E-Paper
Advertisement

Rahul Gandhi: జోడో యాత్రకు బాంబు బెదిరింపు.. రాహుల్ భద్రత పెంపు..

Rahul Gandhi: జోడో యాత్రకు బాంబు బెదిరింపు.. రాహుల్ భద్రత పెంపు..
Advertisement

Rahul Gandhi: భారత్ జోడో యాత్ర ఫుల్ జోష్ తో సాగుతోంది. పాదయాత్రతో రాహుల్ గాంధీకి మరింత మైలేజ్ వస్తోంది. జోడో యాత్రతో కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం రెట్టింపవుతోంది. రాహుల్ ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ జోడో యాత్రకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ కు వస్తే బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జోడో యాత్రకు బాంబు బెదిరింపులు రావడానికి సావర్కర్ వివాదమే కారణమా? అని అనుమానిస్తున్నారు.

మహారాష్ట్రలో జరుగుతున్న యాత్రలో రాహుల్ గాంధీ సావర్కర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. సావర్కర్ బ్రిటిష్ వారికి సలామ్ చేశారంటూ.. ఆయన రాసిన క్షమాపణ పత్రాలంటూ మీడియా ముందు ఉంచడం కలకలం రేపింది. సావర్కర్ పై రాహుల్ చేసిన కామెంట్లపై బీజేపీ వాదులు భగ్గుమనగా.. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయంగా కీలక పరిణామం. ఇదే విషయంపై కాంగ్రెస్ తో పొత్తును సైతం వదులుకోవడానికి ఠాక్రే రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

నవంబర్ 20న రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ లో ప్రవేశించనుంది. ఆ రాష్ట్రంలోనే ఆర్ఎస్ఎస్ మెయిన్ క్యాంపస్ ఉంది. సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యల అనంతరం.. మధ్యప్రదేశ్ లో బాంబు బెదిరింపు లేఖ బయటపడటంతో దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో భారత్ జోడో యాత్రికులు బస చేస్తే.. నగరంలో బాంబు పేలుళ్లు చేపడతామని ఆ లేఖలో వార్నింగ్ ఇచ్చారు. అయితే, రాహుల్ నే టార్గెట్ చేసుకున్నట్టు లేఖలో లేకున్నా.. ఎందుకైనా మంచిదని రాహుల్ గాంధీతో పాటు జోడో యాత్రకు భద్రత మరింత కట్టుదిట్టం చేయనున్నారు.

Related News

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

సైలెంట్‌గా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సీరియస్.. కాంగ్రెస్‌కు జై కొడతారా?

తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ దళిత్ వర్సెస్ దొరలు.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!

అసెంబ్లీలో BRS వ్యూహం రివర్స్.. ప్రభుత్వం చేతికి చిక్కిన ప్రతిపక్షం!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

ఇక కురుక్షేత్రమే వచ్చే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా: జగన్

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!

Big Stories

Advertisement
×