⦿ మారుమూల పల్లెలైనా..
⦿ కొండల మాటున గిరిజన గూడాలైనా..
⦿ ప్లేస్ ఏదైనా.. అక్కడ బిగ్ టీవీ మెడికల్ క్యాంప్..
⦿ తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు 107 మెడికల్ క్యాంప్‌లు..
⦿ ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
మార్చి వరకు 200కు పైగా మెడికల్ క్యాంప్‌లు నిర్వహించింది బిగ్ టీవీ. కానీ ఆదివారం ఒక్కరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 107 మెడికల్ క్యాంప్‌లు నిర్వహించి హెల్తీ సొసైటీ కోసం మేముసైతం అంటూ ముందడుగు వేసింది. ఆదివారం ఒక్కరోజే 15 వేల మందికిపైగా వైద్య పరీక్షలు నిర్వహించడమే గాకుండా.. వారికి ఉచితంగా మందులు అందించింది. మరికొంతమందికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు బిగ్ టీవీ ముందుకు వచ్చింది.
సమాజంలోని ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు.. బిగ్ టీవీ ఈ ఆరోగ్య యజ్ఞాన్ని మొదలుపెట్టింది. మనం ఆరోగ్యంగా ఉంటేనే.. మన కుటుంబం ఆనందంగా ఉంటుంది. సమాజం బాగుంటేనే.. మేమూ బాగుంటామని బలంగా నమ్ముతుంది బిగ్ టీవీ. సమాజం బాగుండాలంటే.. అంతా ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసమే.. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించింది.. భవిష్యత్తులో కూడా నిర్వహించబోతుంది బిగ్ టీవీ.
షుగర్, బీపీతో పాటు వేలాది మందికి కంటి పరిక్షలు నిర్వహించింది బిగ్ టీవీ. దీనికోసం అనేక చారిటబుల్ ట్రస్టులు, ఆసుపత్రులు మేముసైతం అంటూ బిగ్‌టీవీతో కలిసి అడుగులు వేశాయి. దీంతో ఈ మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగిందనే చెప్పాలి. దూరం వెళ్లలేకనో.. ఖర్చులకు భయపడో ఆసుపత్రులకు వెళ్లలేని అనేక మంది ఫ్రీ మెడికల్ క్యాంప్‌లను ఆశ్రయించారు.
క్యాంప్‌లకు తరలివచ్చిన ప్రజలు బిగ్ టీవీ చేసిన కృషిని అభినందించారు. తమలాంటి మారుమూల పల్లెలకు వచ్చి ఇలాంటి క్యాంప్‌లను నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్లు, రోడ్లు లేని కొన్ని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లింది బిగ్ టీవీ టీమ్. సామాజిక సేవలో మేముసైతం అంటున్న బిగ్ టీవీపై ప్రజలు ప్రశంసలు కురిపించారు.
కేవలం వైద్య పరీక్షలు చేయడం మాత్రమే కాదు.. ఆపరేషన్లు తప్పనిసరి అని గుర్తించిన వారికి.. తక్కువ ధరలకే ఆపరేషన్లు సైతం నిర్వహించేందుకు ఆసుపత్రులు ముందుకు వచ్చాయి. ఇక బాన్సువాడలో అయితే ఏకంగా 50 మంది గిరిజనులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది లయన్స్ ఐ హాస్పిటల్.
Also Read: ఒక్కరోజే 100+మెగా మెడికల్ క్యాంప్స్.. బిగ్ టీవి ఆరోగ్య యజ్ఞం.. ఇక్కడిత ఆగేది కాదు..
ఆరోగ్య సమాజం కోసం మేము సైతం అంటూ మరిన్ని అడుగులు ముందుకు వేయాలని BIG TV నిర్ణయించుకుంది. మా కృషికి ఆసుపత్రులు సహకరిస్తే.. హెల్తీ సోసైటీ ఏర్పాటు వైపు అడుగులు మరింత వేగంగా పడతాయి. సుప్రీంకోర్టు న్యాయవాది కాకర్ల చంద్రశేఖర్ గ్రామ ప్రజలు మెగా మెడికల్ క్యాంపులో పాల్గొని రానున్న రోజుల్లో బిగ్ టీవీ గ్రామీణ ప్రాంత ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని కోరుకున్నారు. టెలివిజన్ చరిత్రలో ఎక్కడా కూడా ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించలేదని.. బిగ్ టీవీ ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు.