OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. లవ్ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాలలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ లో కూడా రొమాన్స్ సన్నివేశాలతో పాటు, ట్రూ లవ్ కూడా ఉంటుంది. 15 సంవత్సరాల అమ్మాయి 32 సంవత్సరాల ధనవంతుడుతో ప్రేమలో పడుతుంది. వీళ్ళిద్దరి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో ( amazon prime prime video) లో
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘ది లవర్’ (The Lover). 1992లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి జాక్వెస్ అన్నాడ్ దర్శకత్వం వహించారు. 1984లో జీన్- మార్గరీట్ డ్యూరాస్ రాసిన సెమీ-ఆటోబయోగ్రాఫికల్ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఒక టీనేజ్ ఫ్రెంచ్ అమ్మాయి, సంపన్న చైనీస్ వ్యక్తికి మధ్య జరిగిన అక్రమ సంబంధాన్ని ఈమూవీ వివరిస్తుంది. ఈ మూవీలో జీన్ మోరో కధానాయికగా నటించారు. ఈ మూవీ 1992 అకాడమీ అవార్డుకు ఉత్తమ సినిమాటోగ్రఫీకి నామినేట్ చేయబడింది. ఇది ఫ్రాన్స్‌లోని ఏడు సీజర్ అవార్డులకు నామినేట్ అయింది. ఇందులో ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ ఫ్రాన్స్‌లో బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ( amazon prime prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
15 సంవత్సరాల సారా హాస్టల్లో చదువుకుంటూ ఉంటుంది. ఈమెకు తండ్రి లేక పోవడంతో, తల్లి చదివిస్తూ ఉంటుంది. సారాకి ఇద్దరు బ్రదర్స్ కూడా ఉంటారు. ఒకరోజు సారాను 32 సంవత్సరాల హీరో చూసి ప్రేమలోపడతాడు. హీరో చైనా దేశానికి సంబంధించిన ఒక ధనవంతుడు. అయితే సారా ఒక ఫ్రెంచ్ అమ్మాయి. మొదటి చూపులోనే సారాకి పడిపోతాడు హీరో. అలా వీళ్ళిద్దరి పరిచయం పడక వరకు వెళ్లి పోతుంది. ప్రతిరోజు హీరో దగ్గరికి వచ్చి గడుపుతూ ఉంటుంది. హీరో కూడా ఆమెతో గడుపుతూ, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తన కుటుంబ పరిస్థితులు బాగా లేవని హీరోకి చెప్తుంది సారా. డబ్బుల గురించి నాతో పడుకుంటుందేమో అని అనుకుంటాడు హీరో. ఆ తర్వాత ఈ విషయం స్కూల్లో కూడా తెలుసి అందరూ సారాను హేళన చేస్తారు. హీరో తన తండ్రితో సారాని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అయితే తండ్రి మాత్రం దాని కన్నా నువ్వు చనిపోవడం మంచిదని చెప్తాడు. హీరోకి, సారాని మర్చిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. మరోవైపు సారా కూడా హీరోని చాలా ఘాఢంగా ప్రేమిస్తూ ఉంటుంది. చివరికి వీళ్ళిద్దరి ప్రేమ ఏమవుతుంది? పడకగదికే పరిమితమవుతుందా? హీరో మరొకరిని పెళ్లి చేసుకుంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ( Amazon prime prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది లవర్’ (The Lover) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.