రావెలర్ తాజాగా శ్రీలంకలో పర్యటించింది. ద్వీప దేశంలోని పలు ప్రాంతాలను చూస్తూ ఎంజాయ్ చేసింది. అందులో భాగంగానే శ్రీలంకలోని ఓ ఐకానిక్ లోకల్ ట్రైన్ లో పర్యటించింది. ఈ సందర్భంగా ఆమె రైలుకు వేలాడుతూ జర్నీ చేస్తుండగా, డోర్లు క్లోజ్ అయ్యాయి. అయినప్పటికీ, బయటే వేలాడుతూ సరదాగా ముందుకు వెళ్లింది. రైలు ఆగే సమయంలో ఒక్కసారి ఆమె కాళ్లు పట్టుతప్పాయి. అప్పటికే రైలు స్లో కావడంతో పెను ముప్పు తప్పింది. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


యువతి నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం

ఈ వీడియోను సదరు యువతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాసేపట్లో నెట్టింట వైరల్ అయ్యింది. ఆమె రైలుకు వేలాడుతూ ఎంజాయ్ చేసినప్పటికీ, ప్రమాదకర రీతిలో ప్రయాణం చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. రైలు రన్నింగ్ లో ఉండగా కాలు జారితే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. సరదగా కోసం ప్రాణాలు తీసుకోవద్దని హితవు పలుకుతున్నారు. రైల్లో కూర్చొని ప్రకృతి అందాలను చూడాలే తప్ప, బయట వేలాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని మండిపడుతున్నారు. ఇలాంటి ప్రయాణీకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. వెకేషన్ లో ఎంజాయ్ చేయాలే తప్ప, ప్రాణాలు పోయే పనులు చేయకూడదంటూ మరికొంత మంది సూచిస్తున్నారు.

Read Also: రాజధాని ఎక్స్ ప్రెస్ లో పాము కలకలం.. నెట్టింట వీడియో వైరల్!

స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువత

భారత్ లో రన్నింగ్ ట్రైన్లలో స్టంట్లు చేస్తూ పలువురు యువకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే ట్రాక్ లు, రైల్వే స్టేషన్లు, ప్లాట్ ఫారమ్ ల మీద ఫోటోలు దిగడం, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది భారత్ రైల్వే సంస్థ. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని వెల్లడించింది.

Read Also: వార్ ఫీల్డ్ లో రిపోర్టింగ్.. మీదకు దూసుకొచ్చిన హెలికాప్టర్, కానీ…

Related News

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Big Stories

×