BigTV English

BIG TV Mega Medical Camp: ఒక్కరోజే 100+ మెగా మెడికల్ క్యాంప్స్.. బిగ్ టీవీ ఆరోగ్య యజ్ఞం.. ఇక్కడితో ఆగేది కాదు..

BIG TV Mega Medical Camp: ఒక్కరోజే 100+ మెగా మెడికల్ క్యాంప్స్.. బిగ్ టీవీ ఆరోగ్య యజ్ఞం.. ఇక్కడితో ఆగేది కాదు..

BIG TV Mega Medical Camp: 10 కాదు.. 20 కాదు.. ఏకంగా 200లకు పైగా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించింది బిగ్ టీవీ. బాధ్యతాయుతమైన మీడియాగా ప్రజలు బాగుంటేనే.. మేమూ బాగుంటామని బలంగా నమ్ముతాం. సమాజహితం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం.. బిగ్ టీవీ చేపట్టిన ఈ మెగా హెల్త్ క్యాంపుల జర్నీ అప్రతిహతంగా కొనసాగుతోంది. హెల్దీ సొసైటీ కోసం ఈరోజు ఒక్కరోజే.. 100కి పైగా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించబోతోంది బిగ్ టీవీ.


మారుమూల పల్లెలు, కొండల మాటున ఉన్న గిరిజన గూడాలు, పట్టణాల్లో వైద్యానికి దూరంగా ఉన్న ప్రాంతాలు.. ఇలా వైద్యం అవసరమైన ప్రతిచోటుకి వెళ్లింది బిగ్ టీవీ. ఇప్పటికే.. 200లకు పైగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించింది. 50 వేల మందికి పైగా ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే కాదు.. వాళ్లందరికీ ఉచితంగానే మందులు పంపిణీ చేసింది. 50 మందికి పైగా.. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించింది. మరో 50 మందికి త్వరలోనే ఉచితంగా కంటి సర్జరీలు చేయబోతున్నాం. సమాజంలోని ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు.. బిగ్ టీవీ ఈ ఆరోగ్య యజ్ఞాన్ని మొదలుపెట్టింది. మనం ఆరోగ్యంగా ఉంటేనే.. మన కుటుంబం ఆనందంగా ఉంటుంది. సమాజం బాగుంటేనే.. మేమూ బాగుంటామని బలంగా నమ్ముతుంది బిగ్ టీవీ. సమాజం బాగుండాలంటే.. అంతా ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసమే.. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తోంది బిగ్ టీవీ.

ప్రజారోగ్యమే పరమావధిగా పల్లెలు, ఊళ్లు, పట్టణాలే కాదు.. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి, వైద్య సదుపాయాలు అసలే అందుబాటులో లేని వాళ్లకు కూడా మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా.. బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ ఆరోగ్య యజ్ఞం ఇక్కడితో ఆగేది కాదు. ఇక ముందు కూడా కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. బిగ్‌ టీవీ అంటే ఓ న్యూస్ ఛానల్‌ మాత్రమే కాదు! సమాజ హితం కోసం పాటు పడే సంస్థ! ఆర్థిక పరిస్థితులు అనుకూలించకో.. గ్రామీణ నేపథ్యమో, ఇతర సమస్యల వల్లో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించలేని వాళ్ల కోసం.. హెల్త్ క్యాంపుల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ.. అవసరమైన మందులను అందిస్తోంది బిగ్ టీవీ. అవసరమైతే.. సర్జరీలు కూడా చేయిస్తోంది.


పేదవాడికి వైద్యపరీక్షలు చేయడానికి, ఉచితంగా మెడిసిన్స్‌ ఇవ్వడానికి మేమున్నాం అంటూ బిగ్‌ టీవీ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు 200కు పైగా క్యాంపులు నిర్వహించి.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.ఇవాళ ఒక్కరోజే ఏకంగా 100కి పైగా క్యాంపులు ఏర్పాటుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 4 చోట్ల క్యాంపులు పెట్టనుంది. తాళ్లపూడి మండలం గజ్జరంలో శ్రీ సాయి స్ఫూర్తి హాస్పిటల్, తణుకు నియోజకవర్గంలో సితార హాస్పిటల్ అత్తిలి లయన్స్ క్లబ్, చింతలపూడి బోయగూడెంలో సాయి స్ఫూర్తి హాస్పిటల్, నిడదవోలులో రాజమండ్రి పల్స్‌ హాస్పిటల్‌ సహకారంతో క్యాంపులు జరగనున్నాయి.

Also Read: టెలివిన చరిత్రలో బిగ్ టీవీ సంచలనం.. ఫ్రీ హెల్త్ క్యాంప్‌లలో డబుల్ సెంచరీ

ఈ మెగా ఉచిత మెడికల్ క్యాంపులకు వస్తున్న ఆదరణ.. బిగ్‌ టీవీపై మరింత బాధ్యతని పెంచింది. ఈ మంచిపనికి ఆస్పత్రులు ముందుకొచ్చి సహకారం అందిస్తే.. ఈ గొప్ప కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళతాం! వైద్య సదుపాయం అందుబాటులో లేని ప్రతి చోటుకు వెళ్లి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే ప్రయత్నం చేస్తాం. అప్రతిహతంగా కొనసాగుతున్న ఈ మెగా హెల్త్ క్యాంప్ జర్నీ.. ఇక ముందు కూడా కొనసాగుతుంది. నిరుపేదల ఆరోగ్య సమస్యలకు.. పరిష్కారం చూపుతుంది.

Related News

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

Big Stories

×